S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/13/2017 - 05:20

పెషావర్, నవంబర్ 12: పాకిస్తాన్‌లో ఖైబర్-్ఫఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన పేలుళ్లలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. బన్ను జిల్లాలో రోడ్డు పక్కన పార్కు చేసిన ఒక మోటారు సైకిల్‌లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

11/13/2017 - 05:09

హనోయి, నవంబర్ 12: దక్షిణ చైనా సముద్ర వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగం తనదేనని పేర్కొంటూ చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న, తన సైన్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు.

11/13/2017 - 05:08

న్యూయార్క్, నవంబర్ 12: అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఒక అతిథిగృహం (మోటల్) యజమాని మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఫయెట్టెవిల్లె నగరంలో గల నైట్స్ ఇన్ అండ్ డయమండ్జ్ జెంటిల్‌మెన్స్ క్లబ్ యజమాని అయిన ఆకాశ్ ఆర్ టలాటి (40) ఒక సాయుధుడు శనివారం జరిపిన కాల్పుల్లో మృతి చెందారని పోలీసులు ఆదివారం తెలిపారు.

11/13/2017 - 04:36

కరాచి, నవంబర్ 12: భారత్‌కు చెందిన 55 మంది జాలర్లను పాకిస్తాన్ నిర్బంధించింది. ఈ మేరకు పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ (పీఎమ్‌ఎస్‌ఏ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో పాక్ జలాల్లోకి ప్రవేశించిన 55 మంది జాలర్లను అరెస్టు చేయడంతోపాటు వారికి సంబంధించిన పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పీఎమ్‌ఎస్‌ఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.

11/13/2017 - 04:33

మనీలా, నవంబర్ 12: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా జట్టు కడుతున్నాయి. భద్రతారంగంలో సహకారానికి ఒక రూపం ఇవ్వడానికి ఈ నాలుగు దేశాలు ఆదివారం తొలిసారి అధికారుల స్థాయి చర్చలు జరిపాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోకి ఎవరయినా ప్రవేశించేందుకు వీలుగా స్వేచ్ఛా ప్రాంతంగా చేయాలనే అంశంపై కేంద్రీకరించి ఈ చర్చలు సాగాయి.

11/13/2017 - 04:46

మనీలా, నవంబర్ 12: ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌లతో విడివిడిగా సమావేశం అయ్యారు.

11/12/2017 - 03:21

డానాంగ్, నవంబర్ 11: దీర్ఘకాలంగా యుద్ధంతో అస్తవ్యవస్తమైన సిరియాలో సమస్యకు సైనిక చర్యే పరిష్కారం కాదని అమెరికా, రష్యా అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం నాడిక్కడ ఓ సంయుక్త ప్రకటన చేశారు. వియత్నాంలో జరుగుతున్న ఎపెక్ సమీట్‌కు హాజరైన ఇద్దరు అధ్యక్షులు పలు అంశాలపై చర్చించినట్టు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.

11/12/2017 - 03:15

హొనోయ్, నవంబర్ 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ పిపాసి అంటూ ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. దేశాల మధ్య చిచ్చుపెడుతూ శాంతికి విఘాతం కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు టూర్లకు బయలుదేరాడని విరుచుకుపడింది. ఉత్తర కొరియాపై యుద్ధం చేద్దాం రండి అంటూ ప్రపంచ దేశాలను ట్రంప్ రెచ్చగొడుతున్నారని ఉత్తర కొరియా దాడికి దిగింది.

11/12/2017 - 03:11

ఇస్లామాబాద్, నవంబర్ 11: పాకిస్తాన్ మాజీ నియంత పెర్వెజ్ ముషారఫ్ ఇరవై మూడు పార్టీలతో ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ‘పాకిస్తాన్ అవామీ ఇత్తేహాద్’ (పిఏఐ) పేరిట ఆవిర్భవించిన ఈ మహాకూటమికి 74 ఏళ్ల ముషారఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఇక్బాల్ దార్‌ను సెక్రటరీ జనరల్‌గా నియమించారు.

11/12/2017 - 01:20

ఢాకా, నవంబర్ 11: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై శనివారం దాడి జరిగింది. ఓ గ్రామంలో హిందువుల ఇళ్లకు మెజారిటీ మతానికి చెందిన నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రంగ్‌పూర్ జిల్లా ఠాకూర్‌పురా గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇక్కడ హిందూ మతానికి చెందిన ఓ యువకుడు ‘ఫేస్‌బుక్’లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టాడని ఆగ్రహించిన మరో మతానికి చెందినవారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Pages