S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/01/2019 - 20:06

సోమవారం మధ్యాహ్నం సి.ఎస్.రాంబాబుగారు ఫోన్ చేశారు- సాయంత్రం ఒక సభ ఏర్పాటుచేశాము. మీరు కూడా పాల్గొనాలి, ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలి అన్నారు. ఏమిటి విషయం? ఏం సభ? అని అడిగాను.

10/01/2019 - 20:04

ఎల్లలోకము లొక్క ఇల్లై
వర్ణ్భేదములెల్ల కల్లై
సమాజ హితమే సర్వుల మతమై
విశ్వమానవ కళ్యాణం జరగాలని ఆకాంక్షించినవారిలో అగ్రగణ్యుడు మన గాంధీజీ.

10/01/2019 - 20:03

అది 1917. అహ్మదాబాదులో ప్లేగ్ వ్యాపించింది. వస్త్రాల మిల్లుల యజమానులు పనివాళ్ళ భత్యం పెంచి వారు వెళ్ళిపోకుండా జాగ్రత్తపడ్డారు. కొంతకాలం గడిచింది. ప్లేగు తగ్గుతోంది. మిల్లుల యజమానులు భత్యం ఇవ్వడం మానివేశారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణంతో పెరిగిన ధరలు. ఇలాంటి సమయంలో భత్యం ఆపి, జీతం పెంచకపోవడం సమస్య అయ్యింది కార్మికులకు. మిల్లు యజమానులు వినడం లేదు.

09/30/2019 - 19:42

వేదమాత లోకమాత గాయత్రీదేవి. ఉపాస్యమాన పరదేవత. వేదములకు మాతృస్థానమై నిలిచినదీ తల్లి. ‘‘గాయత్రీ ఛందసాంమాతా’ అని వేదం. పూర్వం స్వర్గం నుండి యజ్ఞార్థం ఓషధీ విశేషమైన ‘సోమలత’ కొరకు అన్ని ఛందస్సులు వెళ్లాయి. గాయత్రీ వెళ్లలేదు. ఎంత ప్రయత్నించినా సొమలత భూమికి రాలేకపోయినది. పిదప గాయత్రీ ఛందస్సు వెళ్లింది. ఆ తల్లి మహిమాతిశయం వల్ల సోమలత భూమికి రావడం జరిగింది.

09/29/2019 - 22:26

తే.గీ. ఏరికోరి యఁడగవచ్చు నేదియైనఁ
బిలచి పిల్లల ఁ బద్ధతిఁబెంచకున్నఁ
దుదకు దుఃఖంబు సంద్రమై కుదిపివేయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/27/2019 - 20:42

భాద్రపద అమావాస్యమొదలు బతుకమ్మ సంబరాలు ఆరంభం అవుతాయ. సర్వ జగతికి కారణ మైన జగన్మాత పూవుల్లోను, దీపాల్లోను, పసుపు కుంకుమల్లోను ఉన్నట్టు భావించి పూజించడం అనాదిగా వసున్నదే. ప్రకృతిలోని వృక్షాలను పూజించడమూ ప్రతివారికి అలవాటే. మనిషి తన ఉన్నతికి, తన సంతోషానికి కారణ మైన వస్తువునెనా, అవస్తువునైనా పూజించ డం అనేది తన నైజం. కనుకనే ప్రకృతి ఆరాధన కూడా మనకు సనాత నమే అయంది.

09/26/2019 - 19:16

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావాస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల మాట. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం.

09/25/2019 - 19:29

సీతమ్మను అనే్వషిస్తూ ఆంజనేయుడు సముద్రాన్ని లంఘనం చేసి లంకలో ప్రవేశించాడు. ఎంతో కష్టపడి చివరకు సీతమ్మ క్షేమ వార్తను కనుగొన్నాడు. ఆ తరువాత రావణునికి రాముడంటే ఏమిటో చెప్దామనుకొన్నాడు. రావణునికి హితోపదేశం చేస్తే చేసిన తప్పును సరిదిద్దుకొంటాడనుకొని రావణుని సభామంటపంలోకి వెళ్లాడు. అక్కడ రావణునికి ఎన్నో హితవచనాలు చెప్పాడు. కానీ రావణుని చెవికి మంచిమాటలు రుచించవు కదా.

09/24/2019 - 20:20

ఉత్తమమైన నాగరికతతో , అమూల్యమైన భావాలతో మన జీవ నౌక కోటానుకోట్ల జీవుల నెక్కించుకుని యుగయుగాలుగా పయనిస్తోంది జీవన మనే సముద్రంలో. కొన్ని లోపాల వల్ల నౌకకు చిన్న చిన్న చిల్లులు పడ్డాయి. అపుడు అందులో ప్రయాణిస్తున్న వాళ్లు ఏం చేయాలి? అటు ఇటూ పరుగులెత్తకుండా ఆ నౌకకు బాగుచేసుకోవాలి.

09/22/2019 - 22:29

కృష్ణలీలలను రోజు స్మరించుకోవడం ఆనందించటం కృష్ణ భక్తులకు సహజం. అందులో ఉలూఖ ల బంధనం గూర్చి ఎన్నో అంతర్లీనమైన విషయాలున్నాయని అంటారు. రోజు స్మరిస్తూ ఉంటే ఆ అంతర్లీనంగా భగవంతుడు చెప్పదల్చుకున్న విషయాలు ఎవరికి వారు తెలుసుకొంటారు అనీ అంటుంటారు. అటువంటి లీలల్లో దామోదరలీలొకటి.

Pages