S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/20/2018 - 05:21

వాషింగ్టన్, జూన్ 19: ‘స్పేస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెంటగాన్‌కు ఆదేశాలు జారీచేశారు. ప్రపంచంలో ‘అమెరికా ఆధిపత్యం’ కొనసాగాలంటే ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా, రష్యాలనుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో ఆయన ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ‘స్పేస్ ఫోర్స్’ ఏవిధంగా ఉంటుంది? దాని విధివిధానాల వివరాలు స్పష్టంగా బయటకు వెల్లడి కాలేదు.

06/19/2018 - 02:53

వాషింగ్టన్, జూన్ 18: అమెరికాలో భారత్ పరువుబజారున పడేసిన హైటెట్ వ్యభిచారం కేసులో భారత సంతతికి చెందిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టాలీవుడ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, వ్యభిచారం, లైంగిక వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్న విమర్శల్లో నిజం లేకపోలేదని తాజా ఉదంతం స్పష్టం చేస్తున్నది.

06/19/2018 - 04:46

టోక్యో, జూన్ 18: జపాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, రెండు వందలకుపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు పెద్దపెద్ద భవనాలు ఊగిపోవడం, నీటిపైపులు పేలిపోవడం వంటి సంఘటనలు జరిగినట్టుగా టెలివిజన్ దృశ్యాలను బట్టి స్పష్టమవుతున్నది.

06/18/2018 - 03:51

కానో (నైజీరియా), జూన్ 17: ఈశాన్య నైజీరియాలో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో కనీసం 31 మంది మృతి చెందారు. క్షతగాత్రుల సంఖ్య వందల సంఖ్యలో ఉంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బొర్నో రాష్ట్రం దంబోవా నగరంలో భక్తులు ప్రార్థనలు ముగించుకొని ఇళ్లకు వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని స్థానిక మీడియా తెలిపింది.

06/18/2018 - 03:49

ఆమ్‌స్టర్‌డామ్, జూన్ 17: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అతి పెద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని భారత ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం ప్రారంభించారు. నగరంలోని మ్యూజియంప్లెయిన్ (మ్యూజియం స్క్వేర్) వద్ద, భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు.

06/17/2018 - 03:48

బటీకోట్ (ఆఫ్గనిస్తాన్), జూన్ 16: బాంబు పేలుళ్ల మోత.. ఫిరంగుల దాడులతో నిత్యం యుద్ధవాతావరణ ఉండే తూర్పు ఆఫ్గనిస్తాన్‌లో శనివారం ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నంగర్‌హర్ రాష్ట్రంలోని బటీకోట్ జిల్లాలో తాలిబన్ తీవ్రవాదులు, ఆఫ్గనిస్తాన్ భద్రతా సిబ్బంది ఒకర్నొకరు ఆలింగనం చేసుకోవడంతోపాటు సెల్ఫీలు దిగారు. ముస్లింల పర్వదినం ఈద్ రెండోరోజూ ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాయి.

06/17/2018 - 03:44

లాహోర్, జూన్ 16: ముంబయి దాడుల కుట్రదారుడు, కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ రంజాన్ సందర్భంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ప్రార్ధనలు నిర్వహించారు. హఫీజ్ ఏర్పాటు చేసిన సంస్థలను పాకిస్తాన్ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. స్టేడియం వెలుపల,లోపల పోలీసులు, హఫీజ్ అనుచరులు గట్ట్భిద్రతను కల్పించారు.

06/17/2018 - 03:42

బీజింగ్, జూన్ 16: అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అదనపు సుంకాలను చైనా విధించింది. చైనా అమెరికా నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా చైనాకు చెందిన వస్తువులపై 25 శాతం టారిఫ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ధీటుగా చైనా వెంటనే స్పందించింది. ప్రపంచంలో అమెరికా, చైనాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలు.

06/17/2018 - 03:41

వాషింగ్టన్, జూన్ 16: ఇటీవల జరిగిన జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సులో తన మాటనెగ్గలేదన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సభ్య దేశాలపై చెలరేగిపోయారు. ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ జీ7 సమావేశంలో చోటుచేసుకున్న అంశాలను వెల్లడించింది. జపాన్ ప్రధాని షింజోఅబేను ఉద్దేశించి ట్రంప్ ‘25 మిలియన్న మెక్సికన్‌లు మీ దేశానికి పంపుతా. జాగ్రత్త.

06/17/2018 - 03:54

లండన్: బ్రిటన్ ప్రభుత్వం తాజాగా రూపొందించిన విద్యార్థుల స్టడీ వీసాల జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూకే వర్శిటీల్లో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులు వీసా జారీల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

Pages