S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
ఒక జాతిని సమైక్యంగా ఉంచేవి మతం, భాష. మతం ఒక్కటిగా భాషలు భిన్నంగాఉన్నా ఆ మతానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. ఎందువల్లనంటే సంస్కృతీ సంప్రదాయాలు నేర్పేది మతం. ఆచార వ్యవహారాలు, పూజలు పురస్కారాలు మతంనుండే గ్రహించబడేవి. అందువల్ల భాషలు వేరైనా, జాతీయుల మధ్య ఆత్మీయత పెంపొందుతుంది.
డా.అక్కిరాజు రమాపతిరావుగారు పేరెన్నికగన్న రచయిత. తరతరాలుగా పండితులు, విద్వత్కవులు వెలసిన ‘అక్కిరాజు’ వంశం వీరిది. ముఖ్యంగా వీరి పెద తాతగారు అక్కిరాజు ఉమాకాంతశేఖరులు నవద్వీపంలో ‘విద్యాశేఖర’ బిరుదాంకితులు. మహాపండితులు, ఉన్నతశ్రేణి విమర్శకులు, ‘నేటికాలపు కవిత్వ’ గ్రంథకర్త. రమాపతిరావుగారి తమ్ముడు అక్కిరాజు సుందర రామకృష్ణగారు. కవి, గాయకుడు, నాటక ప్రయోక్త.
దేశంలో ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్’ జరుపుకుంటారు. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకుని దీన్ని నిర్వహిస్తారు. ఆయన వచ్చిన వెంటనే స్వాతంత్య్రోద్యమానికి శ్రీకారం చుట్టి భారతీయుల జీవితాల్లో మరుపులేని మార్పును తెచ్చారు. ప్రవాసీ భారతీయ దివస్‌ని 2003నుంచి నిర్వహిస్తున్నారు.
కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ఆరంభమైంది. ఇది కృత్రిమమేధ (ఏఐ) నామ సంవత్సరం... దశాబ్దంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కీలక పాత్రను పోషిస్తున్న కృత్రిమ మేధ రాబోయే కాలంలో మరింత ముఖ్య భూమికను పోషించనున్నది.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, సూడో సెక్యులరిస్టులు, మేధావులుగా చెలామణి అయ్యే ‘లిబరల్స్’ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే బిల్లులను వ్యతిరేకించడంలోనే కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల చర్యలను సమర్ధించేందుకు వీరంతా పడరానిపాట్లు పడుతుంటారు. దేశాన్ని వెయ్యిముక్కలు చేయాలని పిలుపునిచ్చే కన్నయ్య కుమార్‌లను వీరు అక్కున చేర్చుకుంటారు.
ప్రపంచమంటే ఏమిటి..? భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా... ఇలా వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రజలే ప్రపంచమంటే! ఈ ప్రజలలో ఆస్తికులున్నారు, నాస్తికులున్నారు, భౌతికవాదులున్నారు. ఇంకా అనేక రకాల ఆలోచనా ధోరణులున్నవారున్నారు. ఈ ప్రపంచాన్నీ, సకల చరాచర జగత్తునూ నడిపే పరమశక్తి ఒకటుంది. అది అందరికీ వర్తిస్తుంది. నమ్మిన వారికీ, నమ్మని వారికీ అందరికీనూ. ఆస్తికులు ఆ శక్తిని దేవునిగా ఆరాధిస్తారు.
ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్లభాషను మాధ్యమంగా చేయదలచుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఏవేవో గగన కుసుమాల్ని చూపిస్తూ ఆంగ్లభాషపై మోజును పెంచడం దురదృష్టం. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి రాజకీయ ప్రముఖులు వారి పిల్లలను ఏ మాధ్యమంలో చదివించారో ఆలోచించాలని ప్రజలను రెచ్చగొట్టి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎలాగైనా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది.
భారతదేశ ముస్లింలు వివక్షకు, అణచివేతకు గురవుతున్నారని చాలాకాలంగా కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, కొందరు లిబరల్స్ ఆరోపిస్తున్నారు. ఆందోళనలు లేవనెత్తారు. పౌరసత్వ సవరణ చట్టం సందర్భంలోనైతే వీధుల్లోకి వచ్చి వీరంగం వేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. హింసాత్మక సంఘటనలకు తెగబడ్డారు.
2019 అలా వచ్చి ఎనె్నన్నో ఘటనలను, విచిత్రాలను, అనుభూతుల్ని మన కందించి ఇక మీ జీవితాల్లోకి తొంగి చూడను అంటూ అదృశ్యమైపోయింది. జరిగిన సంఘటనలు కోకొల్లలైనా, జీవితాంతం గుర్తుండిపోయేవి, మనందర్నీ ఆలోచనల్లో పడేసినవి మాత్రం చాలానే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 21న తెలంగాణాలోని మల్కాజిగిరి మీర్జాలగూడలో జరిగిన సంఘటన మాత్రం సభ్య సమాజాన్ని తట్టిలేపి, మగాళ్ళుగా వున్న మనందర్నీ సిగ్గుతో తలవంచుకొనేలా చేసింది.
ఏదైనా మంచి పని చేద్దాం రండి అంటే రాని మన సమాజం దోచుకుందాం రా.. అంటే మన సమాజం లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ‘మమ్మల్ని పరిపాలించండి సార్’ అని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం అంటేనే పాలన అన్నట్లుగా వ్యవహరిస్తుంది రాజకీయం.