S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/17/2018 - 19:55

ఆటపాటల విషయంలోనో, చదువుల విషయంలోనో, మరింకో విషయంలోనో పిల్లల్లో గొడవలు మామూలే! కానీ ఇటీవల కొంతమంది పిల్లల్లో హింసాప్రవృత్తి పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆరా తీస్తే.. పిల్లల్లో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసుపై, పరిసరాలపై ఆధారపడి ఉంటుందని తేలింది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన పత్రం ఆధారంగా బాలికలకన్నా బాలల్లో కోపం ఎక్కువగా ఉంటుందట.

08/16/2018 - 20:25

అంతా క్షేమమేనా! మొన్ననే నేను నా పుట్ట్టినరోజు. జరుపుకున్నాను. చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టే వయస్సు ఎప్పుడో దాటిపోయిందిలెండి. నాది చాలా పెద్ద కుటుంబం, నా పుట్టినరోజు వేడుక ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. నేనంటే అందరికీ అంత ఇష్టం, భక్తి. నాకిప్పుడు డెబ్భై ఒక్క ఏళ్ళు. ఎంతోమంది పెద్దల త్యాగఫలం వలన నేను ఊపిరి పోసుకున్నాను. నేను బతికి బట్టకట్టడానికి ఓ తల్లికాదు, ఎంతోమంది తల్లులు ప్రాణత్యాగం చేసేరు.

08/15/2018 - 23:53

అసిడిటీ, మలబద్ధకం, ఫైల్స్, కొలైటిన్, అల్సర్స్ , కిడ్నీసమస్యలు, అలర్జీ, సొరియాసిస్, మొటిమలు, ఎగ్జిమా అనేకానేక చర్మరోగాలు చాలామందిని పీడిస్తుంటాయి. రోగాలు వచ్చిన తరువాత మందులు వేసుకోవడం కన్నా రోగాలు రాకుండా చేసుకోవడం మేలు. ఇలా ఆలోచిస్తే మనం తినే ఆహారమే మనకు ఆరోగ్యాన్నిస్తుంది. ఒక్కోసారి మనం తీసుకొన్న ఆహారం మనకు అనుకోని అనారోగ్య సమస్యలను కూడా తెస్తుంది.

08/14/2018 - 21:47

‘ఆకాశంలో సగం మాత్రమే కాదు.. పోరాటంలోనూ మేం సగమే..’ అని నిరూపించిన మహిళలు ఎందరో.. పట్టుదల, తెగువ, ధైర్య సాహసాలు చూపి, ప్రాణత్యాగాలు చేసి
చరిత్రలో చరితార్థులైనవారు ఎందరో.. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని వెలుగులోకి రాని అనేకమందిని మహిళలను ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తలచుకుంటూ వారికిచ్చే అక్షర నివాళి..
*

08/13/2018 - 22:03

తెనాలి వెళ్లటానికి విజయవాడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాను. నా కొలీగ్ కూతురి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాను. అదృష్టవశాత్తూ ఈ రోజు ట్రైన్‌లో ఎక్కువమంది జనం లేరు. కిటికీ పక్కన సీటు ఎక్కడ ఖాళీగా ఉంటుందా అని వెతుక్కుంటూ ఉండగా ఒక చోట కనిపించింది. ‘హమ్మయ్యా’ అనుకుంటూ సర్దుకుని కూర్చున్నాను.

08/12/2018 - 23:07

ఊహల్లో పల్లె చిత్రం ముగ్ధమనోహరం. గలగల పారే ఏరు... ఏటి పక్కన ఊరు. మట్టి పరిమళాల్ని వెదజల్లే ఎర్రెర్రని రాదారి... ఆధ్యాత్మికతతో అలరించే ఆలయ జేగంటల సవ్వడి. మనోయవనికపై ఏ చిత్రకారుడో అద్భుతంగా చిత్రీకరించిన పెయింటింగ్‌లా పల్లెసీమ ఆకట్టుకుంటుంది.

08/10/2018 - 21:21

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు. లోకమంతా ప్రేమమయం. ప్రేమకు ధనవంతులు, పేదవారు అన్న తేడాలుండవు. చదువుకున్న వారు, చదువుకోని వారు అన్న వ్యత్యాసం ఉండదు. ఒకానొక ప్రేమకు వయస్సు కూడా పెద్ద కారణం కాదు. మనసులు రెండు ఒక్కటైతే చాలు ప్రేమ అంకురిస్తుంది. అభిరుచులు, అలవాట్లు ఒక్కటిగా ఉంటే చాలు ప్రేమ బీజం త్వరగా పడుతుంది. ఆకర్షణీయంగా ఉంటే కూడా ఒక్కోసారి ప్రేమాంకురం మొదలవుతుంది.

08/09/2018 - 20:57

ఎదిగే చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక ఎక్కువగా ఉంటాయి. విసుక్కోకుండా వారు తెలుసుకోవాలనుకునే విషయాలను తెలియజెపితే వారిలో మరింత కుతూహలం, జిజ్ఞాస పెరుగుతుంది. ఇలా వారికి విజ్ఞాన సముపార్జనతో పాటు, సృజనాత్మకంగా ఆలోచించడం వంటివాటిని కూడా పిల్లలకు అలవాటు చేస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లవుతుంది.

08/08/2018 - 19:53

ఆద్య, అభిషేక్‌లకు పెళ్లయి రెండు సంవత్సరాలయింది. ఇద్దరూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మంచి జీతాలతో స్థిరపడ్డ ఉద్యోగస్థులు. అపార్ట్‌మెంట్ కోసం కంపెనీలో తీసుకున్న లోన్ కూడా ఈమధ్యనే తీర్చి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరూ చెరొక కారుమీద ఆఫీసులకెళతారు. మూడవ పెళ్లి రోజున దంపతులిద్దరూ తమ వాళ్ళకు, తామిద్దరం ముగ్గురవబోతున్నామని శుభవార్త చెప్పారు.

08/07/2018 - 19:12

డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం - సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర పట్ట్భద్రులు.

Pages