S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/22/2017 - 01:45

న్యూయార్క్, నవంబర్ 21: మండలి పెత్తనాన్ని, తన పలుకుబడిని ఉపయోగించి అంతర్జాతీయ న్యాయస్థానంలో పైచేయి సాధించాలన్న బ్రిటన్ కుయుక్తి భారత్ యుక్తి ముందు చిత్తయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన అంతర్జాతీయ న్యాయస్థానం చివరి న్యాయమూర్తి ఎంపికలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఐసీజే న్యాయమూర్తిగా భారత్ నుంచి దల్వీర్ భండారి మరోసారి ఎన్నికై సత్తా చాటారు.

11/21/2017 - 02:47

బీజింగ్, నవంబర్ 20: ఇప్పటివరకూ మనం ఖండాంతర క్షిపణులనే చూశాం. అంతర్జాతీయంగా అన్ని విధాలుగా దూసుకుపోతున్న చైనా మరో రెండడుగులు ముందుకేసి ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా చేధించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణిని త్వరలోనే పరీక్షించబోతోంది.

11/21/2017 - 02:41

ఇస్లామాబాద్, నవంబర్ 20: పాకిస్తాన్‌లోని సింథ్ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వ్యాన్‌ను బొగ్గు లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో 27మంది చనిపోయిన ఘటన మరిచిపోకముందే మళ్లీ ఈ దారుణం చోటుచేసుకుంది. ఖైర్‌పూర్ ప్రాంతంలోని తెహ్రీ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

11/21/2017 - 02:50

బీజింగ్, నవంబర్ 20: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. ఈ ప్రాంతంపై మొదటినుంచీ వివాదాన్ని రేకెత్తిస్తూ వచ్చిన డ్రాగన్, తాజాగా భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ విషయంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని భారతదేశం జఠిలం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

11/20/2017 - 02:46

బీజింగ్, నవంబర్ 19: చైనా కొత్త రాయబారిగా గౌతమ్ బంబావాలే సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గౌతమ్ ఇప్పటివరకు పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు భూటాన్ రాయబారిగా పనిచేసిన ఆయన 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. చైనాలో భారత రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

11/20/2017 - 02:43

న్యూయార్క్, నవంబర్ 19: భారత్- బ్రిటన్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో దౌత్యపరమైన సమరం రాజుకుంటోంది. అంతర్జాతీయ న్యాయమూర్తి పదవికి భారత్ తరఫున పోటీచేస్తున్న దల్వీర్ భండారీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన ఎన్నికకు దెబ్బకొట్టడనికి బ్రిటన్ అన్ని విధాలుగానూ కుయుక్తులు పన్నుతోంది.

11/19/2017 - 03:22

బీజింగ్, నవంబర్ 18: టిబెట్‌లోని నింగ్చీ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో శనివారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఆస్తినష్టం భారీగానే జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ విలయంలో ఎవరూ మరణించలేదని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి.

11/19/2017 - 02:48

ఖాట్మండు, నవంబర్ 18: నేపాల్ సరిహద్దు ప్రాంతంలో రైల్వేలైన్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆ దేశంలోని చైనా రాయబారి యూ హాంగ్ తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను మరింతగా మెరుగుపరచుకునేందుకు, మానవాళికి మేలైన భవిష్యత్ కోసం చైనా పనిచేస్తుందని యూ హాంగ్ పేర్కొన్నారు.

11/19/2017 - 01:49

బీజింగ్, నవంబర్ 18: చైనాలో జరిగిన అందాల పోటీలో భారతీయ యువతి మానుషి చిల్లార్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల వైద్య విద్యార్థిని మారుషి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో 108 మంది ప్రత్యర్థులను పక్కకునెట్టి ఈ ఘనతను సాధించింది. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఇపుడు ‘మిస్ వరల్డ్’ టైటిల్ దక్కినట్లయ్యింది.

11/19/2017 - 00:39

ఇస్లామాబాద్, నవంబర్ 18: తమ ఆర్థికమంత్రి ఇషాఖ్ దర్ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. అవినీతి వ్యవహారాలకు సంబంధించి ‘పనామా పత్రాల’లో తన పేరు బయటపడడంతో ఇషాఖ్ పదవి నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

Pages