S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/11/2019 - 22:57

వసంతం వాడిపోయందని
మల్లెలు మాడిపోయాయని
జిల్లేడు డొంకల మధ్య
పిచ్చి కోయలలు విషాద గీతాలు పాడుతున్నాయని
నాకు బాధ లేదు... భయం లేదు
మళ్లీ వసంతం వస్తుందని
మరుమల్లెలు విరుస్తాయని
కొత్త కోయలలు మెత్తగా పాడతాయని
నాకు ధైర్యం.. నాకు నమ్మకం
అందమైన చంద్రుడ్ని మబ్బులు మింగేసినా
నిప్పులు చెరిగే సూర్యుడ్ని
మబ్బులు కమ్మేసినా
అది క్షణికం

11/11/2019 - 22:53

ఎంత దూరం నడిస్తేనేం?
నడిచిన చోటే వుండిపోతాం
పోతూ పోతూ పోయనోళ్లంతా చెప్పిన పాఠాలు
నెమరేసుకున్నట్టే వుంటుంది కాని
మనదాకా వస్తేనే కాని ఏదీ అర్థం కాదు
కవిత్వమైనా, జీవితమైనా,
కాలమైనా, చివరికి ముగింపైనా
శూన్యాన్ని కప్పుకున్న వాళ్లంతా
క్షణం నిద్రపోని మేధోజీవులై పోయనట్టు
ఒక్కోసారి పశులకాపరి వినిపిస్తున్న పాట కూడా

11/11/2019 - 22:51

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ ప్రేమలు
ఇంట్లో వాళ్ళే కంట్లో నలుసులు

ఫేస్‌బుక్‌లో పెక్కు పరిచయాలు
పక్కింట్లో వాళ్ళు ఎప్పటికీ అపరిచితులు

తెల్లారక ముందే వాట్సప్ పలకరింపులు
తెల్లార్లూ గడిపేవాళ్లతో
మొహం మొటమరింపులు

సైబర్ లోకంలో సూపర్‌స్టార్లు
చుట్టూ సమాజంలో ఒంటరిగాళ్ళు

11/03/2019 - 22:55

వచ్చే బస్సులు వస్తుంటై
పొయ్యే బస్సులు పోతుంటై
అయనా ప్రయాణికులు వుంటుంటరు

పూసవేర్ల బాలరాజు
ఎడమ చేతికి మేదరిబుట్ట తగిలించుకుని
పైత్యానికి ఒకారానికి
అల్లం మురబ్బా అంటూ
బస్సు బస్సు తిరిగి అమ్ముతుంటాడు

ఉడికించిన పచ్చి పల్లికాయ
మక్క ప్యాలాలు
బస్సు ఎక్కుతూ దిగుతూ
నోరూరిస్తూ అమ్ముతుంటరు

11/03/2019 - 22:53

ఇసుకేస్తే రాలనట్టు రద్దీగా బస్సులు
ఎగిలివారిన నుంచి అద్మరాత్రిదాక
వచ్చేవాళ్లతోటి పోయేటోల్లతోటి
నిత్యము గడ్తీగా వుంటది

కొన్ని ఎదిరిచూసే మతలబులకు
ఇంకొన్ని బతుకుదెరువును
ఎంకులాటకు ఆలవాలమైతది

రూపాయ తరుముతుండగా
దేశాలకు దేశాలు పట్టి పోయేటందుకు
మజిలీ అవుతుంది

11/03/2019 - 22:51

అరటిపండు ఒలిచినట్టే ఉంటుంది
ఒక్క కన్నీటి వెతను
కథలు కథలుగా తెరవిప్పి చెబుతున్నప్పుడు

కంటినుండి జారి ప్రతి కన్నీటి బిందువు
జ్వలించి లావాగా మారుతూ
గుండె కరిగిన చిత్రాన్ని జీవితం కేన్వాస్‌పైన
కష్టాల రంగులో చిరునవ్వుల మెరుగు కలిపి
నిత్య జీవన చిత్రాన్ని గీస్తున్నప్పుడు

11/03/2019 - 22:49

పసివాడి వచ్చీరాని మాటలు
ఊరీ ఊరని ఊరగాయ
చేమరీ చేమరని పెరుగు
నవీ నవ్వని చిరునవ్వు
హా! హా! కారం లేని మందస్మిత వదనం
అధరము గదలీ గదలక
మధురంబగు భాషణం.

10/23/2019 - 22:29

ఎంత కసాయగుండె ఆకాశానిది
నీటి కత్తితో గొంతు కోసింది
వింతదాహం వాన చినుకులది
తడి నెగళ్లతో మంట పెట్టింది
చెలకల్లో పిలకల గిలకనవ్వు
వరికంకులై పూయక మునుపే
కొంగలు వాలిన చేను చేసింది

10/23/2019 - 22:27

శుక్లపక్షపు కడపటి రోజుల్లో
వెనె్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ని
వనె్నచినె్నల సొగుసుల్ని గమనించా
లేదు అందులో దొరకలేదు!

కృష్ణపక్షపు నిశి రోజుల్లో
ఉగాదుల్ని ఉషసుల్ని
చీకట్లో సంచరించు అభిసారికల్ని
తదేకంగా వెదికా,
లేదు అందులో దొరకలేదు

10/23/2019 - 22:24

నల్లధనమే ఇరుసుగా ఇంధన వనరై
రాజకీయ రథాలు రాజ్యమేలుతున్న వేళ
ఆ అవినీతి చెద పురుగులు లేనిది ఎక్కడ?
సచ్చరిత్రులను ఎంచడం అంటే
గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరే
వృథా ప్రయాసే కదా నేడు!?

Pages