S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/22/2017 - 22:23

లాహోర్, నవంబర్ 22: 26/11 ముంబయి పేలుళ్ల సూత్రధారి, ప్రముఖ ఉగ్రవాద సంస్థ జమాత్- ఉద్- దవా (జెయుడి) అధినేత హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని పంజాబ్ న్యాయస్థానం బుధవారం నాడు ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి హఫీజ్ గృహనిర్బంధంలో ఉండగా, ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

11/22/2017 - 22:15

వాషింగ్టన్, నవంబర్ 22: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సభ్యుడిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికైనందుకు అమెరికా అభినందనలు తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుత వీటో వ్యవస్థలో సంస్కరణలకు మాత్రం అగ్రరాజ్యం విముఖత చూపుతోంది. 15 మంది సభ్యులుండే ఐసీజేలో పదవికోసం బ్రిటన్, భారత్ పోటీ పడిన సంగతి తెలిసిందే.

11/22/2017 - 03:12

నైజీరియా, నవంబర్ 21: ఈశాన్య నైజీరియాలోని ఓ మసీదులో దారుణం చోటుచేసుకుంది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో కనీసం 50మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘాతుకం బోకో హారమ్ జిహాదీల పనేనని పోలీసులు వెల్లడించారు. అడమావా రాజధాని యోలాకు 200 కిలోమీటర్ల దూరంలోని ముబి పరిధిలోని ఉంగువార్ షువా మసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది.

11/22/2017 - 01:45

న్యూయార్క్, నవంబర్ 21: మండలి పెత్తనాన్ని, తన పలుకుబడిని ఉపయోగించి అంతర్జాతీయ న్యాయస్థానంలో పైచేయి సాధించాలన్న బ్రిటన్ కుయుక్తి భారత్ యుక్తి ముందు చిత్తయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన అంతర్జాతీయ న్యాయస్థానం చివరి న్యాయమూర్తి ఎంపికలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఐసీజే న్యాయమూర్తిగా భారత్ నుంచి దల్వీర్ భండారి మరోసారి ఎన్నికై సత్తా చాటారు.

11/21/2017 - 02:47

బీజింగ్, నవంబర్ 20: ఇప్పటివరకూ మనం ఖండాంతర క్షిపణులనే చూశాం. అంతర్జాతీయంగా అన్ని విధాలుగా దూసుకుపోతున్న చైనా మరో రెండడుగులు ముందుకేసి ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా చేధించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణిని త్వరలోనే పరీక్షించబోతోంది.

11/21/2017 - 02:41

ఇస్లామాబాద్, నవంబర్ 20: పాకిస్తాన్‌లోని సింథ్ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వ్యాన్‌ను బొగ్గు లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో 27మంది చనిపోయిన ఘటన మరిచిపోకముందే మళ్లీ ఈ దారుణం చోటుచేసుకుంది. ఖైర్‌పూర్ ప్రాంతంలోని తెహ్రీ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

11/21/2017 - 02:50

బీజింగ్, నవంబర్ 20: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. ఈ ప్రాంతంపై మొదటినుంచీ వివాదాన్ని రేకెత్తిస్తూ వచ్చిన డ్రాగన్, తాజాగా భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ విషయంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని భారతదేశం జఠిలం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

11/20/2017 - 02:46

బీజింగ్, నవంబర్ 19: చైనా కొత్త రాయబారిగా గౌతమ్ బంబావాలే సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గౌతమ్ ఇప్పటివరకు పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు భూటాన్ రాయబారిగా పనిచేసిన ఆయన 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. చైనాలో భారత రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

11/20/2017 - 02:43

న్యూయార్క్, నవంబర్ 19: భారత్- బ్రిటన్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో దౌత్యపరమైన సమరం రాజుకుంటోంది. అంతర్జాతీయ న్యాయమూర్తి పదవికి భారత్ తరఫున పోటీచేస్తున్న దల్వీర్ భండారీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన ఎన్నికకు దెబ్బకొట్టడనికి బ్రిటన్ అన్ని విధాలుగానూ కుయుక్తులు పన్నుతోంది.

11/19/2017 - 03:22

బీజింగ్, నవంబర్ 18: టిబెట్‌లోని నింగ్చీ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో శనివారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఆస్తినష్టం భారీగానే జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ విలయంలో ఎవరూ మరణించలేదని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి.

Pages