S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/27/2020 - 00:01

ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాలలో కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు నేడు ‘‘్భగోళిక సంక్షోభం’’గా పరిగణింపబడుతోంది. ఈ సంక్షోభం భౌగోళిక వాతావరణంపై, వివిధ పనితీరుపై అవాంఛనీయ ప్రభావాన్ని చూపబోతోందని పర్యావరణ శాస్తవ్రేత్తలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముంబయి పశ్చిమ తీరాన వెర్సోవా బీచ్ ఉంది. ఒకప్పుడు ముంబాయిలోని ప్లాస్టిక్ చెత్తంతా అక్కడే తాండవిస్తుండేది.

02/25/2020 - 00:11

నిరుద్యోగ సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావమేమిటో చూపుతుందని ఇటీవల వివిధ సంస్థలు వెల్లడించిన నివేదికలు చూస్తుంటే అర్థమవుతున్నది. ప్రపంచ నిరుద్యోగిత రేటు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. చేయడానికి పనులు లేక నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్ నివేదికను సమర్పించింది.

02/24/2020 - 23:49

నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మూలంగా నూతనంగా బడ్జెట్ సమర్పణలో కేంద్ర ఆర్థిక మంత్రి ఆచితూచి అడుగులేశారు. కొత్త పథకాల జోలికెళ్లి వ్యయాన్ని పెంచడం, రుణభారాన్ని మరింత నెత్తుకోకుండా జాగ్రత్తపడ్డారు. ఆదాయానికి, వ్యయానికి మధ్య పొంతన కుదరడం లేదన్నది వాస్తవమే. ఈ దఫా బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు భారీగా కేటాయింపులు జరపడం నిజంగా శుభ సూచకమే.

02/24/2020 - 23:44

గాడ్గేబాబా అసలు పేరు దేవీదాస్ దేబూజీ. ఆయన 1876 ఫిబ్రవరి 23న మహారాష్టల్రోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించినా తండ్రి తాతల కాలంనుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు. తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు.

02/22/2020 - 22:33

‘‘నేను చివరి జన్మలో ఉన్నాను. నా తండ్రి చేసుకున్న పుణ్యంవల్ల నేను వారి పుత్రునిగా జన్మించాను. నాది తీవ్రమైన తపస్సు. కనుక భక్తులెవరూ నా తపస్సుకు భంగం కలిగించరాదు. ఎంత గొప్పవారు వచ్చినా తలుపులు తీయరాదు.

02/19/2020 - 00:21

నేడు ఛత్రపతి శివాజీ జయంతి
*

02/19/2020 - 00:16

నేడు మాధవ్ సదాశివ గీళ్వాల్కార్ (గురూజీ) 115వ జయంతి
*
నేను దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం పాడిన మహామనస్వి, యశస్వి, జాతికోసం అహరహం తపించిన తపస్వి గురూజీ 1906 నాగపూర్‌లో జన్మించారు.

02/18/2020 - 02:13

దేశంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంత వేగంగా పరిగెడుతుందో, మొబైల్ ద్వారా అరచేతిలోకి అంతర్జాలం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, చివరికి ఏవౌతుందోనన్న అనుమానం, ఆశ్చర్యం సగటు మానవుణ్ణి కలవరపెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు మనిషి కరెన్సీ లేకుండా లావాదేవీలు జరుపుతున్నాడు.

02/16/2020 - 02:58

దేశంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ముఖ్యంగా దశాబ్దాలుగా నానుతున్న సాయుధ ఘర్షణలకు తావిస్తున్న బోడో సమస్యపై కేంద్రం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
అస్సాంలోని నాలుగు జిల్లాలతో కూడిన బోడోల్యాండ్ కోసం దశాబ్దాలుగా హింసాత్మక ఉద్యమాలు జరుగుతున్నాయి. వేల మంది బలిదానాలు చేశారు. తాజా ఒప్పందంతో అక్కడ ఇప్పుడు కొత్త ఉషోదయం తొంగి చూసింది.

02/15/2020 - 23:40

నేడు ధర్మభిక్షంగారి జయంతి
*

Pages