S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/26/2017 - 01:47

కరాచీ, నవంబర్ 25: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భద్రతా దళాలపై శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, మరో 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని సరియబ్ రోడ్డు మీదుగా వెళ్తున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు

11/26/2017 - 01:45

ఇస్లామాబాద్, నవంబర్ 25: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా ఫైజాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి అనేక నగరాల్లో శనివారం నాడు అనూహ్యంగా అల్లర్లు చెలరేగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బందిపై కొన్ని మతవాద సంస్థల కార్యకర్తలు రాళ్లు విసురుతూ ఘర్షణలకు దిగారు.

11/25/2017 - 02:46

హరారే, నవంబర్ 24: ఎమ్మర్సన్ మ్నన్‌గాగ్వా శుక్రవారం జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబేకు వ్యతిరేకంగా సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తరువాత దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎమ్మర్సన్ ప్రమాణ స్వీకారంతో తెరపడింది.

11/25/2017 - 02:15

డబ్లిన్, నవంబర్ 24: ఐర్లాండ్‌లోని ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని నోటీసు ఇవ్వడంతో అక్కడి మైనారిటీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఓ వివాదంలో ఉప ప్రధాన మంత్రి ఫ్రాన్సిస్ ఫిజ్‌గెరాల్డ్ వ్యవహార శైలిని ప్రధాన ప్రతిపక్షం ఫియన్నా ఫెయిల్ తప్పుపడుతోంది.

11/25/2017 - 01:39

లాహోర్, నవంబర్ 24: ముంబ యి దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. గృహ నిర్బంధం నుంచి గురువారం అర్ధరాత్రి విడుదలైన వెంటనే ఆయన కాశ్మీర్ అంశాన్ని అందిపుచ్చుకుని భారత్ వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విముక్తి కోసం ప్రజలను సమీకరిస్తానని హెచ్చరించారు.

11/25/2017 - 01:38

కైరో, నవంబర్ 24: ఈజిఫ్ట్‌లో ఉగ్రవాదులు మరోసారి నరమేధం సాగించారు. మసీదులో శుక్రవారం ప్రార్ధనలు చేస్తున్న వారిపై ఉగ్రవాదులు కిరాతకంగా విరుచుకుపడ్డారు. బాంబులు విసిరి, తుపాకులు పేల్చి తమ రక్తదాహం తీర్చుకున్నారు. ఈ దారుణ మారణకాండలో సుమారు 235 మంది ప్రాణాలు కోల్పోగా 109 మందికి పైగా గాయపడ్డారు.

11/24/2017 - 03:38

యాంగన్, నవంబర్ 23: రోహింగ్యా ముస్లింలను స్వరాష్ట్రానికి పంపే విషయంలో మైన్మార్-బంగ్లాదేశ్‌ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రంలో సైనిక దాడుల నుంచి తప్పించుకునేందుకు వేల సంఖ్యలో రోహింగ్యాలు బంగ్లాకు తరలివచ్చి అక్కడి శిబిరాల్లోనే కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 6లక్షల 20వేల మంది రోహింగ్యాలు మైన్మార్ నుంచి బంగ్లాకు పారిపోయారు.

11/22/2017 - 22:23

లాహోర్, నవంబర్ 22: 26/11 ముంబయి పేలుళ్ల సూత్రధారి, ప్రముఖ ఉగ్రవాద సంస్థ జమాత్- ఉద్- దవా (జెయుడి) అధినేత హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని పంజాబ్ న్యాయస్థానం బుధవారం నాడు ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి హఫీజ్ గృహనిర్బంధంలో ఉండగా, ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

11/22/2017 - 22:15

వాషింగ్టన్, నవంబర్ 22: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సభ్యుడిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికైనందుకు అమెరికా అభినందనలు తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుత వీటో వ్యవస్థలో సంస్కరణలకు మాత్రం అగ్రరాజ్యం విముఖత చూపుతోంది. 15 మంది సభ్యులుండే ఐసీజేలో పదవికోసం బ్రిటన్, భారత్ పోటీ పడిన సంగతి తెలిసిందే.

11/22/2017 - 03:12

నైజీరియా, నవంబర్ 21: ఈశాన్య నైజీరియాలోని ఓ మసీదులో దారుణం చోటుచేసుకుంది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో కనీసం 50మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘాతుకం బోకో హారమ్ జిహాదీల పనేనని పోలీసులు వెల్లడించారు. అడమావా రాజధాని యోలాకు 200 కిలోమీటర్ల దూరంలోని ముబి పరిధిలోని ఉంగువార్ షువా మసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది.

Pages