S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/26/2019 - 19:07

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి.

09/25/2019 - 18:55

అత్యంత విలువైన వాటిల్లో కాలం ఒకటి. కాలాన్ని అదుపు చేయగలగడం అంటూ ఉండదు కానీ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనే ప్రజ్ఞ కనబడుతుంది. కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులు, క్షణాలుగా కూడా విభజన చేసుకొంటుంటాం. ఇది అంతా కాలంతో పాటు పరుగెత్తడానికే పనికివస్తుంది. కానీ కాలాన్ని అదుపు చేయ డానికి మాత్రం కాదు. అసలు సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వద్దన్నా కావాలన్నా వాటికవి జరిగిపోతూనే ఉంటాయ.

09/24/2019 - 19:14

అందుకే నా పరిశీలనా ఫలితాలను పాఠకుల పాదాలముందు సమర్పించుకుంటున్నాను.
‘‘మహాత్ముడైన శ్రీహర్షుడికీ, పరిశోధకులైన గుంటూరువారికీ, కనిపించిన శ్రీవిద్య మీకెందుకు కనిపించలేదు?’’అని ఎవరూ చర్చించవలసిన పని లేదు.

09/23/2019 - 19:05

ఈ సందేహం తీరాలంటే మనం ఆపస్తంబ మహర్షిని ఆశ్రయించవలసిందే. ఆయన తన గృహ్యసూత్రాలలో నామకరణ సంస్కార ప్రకరణంలో,- ‘‘దైవదత్తం నామ పితరౌ ధాస్యతుః’’అన్నాడు. అంటే, పుట్టిన మానవ జీవికి ముందుగా నామకరణం చేసేవారు దేవతలే. తల్లితండ్రులు ఇద్దరూ కలిసి, ఇటూ అటూ గింజుకొని, చివరికి ఆ పేరే పుట్టిన సంతానానికి పెడతారు- అని మంత్రద్రష్టఅయిన ఆ మహర్షి సూత్రీకరించాడు.

09/22/2019 - 22:19

‘‘ఆదిత్యవర్ణే తపసో ధిజాతో
వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః’’

09/20/2019 - 19:53

కర్కోటకుడికి గురుత్వాన్నీ, ప్రప్రథమ స్థానాన్నీ కల్పించి, ‘‘నాగుడు’’అని స్తుతిస్తున్నాడు. అంతేగాక, ‘కర్కోటకస్య నాగస్య- దమయంత్యా నలస్య చ’’అనే శ్లోకంలో దమయంతికి నలుడికన్నా మొదటి పీట వేస్తున్నాడు. ఋతుపర్ణుడిది కేవల సహాయక పాత్ర కనుక, అతడికి చివరి పీట ఇస్తున్నాడు.
నలుడికి అక్షహృదయాన్ని అందింప జేయటంతో కర్కోటకుడి పని పూర్తయిపోయిందా? కాలేదు.
ఎందుకంటే,

09/19/2019 - 19:03

అందుకే, ఇతడు అయోధ్యాధిపతి. ‘‘దేవానాం పూరయోధ్యా’’(దేవతల నగరమైన హృదయపద్మమే అయోధ్య) - అని శ్రుతి!
కర్కోటకుడి గురుత్వం:
గురువులు చేసే ఆత్మవిద్యోపదేశక్రమంలో శిష్యులకు సత్సాంగత్యం కలిగించడం ఒక ప్రధాన సోపానం. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం’’అని గదా ఆదిశంకరుల అమరసూక్తి! ఈ సత్సాంగత్యసిద్ధికోసమే కర్కోటకుడు నలుడ్ణి ఋతుపర్ణుడి దగ్గరికి ప్రత్యేకంగా చెప్పి పంపించాడు.

09/18/2019 - 19:32

అందులోనూ ‘‘ఋతుపర్ణస్య రాజర్షేః’’ అంటూ అనామకుడైన ఋతుపర్ణుడ్ణి రాజర్షిగా కీర్తించటంలో ఔచిత్యమేమిటి? కథలో ఆ రాజుకి ఏ రకమైన ప్రాధాన్యమూ కనుపించటం లేదు కదా?!’’ - అని ఆలోచిస్తున్నారా?
ఇది తెలియాలంటే, కర్కోటకుడు నలుడికి ఏమి ఉపదేశం చేశాడో పరిశీలించాలి.

09/17/2019 - 19:02

ఏదో ఒక కర్మశేషలేశం చేత శాశ్వత నిర్వికల్ప సమాధిలో వుండటం కుదరనివారే గురువులు కాగలుగుతారనీ, పరిపూర్ణ జ్ఞాననిష్ఠగలవారు లోకవ్యవహారంలోకి రానే రారు గనుక, వారు శిష్యోపదేశ కృత్యాన్ని గూడా చేపట్టరనీ, వేదాంత గ్రంథాల్లో స్పష్టంగా చెప్పనే చెప్పారు. యోగ వాసిష్ఠం వంటి గ్రంథాలలో ఈ విషయాలు మరింత వివరంగా వున్నాయి.

09/16/2019 - 19:13

అందుకే ఆ అపప్రథను మరచిపోయి, కర్కోటక శబ్ద నిర్వచనంలోకి వెళ్ళాలి.
కర్కోటక శబ్దంలో ‘‘కర్క-అట’’అని రెండు విభాగాలున్నాయి.

Pages