S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/19/2018 - 07:03

పంచ భూతాల్ని ప్రపంచిస్తున్న ప్రకృతిని
అమానుషతత్త్వ వేది మీద పరాభవించేటప్పుడు
వైఖరి గుడ్డిది
లోకులు పదవులు వదలలేని పెదవులు కదపలేని
‘‘కృభీద్రో’’హులే
ఐనా ఒక గీతమేదో ఆగామి కర్తవ్యాన్ని తట్టింది
అప్పుడే ఆవహం - ఆ పై ఆహవం...

11/19/2018 - 06:55

వీర శతావధానిగా పేరుగాంచిన గాడేపల్లి వీరరాఘవ శాస్ర్తి (1891-1945)గారు విధి వశాత్తు ప్రథమ కళత్రం గతించగా, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నించే సందర్భంలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రాంతానికి వెళ్లారు. శాస్ర్తిగారు ఆజానుబాహువు. గంభీరమైన విగ్రహం. వధువు పేరు సావిత్రమ్మ. పిడతల లక్ష్మీనృసింహశాస్ర్తిగారి కుమార్తె. వధువు ఇంటిలోనే పెండ్లిచూపులు.

11/12/2018 - 00:09

మనిషి చుట్టూ
కొన్ని కలలు ప్రవహిస్తాయి!

అలల గుండెచప్పుళ్ళతో
ఉప్పెనలా ఎగిసిపడుతూ
తుపాను రాత్రుళ్ళను వెంటేసుకుని
మనసు మీద
ప్రవహిస్తున్న దృశ్యం!

వేకువ పొద్దు
కళ్ళు తెరిచి చూసినంత మేర
కనీ కనిపించని
అడుగుల గుండెచప్పుళ్ళు!

వీధి గుమ్మంలో
ఏదో తెలియని
గమ్మతె్తైన సందడి!

11/12/2018 - 00:07

నేను నిర్మించుకున్న జీవితం
సాలీడు అల్లుకున్న గూడు
లోతుగా తరచి చూస్తే
రెండూ ఒకలా కనిపిస్తున్నాయ

ఎన్నో దారాల కట్టడం
క్షణభంగురంలా అనిపించినా
నిత్య మార్గదర్శిగా కనిపిస్తుంది
అన్ని అల్లికలు చూసినప్పుడు
గజిబిజి గందరగోళంలా
ఇవన్నీ అవసరమా
అన్న నాలోని ప్రశ్నకు
జవాబులూ ఉన్నాయందులోనే

11/12/2018 - 00:06

ప్రముఖ రచయత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కార కథల పోటీ కోసం రచనలు ఆహ్వానిస్తున్నట్లు లేఖిని ప్రధాన కార్యదర్శి స్వాతి శ్రీపాద ఒక ప్రకటనలో తెలిపారు. కథా వస్తువు ముఖ్యంగా తెలుగువారి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కథలు తప్పనిసరిగా డీటీపీ చేయంచడంతో పాటు 6 పేజీలకు మించకుండా ఉండాలి. పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు.

11/12/2018 - 00:05

ఈ వత్సరపు పర్వదశమీ సాయం సమారోహోత్సవ వేదికపై
పరిపరి విధ ప్రతిమల్ని తిలకించిన నాకు
కనిపించిన ప్రతి ప్రతిమలో స్ఫురించింది విస్మయం!
వినిపించిన ప్రత్యాలోచనలో ధ్వనించింది తిరోగమనం!

11/05/2018 - 06:56

మొన్నటిదాకా
ఇంట్లో నేనే హీరోని
మనవడొచ్చాక
క్యారెక్టర్ యాక్టరయ్యాను!

సూర్యుని చుట్టూ
భూమి భ్రమిస్తున్నట్టే
పొద్దు తిరుగుడు పూలలా
కుటుంబమంతా వాని చుట్టే!

వాని ప్రతి కదలికా
అందరికో అద్భుత విన్యాసం
నా రాకపోకలకు
దిక్కూదివాణం లేదు!

వాని పవళింపు సేవ
ముగియనిదే
నేనెంత గీపెట్టినా
నా ఉనికి ప్రశ్నార్థకమే!

11/05/2018 - 06:53

అదొక పక్షి
స్వప్నంలో చూశా..
ఒక కవి మిత్రుడితో కలిసి చూశా!
తిరుగుబాటు జెండాకు
అదొక చిహ్నంలా కనిపించింది
స్వేచ్ఛకు సంకేతంలా అగుపించింది
ఆ పక్షి రంగు..
రంగుల రాట్నాన్ని తలపించింది
నింగిలో ఇంద్రధనస్సును పోలింది
అదొక కొత్త పక్షి! కొత్తందం!
స్వప్నంలో సజీవ పక్షి
ఎంత వర్ణ రంజితంగా ఉందో
జీవం తొణికిసలాడే ఆ పక్షి

11/05/2018 - 06:48

ప్రతి సంవత్సరం
అంగీలు మార్చి మార్చి
అలసిపోయాడు అతను

వేసిన గుండి వేయకుండా
సంకరజాతి గుండీలను
మార్చి మార్చి వేశాడు

సరికొత్త దారాలను వేసి
చొక్కాకు రంగులద్దాలని
తెగ తాపత్రయపడ్డాడు

ఎన్ని మార్చినా
అంగీలకు ఇసుమంతైనా
సోకు రాలేదు

11/05/2018 - 06:46

సంస్కృత, తెలుగు భాషలపై సీ.పీ. బ్రౌన్‌కు మక్కువ ఎక్కువ. దీంతో ఒకపక్క సాహితీ సేవతో పాటు మరోపక్క సమాజ శ్రేయస్సు కోసం అహరహం శ్రమించారు. బ్రౌన్ రచనలపై అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయంటే తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి ఏమిటో అర్థమవుతుంది. విద్యావ్యాప్తికి, ఉచిత భోజన వసతికి అయ్యే ఖర్చును సొంతంగా భరించేవారు.

Pages