S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/09/2018 - 00:17

‘‘ఏంటి రామయ్యా ఆఫీసుకు దగ్గరగా ఉందని, మీ మెస్‌కు వస్తున్నాం, రోజు రోజుకు కూరల రుచి తగ్గిపోతోంది. ఉప్పు ఎక్కువేసినట్టున్నావ్! రోజూ కూరలు గడ్డితింటున్నట్టుగా ఉన్నాయ్! ఉప్పు ఎందుకెక్కువ వేశావ్!’’
‘‘కూరలో ఉప్పు ఎక్కువేయడం చారిత్రక అవసరం బాబూ అవసరం. అంతే కానీ కూర వండలేక కాదు బాబు వండలేక కాదు. ’’

11/09/2018 - 00:12

నేడు మహాకవి ఇక్బాల్ జయంతి
*
‘‘సమస్త ప్రపంచములో
మెరుగైనది హిందూస్థానము
కల స్వనముల విహంగాలము మనము
ఇది మన నందన వనము
భారతీయులందరూ ఒకే మతానికి చెందినవారు,
మన నాగరికత చాలా గొప్పదని’’-

11/07/2018 - 01:46

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఒకతాటిపై నిలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పూనుకోవడం పట్ల అటు ఏపీలోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశానికి బద్ధ శత్రువులైన కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఈ కలయికను జీర్ణించుకోలేక పోతున్నారు. నిబద్ధత గల తెదేపా నాయకులు కూడా చంద్రబాబు చర్యలను సమర్థించుకోలేకపోతున్నారు.

11/04/2018 - 02:36

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప!
దానాలన్నింటిలో వాగ్దానం అతి తేలిక!!

10/31/2018 - 17:51

అలనాడు బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించేటప్పటికి అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టి వస్తుందని’. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రచార మాధ్యమాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చేసిన ప్రచారం- చర్చిల్ వ్యాఖ్యలకు అక్షరాలా అద్దం పడుతుంది.

10/31/2018 - 01:08

అహో.. భారత స్వాతంత్య్ర సమరయోధాగ్రణీ
మహనీయ భారత కర్షకాగ్రమణీ,
పటేల్ సర్దార్! అందుకో మా జోహార్

గతకాలపు తెరల మాటున గడచిపోయావ్
భౌతికంగా
ఘన స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయావ్
శాశ్వతంగా!

నీకు మరణం లేదు-
మా మానస్సుల్లో నీ స్మరణం మాసిపోదు
నీ జయంతి భారత జాతికి నిత్య స్ఫూర్తి
నీరాజనాలతో స్మరిస్తున్నాం నీ ఘనకీర్తి

10/28/2018 - 03:21

ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు బ్యానర్లు కడుతున్నారు. తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపుకోసం సర్వం ఒడ్డుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. దండకారణ్యంలో భారీ సంఖ్యలో సి.ఆర్.పి.ఎఫ్.

10/26/2018 - 01:15

ప్రకృతి జ్ఞానానికి మూలం. గణితంలో చాలా కానె్సప్ట్స్ ప్రకృతి నుంచే తీసుకున్నారు. గణితానికి, సైన్స్‌కు అన్యోన్య సంబంధం ఉంది. అందుకే గణితాన్ని ‘సైన్స్‌కు కావాల్సిన వాఙ్మయం’ అంటారు. సైన్స్‌కు ప్రయోగం ప్రధానం. పిల్లవాడు- ‘నాన్నా.. ఆ నీడ సూర్యుడు పెరిగిన కొద్దీ పెరుగుతోంది ఎందుకు?’ అని ప్రశ్నిస్తాడు. ఒక వ్యక్తి నల్లగా, మరో వ్యక్తి ఎర్రగా ఎందుకు పుట్టారని మరో విద్యార్థి అడుగుతాడు.

10/24/2018 - 02:21

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్రికలకు గద్దర్ ఒక ప్రకటన జారీ చేశారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్ సభలను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటివరకూ మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా వ్యవహరించిన గద్దర్ ఇప్పుడు రాజకీయంగా ‘యూ టర్న్’ తీసుకున్నారు. దీనికి కారణం ‘పుత్ర వాత్సల్యం’.

10/24/2018 - 02:23

నేడు కుంరం భీం 78వ వర్ధంతి
*
గోండుల హక్కుల సాధన కోసం ‘జంగ్ సైరన్’ మోగించిన ఓ పోరాట యోధుడి జీవిత చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ఆ మహావీరుని పోరాట పటిమ, అరాచక శక్తులపై ఆయన సాగించిన సమరం గురించి నేటి తరం వారు తెలుసుకోవాలి. ఆదివాసీ పోరాట యోధుడు కుంరం భీమ్ జీవితానికి సంబంధించి తగినంత ప్రచారం లేదనే చెప్పాలి.

Pages