S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/15/2020 - 04:21

విద్యాలయాలు విద్యార్థుల్లో అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని వికసింపచేసే జ్ఞాన కేంద్రాలు. ప్రాచీన కాలంనుండి నేటివరకు విద్యాలయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ వారి సమగ్రాభివృద్ధికి ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. తద్వారా తన జీవితంలోని ఎదురయ్యే ప్రతి సమస్యను శాస్ర్తియంగా పరిష్కరించుకునే సాధికారతను పెంపొందించడానికి ముఖ్య కేంద్రాలుగా విద్యాసంస్థలు దోహదపడతాయి.

01/14/2020 - 04:27

దేశం ఇప్పడొక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో కొన్ని రాజకీయ శక్తులు, వ్యక్తులు తమ పబ్బం గడుపుకునేందుకు ఆత్రుత పడుతున్నారు. దేశంలో తప్పుడు భావజాలాన్ని పాదుకొల్పేందుకు తమ శక్తినంతా ధారపోసే పనిలో పడ్డారు. ఏడు దశాబ్దాల క్రితం దేశ విభజన సమయంనాటి పరిస్థితులను, భావజాలాన్ని, దుష్ప్రచారాన్ని ఇప్పుడు పునరావృత్తం చేస్తున్నారనిపిస్తోంది.

01/13/2020 - 00:00

ఆ వర్చస్సు...
కోటి కాంతులు తేజస్సు
ఆ మేధస్సు ప్రపంచ ఉషస్సు

ఆ వ్యక్తిత్వం మహోన్నతం
ఆ ఆశయం మహోజ్వలనం

ఆ స్వరం ‘‘శాంతి’’ సందేశం
ఆ హాసం ‘‘స్వేచ్ఛా’’ ప్రవాహం

ఆ ప్రబోధం మానవ జీవన వేదం
ఆ ప్రసంగం విశ్వవికాస నాదం

మొత్తంగా...
విశ్వ తేజోన్ముఖుడు
స్వామి వివేకానందుడు

రామకృష్ణుని ప్రియశిష్యుడు
సకల లోక కాంతి ప్రసాధితుడు

01/13/2020 - 00:02

లేవండి.. మేల్కోండి..
గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..
లేవండి.. మేల్కోండి..
మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని,
ఇతరులనూ మేల్కొల్పండి..
మీరు మరణించేలోపు
జీవిత పరమావధిని సాధించండి..
లేవండి.. మేల్కోండి..
గమ్యం చేరేవరకు ఎక్కడా నిలవకండి..
ఎప్పుడూ జాగృతగానే ఉండండి..
బలమే జీవితం.. బలహీనతే మరణం..

01/12/2020 - 23:57

నేడు శ్రీవారి జయంతి
*
‘‘ఈశ్వరే నిశ్చితాబుద్ధిః
దేశార్థంజీవన స్థితిః
పృధివ్యాంబంధువద్వృత్తిః
ఇతి కర్తవ్యతాం సదా’’

01/12/2020 - 05:20

ఒక జాతిని సమైక్యంగా ఉంచేవి మతం, భాష. మతం ఒక్కటిగా భాషలు భిన్నంగాఉన్నా ఆ మతానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. ఎందువల్లనంటే సంస్కృతీ సంప్రదాయాలు నేర్పేది మతం. ఆచార వ్యవహారాలు, పూజలు పురస్కారాలు మతంనుండే గ్రహించబడేవి. అందువల్ల భాషలు వేరైనా, జాతీయుల మధ్య ఆత్మీయత పెంపొందుతుంది.

01/10/2020 - 01:41

డా.అక్కిరాజు రమాపతిరావుగారు పేరెన్నికగన్న రచయిత. తరతరాలుగా పండితులు, విద్వత్కవులు వెలసిన ‘అక్కిరాజు’ వంశం వీరిది. ముఖ్యంగా వీరి పెద తాతగారు అక్కిరాజు ఉమాకాంతశేఖరులు నవద్వీపంలో ‘విద్యాశేఖర’ బిరుదాంకితులు. మహాపండితులు, ఉన్నతశ్రేణి విమర్శకులు, ‘నేటికాలపు కవిత్వ’ గ్రంథకర్త. రమాపతిరావుగారి తమ్ముడు అక్కిరాజు సుందర రామకృష్ణగారు. కవి, గాయకుడు, నాటక ప్రయోక్త.

01/09/2020 - 01:59

దేశంలో ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్’ జరుపుకుంటారు. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకుని దీన్ని నిర్వహిస్తారు. ఆయన వచ్చిన వెంటనే స్వాతంత్య్రోద్యమానికి శ్రీకారం చుట్టి భారతీయుల జీవితాల్లో మరుపులేని మార్పును తెచ్చారు. ప్రవాసీ భారతీయ దివస్‌ని 2003నుంచి నిర్వహిస్తున్నారు.

01/08/2020 - 23:10

కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ఆరంభమైంది. ఇది కృత్రిమమేధ (ఏఐ) నామ సంవత్సరం... దశాబ్దంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కీలక పాత్రను పోషిస్తున్న కృత్రిమ మేధ రాబోయే కాలంలో మరింత ముఖ్య భూమికను పోషించనున్నది.

01/08/2020 - 02:44

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, సూడో సెక్యులరిస్టులు, మేధావులుగా చెలామణి అయ్యే ‘లిబరల్స్’ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే బిల్లులను వ్యతిరేకించడంలోనే కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల చర్యలను సమర్ధించేందుకు వీరంతా పడరానిపాట్లు పడుతుంటారు. దేశాన్ని వెయ్యిముక్కలు చేయాలని పిలుపునిచ్చే కన్నయ్య కుమార్‌లను వీరు అక్కున చేర్చుకుంటారు.

Pages