S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/27/2020 - 23:15

ఒకసారి సరిపెట్టుకున్నాక ..
ఎంత గోల చేసీ ఏం లాభం?
నా రక్త నాళాల్లో వెచ్చగా ఈదులాడేవాడు
తలపుల వాకిట్లో కాపలా కాసేవాడు
ప్రతి అడుగకీ ముందుండేవాడు
అగడ్తలు దాటించేవాడు
శిఖరాగ్రాలు చేర్చేవాడు
నా మావటీడు వాడే
రథసారథి వాడే
వాడే నా చూడామణి
వాడే నా కంఠధ్వని
ఏమయ్యాడు?
నా ముష్టి
జీవన సమిష్ఠి
వాడే..

01/27/2020 - 23:10

కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ కారి శతజయంతి , ‘ప్రపంచ కవితాదినోత్సవం’ సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్త నిర్వహణలో100/-రూ.చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు , 5 ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. పోటీలో పాల్కొనే కవులుతప్పక కవిసంధ్య, కవిత్వ పత్రిక చందాదారులై ఉండాలి. కాని వారు సంవత్సర చందా రూ.250లు చెల్లించి రసీదు పొంది దీనికి జతచేసి పోటీలో పాల్కొనవచ్చు.

01/27/2020 - 23:09

గత పదకుండేళ్లుగా జాతీయస్థాయిలో చిన్నకథల పోటీలు నిర్వహిస్తూ, తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రత్యేకతను చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడు కూడా ఇవ్వాలని సోమేపల్లి వారి కుటుంబం నిర్ణయించింది. యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పతనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో... నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయంవంతం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.
బహుమతివివరాలు

01/27/2020 - 23:09

కస్తూరి మురళీ కృష్ణ, కోడీ హళ్ళి మురళీ మోహన్‌ల సంపాదకత్వంలో సంచిన వెబ్ పత్రిక. సాహితి ప్రచురణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడే కథా సంకలనంలో ప్రచురణ కోసం కథలను పంపవలసిందిగా రచయిత(త్రు)లను ఆహ్వానిస్తున్నాం. రచయితలు, తాము రచించిన కథలను పంపవచ్చు. అనువాదాలు, అనుకరణలు, అనుసరణలు పరిశీలనకు పంపరాదు. మీ కథలు ఏ వ్యక్తిని కానీ, వర్గాన్ని కానీ కించపరిచేలా ఉండరాదు.

01/27/2020 - 23:08

కాలం వాలిపోతున్న వైపు
రచన : ‘మెర్సీ మార్గరెట్’
ప్రతులకు : 9052809952
మెర్సీ మార్గరెట్ 1-4-61/12, రంగానగర్
ముషీరాబాద్, హైద్రాబాదు-80
*

01/27/2020 - 23:05

కవి సమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీగారి 121వ జయంతి మహోత్సవం
ప్రతిష్ఠాత్మక నోరి పురస్కారాల ప్రదానం
*
కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీగారి 121వ జయంతి మహోత్సవ సభ 06-02-2020న గురువారం, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో సాయంత్రం 6 గం.లకు జరుగుతుందని నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నోరి శివసేనాని, నోరి శివకుమార్ మరియు నోరి కళ్యాణ సుందర్ తెలియజేస్తున్నారు.

01/27/2020 - 23:04

నేనో వాక్యాన్ని
వేదనకు వాదనకు మధ్య ఊగిపోతుంటాను
నేనో వాక్యంలో భాగాన్ని
పెదవిలో పదమై నిలవాలని ఆరాటపడతుంటాను
నేనో వాక్యంలో విరామచిహ్నాన్ని
మరో విషయం వివరించడానికై ఆగుతుంటాను
నేనో వాక్యంలో అక్షరాన్ని
అనుకొన్న విషయవివరణకు
మరికొన్ని అక్షరాలకు తావౌతుంటాను
నేనో వాక్యంలో చుక్కను
నేను సంపూర్ణానానికి చిహ్నం అనుకొంటూంటాను.

01/20/2020 - 22:09

ఎటువంటి పరిస్థితులనైనా
తట్టుకునేలా తీసుకుంటారు శిక్షణ
వారి ప్రాణాల్ని ఫణంగా పెట్టి
అన్ని వేళళా ఇస్తారు మనకు రక్షణ

ఆ జీవితం దేశసేవకే అంకితం
ఆ శరీరం దేశమాత సేవలో పునీతం
ఆ చూపులు
ముష్కరుల కదలికలను గమనించు
ఆ చేతులు
శత్రువుల పీకలు కత్తిరించు

01/20/2020 - 22:07

ఎన్నికల నగారా మోగింది!
ప్రచారాల సందడి రేగింది!
ఇంకేం!
కొత్తనాటకానికి తెరలేస్తోంది
బహురూపుల వేషాలు
రక్తికడుతాయిగా
ఎత్తుల కత్తులు మొలుస్తాయి
జిత్తుల పొత్తులు కుదురుతాయి
మిథ్యా పథకాలు చిగురిస్తాయి
అలవికాని హామీలు వర్షిస్తాయి
కుల సమీకరణలు సర్దుకుంటాయి
ఓటు బ్యాంకు లెక్కలు తూగుతాయి
పచ్చనోట్లు పడగ విప్పుతాయి

01/13/2020 - 22:19

వచ్చిందీ పండుగ
అన్నీ ఉన్నాయి అన్నీ కానీ
ఏదో వెలితి యెదలో
పోదీ భావన మదినుండి
గడి గడియకూ
గతం తాలూకు తలుపులు
పంట చేనుల్లో పచ్చదనం
మనిషి మనస్సులో పసితనం
అనుభవాల అనుభూతుల వెచ్చదనం
నాటినాటికీ నీటి పాలవుతూ
కాలెండర్‌లో
ఎర్రటి అంకెలు గుర్తు చేయాలీ
పండుగ ఈరోజే సుమా అంటూ
ఉత్సాహం ఉబలాటం
కాలంతో బాటు కరిగిపోయింది

Pages