S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/26/2018 - 19:29

ధోరణి మార్చడం అంటే మీరు ఒకరకంగా నాటకం ఆడుతున్నారు అని అర్ధం.

12/25/2018 - 19:24

దర్శన స్థితిలో ఉండడమంటే ఏమిటి? మీ శరీరం ఒక నిర్దిష్టమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది, మీ భావోద్వేగం మరోరకమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది. మీరు మీలో ఉన్న ప్రాణమని పిలిచే దానిలో మరోరకమైన ప్రకంపనలు ఉంటాయి. దర్శనస్థితిలో ఉండడమంటే ఈ జీవితాన్ని అత్యంత సున్నితంగా ప్రకంపించనివ్వడమే.

12/24/2018 - 19:47

దర్శనం - అనంతాన్ని రుచి చూపించే సాధనం దర్శనం అంటే కేవలం మీ కన్నులను తెరచి ఉంచి గ్రహించడం. దేన్ని గ్రహించడం ? మానవ మేధ ప్రాథమిక స్వభావం ఏమంటే, అది ఉన్నదానితో తృప్తి చెందలేదు. దీని స్థూలమైన అభివ్యక్తీకరణ ఎలా ఉంటుందంటే అది డబ్బు, ఆస్తి, విజయం, షాపింగ్ వంటి వాటి గురించి ఆలోచిస్తుంది. కొంతమంది బజారులో ఉన్న వాటిని సొంతం చేసుకోవడానికి తుపాకులు, కత్తులతో వెలితే, మరి కొంతమంది పర్సులను ఉపయోగిస్తున్నారు.

12/23/2018 - 22:48

సృష్టి పరాకాష్ఠ
15,000 సంవత్సరాల కిందట ఆదియోగి తన శిష్యులైన సప్తర్షులకు యోగాన్ని అందిస్తూ, సృష్టిలో మనిషి ఎట్లా పరివర్తన చెందుతారో ఆయన వివరిస్తున్నారు.

12/21/2018 - 19:58

ఔదార్యమాతని జీవన సౌరభమైనచో, సరళతయే యందలి చక్కదనము, పసిబాలుని నమ్మికను బోలు నమ్మిక గలిగి సత్యమును బ్రహ్మచర్యమును బరిపాలించుటయే సాక్షాత్కారమునకు నిశ్చితమార్గమని- వినిర్మల హృదయముననే భగవానుడు విస్పష్టముగా గోచరించునని- శిష్యుల కాతడు ప్రకటించును. ఏ రూపమున నొనర్చినను మనఃపూర్వకమగు ప్రార్థనము జపమును ధ్యానమును భగవంతుని వశమొనర్చు కొన గలవని యాతడు వక్కాణించును.

12/20/2018 - 19:33

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=============================================================

12/19/2018 - 19:07

ఒక జీవితకాలంలో మీరు దీనిగురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా కష్టమైన పని. కాని ప్రజలు తమ శరీరంలో ఎంతలోతుగా చిక్కుకుపోయి ఉన్నారంటే వాళలు శరీరాన్ని సాధనంగా చూడలేనంతగా. శరీరంతో వారి అనుబంధం, గుర్తింపు ఎంత లోతుగా ఉన్నాయంటే వాళలు దీన్ని ‘నేను’ గానే చూడడం కొనసాగి స్తున్నారు. ఈ శరీరాన్ని మీరు ‘నేను’గా చూసిన క్షణంలోనే దానికి బోలెడంత భావోద్వేగం జోడింపబడుతుంది. ఇక మనం దాన్ని సాధనంగా ఉపయోగించలేం.

12/18/2018 - 19:40

సద్గురు ఉపదేశం...
మీ దేహాన్ని శివంగా మలచుకోండి.

12/17/2018 - 19:02

‘శ్రేయన్ ద్రవ్యమియాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే
బద్ధ జీవితానికి అజ్ఞానం కారణం కనుక దానిని తొలగించే శ్రేష్టమైన యజ్ఞం జ్ఞాన యజ్ఞమేనని, పై శ్లోకం కర్మసాధనగానూ, జ్ఞానము సాధ్యంగానూ నిరూపిస్తోంది. ‘నేను దేహాన్నికాను నేను జీవాత్మను..’ ఈ భౌతిక బంధనంనుండి విముక్తిపొందటమే నా జీవితలక్ష్యం అని గ్రహించటమే జ్ఞానప్రాప్తికి తొలిమెట్టు.

12/16/2018 - 22:20

సుమతి శతకకారుడు బద్దెన ‘‘తన శాంతమె తనకు రక్ష’’ అని అనడంలో శాంతగుణమే మానవులను కాపాడుతుందని చెప్పాడు. వాగ్గేయకారుడు, నాదబ్రహ్మ అయిన త్యాగరాజు తన కీర్తనలో ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అనీ అన్నారు. శాంతం వల్లనే సర్వ సుఖాలకు మూలాధారం శాంతగుణమే అని తెలుస్తోంది. భూదేవి అంత ఓర్పు స్ర్తిలకు ఉంటుందని అంటారు. అయతే సముద్రమంత సహనం, ఉదారగుణం ప్రతివారికీ అవసరమే. ఆ రెండు ఉన్నాపుడే శాంతి కలుగుతుంది.

Pages