S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/17/2017 - 03:41

వాషింగ్టన్, నవంబర్ 16: భారత రాజధాని ఢిల్లీసహా దేశంలో అనేక నగరాలు, మరోపక్క పాకిస్తాన్‌లోని పలు పట్టణాల్లోనూ దట్టమైన పొగమంచు అలుముకోవడం అన్నది ప్రమాదకరమైనదేనని, అనారోగ్య పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నదని అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. ఈ పట్టణాల్లో రానున్న కొన్ని నెలలపాటు వాయు నాణ్యతకు సంబంధించి ఇదే రకమైన ప్రతికూల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

11/17/2017 - 03:35

వాషింగ్టన్, నవంబర్ 16: అమెరికాలో హెచ్-1బి వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల కనీస వేతనాన్ని 60వేల డాలర్ల నుంచి 90వేల డాలర్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్న బిల్లును అమెరికా కాంగ్రెస్‌లోని ఓ కీలక కమిటీ ఆమోదించింది. భారతీయ ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా తీసుకుంటున్న ఈ వర్క్ వీసాను పొందటానికి బిల్లులో అనేక ఆంక్షలు కూడా విధించారు.

11/16/2017 - 01:41

వాషింగ్టన్, నవంబర్ 15: భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడుని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే జనాదరణలో మోదీ 30 పాయింట్లు అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కంటే 31 పాయింట్లు అధికంగా ఉన్నారని ప్యూ సంస్థ జరిపిన ఈ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 2,464 మంది అభిప్రాయాలను సేకరించారు.

11/16/2017 - 01:38

మెల్‌బోర్న్, నవంబర్ 15: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని ఆస్ట్రేలియాలో మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ దేశ చరిత్రలోనే అరుదైన రీతిలో జరిగిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’లో ఈ విషయం తేటతెల్లమైంది. స్వలింగ వివాహాలకు మద్దతుగా తాను కూడా ఓటు వేశానని, వచ్చే నెలలో క్రిస్మస్ నాటికి పార్లమెంటులో ప్రత్యేక చట్టం ఆమోదం పొందుతుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ వ్యక్తం చేశారు.

11/15/2017 - 22:47

రెడ్‌బ్లఫ్, నవంబర్ 15: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయ. ఓ దుండగుడి తుపాకీ తూటాలకు ఐదుగురు బలైపోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని రెంఛో టెహామా ఎలిమెంటరీ స్కూల్ లక్ష్యంగా సాయుధ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు పాఠశాల విద్యార్థులతోపాటు పదిమంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి.

11/15/2017 - 22:44

సియోల్, నవంబర్ 15: దక్షిణ కొరియాలో తీవ్రమైన భూకంపం సంభవించింది. దేశానికి ఆగ్నేయంగా బలమైన ప్రకంపనలు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. పారిశ్రామిక నగరం పోహాంగ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో భూమి కంపించిందని అన్నారు. రాజధాని సియోల్, దాని పరిసరాల్లో దాని ప్రభావం ఉంది. సియోల్‌లో ఏడుగురు గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది.

11/15/2017 - 22:43

హరారే, నవంబర్ 15: దశాబ్దాలుగా జింబాబ్వేపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అధికార శకానికి తెరపడిందా? దేశాన్ని సైనిక దళాలు బుధవారం హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఈ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ రాజధాని హరారేలోని పార్లమెంటు భవనం ముందు భారీ ఎత్తున సైనిక వాహనాలు మోహరింపు, అదే విధంగా టెలివిజన్‌లో జాతిని ఉద్దేశించి సైనికాధినేతలు మాట్లాడడంతో అసలు జింబాబ్వేలో ఏమవుతుందన్న ఉత్కంఠ చెలరేగింది.

11/15/2017 - 03:36

వాషింగ్టన్/మనీలా, నవంబర్ 14: ఇండో ఫసిఫిక్ ప్రాంతాన్ని శాంతిమండలంగా తీర్చిదిద్దేందుకు భారత్, అమెరికా మరింత సంఘటితంగా ముందుకు సాగాలని సంకల్పించాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ప్రత్యేక దృష్టి పెట్టారని వైట్‌హౌస్ తెలిపింది.

11/15/2017 - 03:32

మనీలా, నవంబర్ 14: ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పనిచేయాలని భారత్-్ఫలిప్పీన్స్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూర్టేతో నాలుగు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ రంగం, భద్రత వంటి విషయాల్లో పరస్పర సహకారం పంచుకోవాలని నిర్ణయించారు. ‘ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సమష్టిగా పనిచేద్దాం. దీనిపై పరస్పర సహకారం అందించుకుందాం’ అని మోదీ, రోడ్రిగో స్పష్టం చేశారు.

11/15/2017 - 02:59

మనీలా, నవంబర్ 14: ‘విస్తరణ కాంక్ష’తో చెలరేగిపోతున్న చైనాకు పగ్గాలు వేయాలని సంకల్పించిన మన ప్రధాని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావాల్సిందిగా ‘ఆసియాన్’ సభ్య దేశాల నేతలను ఆహ్వానించారు. వచ్చే నెల 26న ఢిల్లీలో జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి హాజరు కావాలని పది ‘ఆసియాన్’ దేశాధినేతలను ఆయన కోరారు.

Pages