S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/30/2017 - 02:09

మాస్కో, నవంబర్ 29: ప్రపంచాన్ని నేడు ఉగ్రవాదం, తీవ్రవాదం అనే రెండు ప్రధాన సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, వీటిని అంతం చేసేందుకు భారత్ తన వంతు కృషి చేస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రష్యాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా మాస్కోలో ఆయన మంగళవారం రాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. రష్యాతో స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు.

11/30/2017 - 01:52

హైదరాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ నగరానికి పెట్టుబడులతో రావాలని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అత్యంత స్నేహపూరితమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, అనుమతులపై దేశంలో ఎక్కడాలేని కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

11/29/2017 - 03:56

ఇండొనేసియాలోని ఆగుంగ్ అగ్నిపర్వతం మళ్లీ రగులుకుంది. విపరీతంగా లావాతోపాటు బూడిదను వెదజల్లడంతో పరిసర ప్రాంతాలన్నీ దుమ్మెత్తిపోతున్నాయ. ముందస్తు చర్యలలో భాగంగా రాజధాని బాలిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.

11/29/2017 - 03:52

సింగపూర్, నవంబర్ 28: సౌరశక్తి వినియోగం నానాటికీ విస్తృతం అవుతున్నందున దాన్ని సమర్థవంతంగా నిల్వ చేసే వ్యవస్థను భారత్ ఏర్పాటు చేసుకోవాలని ఇంధన రంగ పరిశోధకుడు నిత్యనందా సూచించారు.

11/29/2017 - 03:50

రష్యాలో పర్యటిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వ్లాదిమిర్ పుఖోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

11/29/2017 - 03:47

లాహోర్, నవంబర్ 28: అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా సంస్థ అధిపతి హఫీజ్ సరుూద్ ఐక్యరాజ్యసమితిలో పిటిషన్ దాఖలు చేశాడు. 297 రోజుల గృహనిర్బంధం అనంతరం కొద్ది రోజుల క్రితం హఫీజ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

11/29/2017 - 03:45

యాంగాన్, నవంబర్ 28: పోప్ ఫ్రాన్సిస్ మైన్మార్ పర్యటన సందర్భంగా మంగళవారం ఇక్కడ నోబెల్ అవార్డు గ్రహీత అంగ్‌సాన్ సూకీతో భేటీ అయ్యారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల అంశంపై ఇరువురి మధ్య చర్చ సాగింది. రోహింగ్యాలపై దాడులను ఐరాస సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఖండిస్తున్న నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

11/29/2017 - 03:34

హైదరాబాద్, నవంబర్ 28: భరతజాతి గర్వించదగ్గ రీతిలో సంగీత నృత్య రూపకాలతో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మంగళవారం సాయంత్రం హైటెక్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. హైటెక్స్‌లోని రంగుల హరివిల్లును తలపించేలా ఒక పక్క నృత్య రూపకాలు, మరో పక్క ప్రభుత్వ కార్యక్రమాల దృశ్య శ్రవణ మాధ్యమాల్లో కనువిందుగా ప్రదర్శించారు.

11/29/2017 - 02:14

హైదరాబాద్, నవంబర్ 28: అమెరికాతో భారత్ సంబంధాలు మరో మెట్టుపైకి వెళ్లేందుకు వీలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ, శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్‌ల చర్చలు ఫలప్రదం అయ్యాయి. హైదరాబాద్‌లో మంగళవారం నాడు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇవాంక ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

11/29/2017 - 02:06

హైదరాబాద్, నవంబర్ 28: భారత్ గొప్ప దేశమని, భారతీయలు స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు.

Pages