S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/27/2019 - 00:58

ఇస్లామాబాద్: బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరంపై తన వాయుసేన ముందస్తు దాడి చేసిందని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, వారి శిక్షకులు, జైషే కమాండర్లు హతమయ్యారని భారత్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ ‘అనుచిత దాడి’కి పాల్పడిందని ఆరోపిస్తూ, తాను ఎంచుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రదేశంలో ఈ దాడికి బదులిస్తామని పాకిస్తాన్ పేర్కొంది.

02/26/2019 - 23:12

బీజింగ్, ఫిబ్రవరి 26: భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ సంయమనం పాటించాలని, ఉగ్రవాదం విషయంలో భారత్ అంతర్జాతీయ సహకారం తీసుకుని పోరాటం సాగించాలని చైనా దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ ఉగ్ర శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత్ వైమానిక దళాలు దాడి చేసిన సంఘటనపై స్పందించిన చైనా దేశం తరఫున దేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లు కాంగ్ విలేఖరులతో మాట్లాడుతూ దాడికి సంబంధించిన నివేదికలను పరిశీలించామని చెప్పారు.

02/26/2019 - 11:05

లాస్‌ఏంజిల్స్, ఫిబ్రవరి 25:జాతి వైషమ్యాల మధ్యసాగే అనూహ్య స్నేహానికి అద్దం పట్టిన ‘గ్రీన్‌బుక్’ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకుంది. అత్యధిక స్థాయిలో నాలుగు పురస్కారాలను బొహెమియాన్ రాఫ్సోడీ గెలుచుకుంది. 91వ అస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అల్ఫాసో కువారోన్ తీసిన ‘రోమా’చిత్రానికి అడ్డు కట్టవేసి ఉత్తమ ఆస్కార్‌ను గ్రీన్‌బుక్ ఎగరేసుకుపోయింది.

02/24/2019 - 23:36

లాహోర్, ఫిబ్రవరి 24: పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకార చర్యలకు సన్నద్ధమవుతోందన్న కథనాల నేపథ్యంలో పాకిస్తాన్ దొడ్డిదారిన రాజీ ప్రయత్నాలను మొదలుపెట్టిందా? తాజాగా వెలుగుచూస్తున్న కథనాలను బట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూత ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నట్టుగా తెలుస్తోంది.

02/23/2019 - 23:40

న్యూయార్క్, ఫిబ్రవరి 23: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్యాలలు రగులుతునే ఉన్నాయి. జైషే ముష్కరుల మారణకాండను ఐరాస భద్రతామండలి తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థల దాడులకు నిరసనగా అమెరికాలోని ఇండియన్-అమెరికన్లు న్యూయార్క్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి పాక్ కాన్సులేట్, ఐరాసలోని పాకిస్తాన్ పర్మినెంట్ మిషన్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు.

02/23/2019 - 23:40

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: అమెరికా సరిహద్దులో వివాదాస్పద గోడ నిర్మాణం తప్పకుండా చేపడతామని ఒకపక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుండగా, మరోపక్క ఆ నిర్మాణం జరగకుండా అడ్డుకుంటామని అందుకు వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. దేశ సరిహద్దులో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ట్రంప్ తనకున్న విశేష అధికారాలను వినియోగించనున్నారు.

02/23/2019 - 22:52

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ముష్కరుల భీకర దాడుల అనంతరం పాకిస్తాన్‌పై చాలా కఠినంగా వ్యవహరించేందుకు భారత్ యోచిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుల్వామా జిల్లాలో ఈనెల 14న పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే అహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 41 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలైన నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు.

02/23/2019 - 22:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:పుల్వామా దాడికి బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా తెగేసి చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్‌లో గుబులు మొదలైంది. భారత్ ఎక్కడ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందోనన్న ఆందోళనతో ముందుగానే సన్నద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా పాక్ యుద్ధ విమానాల గస్తీ కొనసాగుతోందని, భారత దళాల కదలికలపై ఈ విమానాలు గట్టి నిఘా వేసినట్టుగా స్పష్టమవుతోంది.

02/23/2019 - 01:28

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్తాన్ ఆర్మీ తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని శుక్రవారం పేర్కొంది. అయితే, భారత్ ఎలాంటి సైనిక చర్యకు దిగినా, అది విస్తుపోయేలా తాము బదులిస్తామని తెలిపింది.

02/23/2019 - 01:27

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికాలో హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్నవారి దాంపత్య భాగస్వాములకు ఉద్యోగం చేయడానికి ఉన్న అనుమతిని తొలగిస్తూ ప్రస్తుత నియమావళికి మార్పులు చేసే ప్రతిపాదనను అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్వీకరించింది. భారత్‌కు చెందిన ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది అమెరికాలో ఉండటానికి హెచ్-1బీ వీసాను తీసుకుంటున్నారు.

Pages