S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/30/2018 - 19:52

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కరీంబాద్ గ్రామంలో పది కిలోల స్కూలు బ్యాగు మోస్తూ మూడవ అంతస్థులో క్లాస్‌రూమ్ ముందు సొమ్మసిల్లిపడిపోయి అనంతరం ప్రాణాలలు విడిచిన పధ్నాలుగేళ్ల ఆదిత్య మునిరాజ్ ఉదంతం పిల్లలలో స్కూలు బ్యాగుల బరువులు తెస్తున్న చెడు ప్రభావం గురించి చర్చ తిరిగి ప్రారంభించింది. ఒకప్పుడు విద్యాభ్యాసం అంటే ఆట, పాటలతో ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఆనందంగా సాగే ప్రక్రియ.

08/29/2018 - 19:02

నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో కాలానికి పోటీపడుతూ, ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునేవరకు క్షణం తీరిక లేకుండా లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో శారీరక అలసటకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు.. భారతదేశం పురుష ప్రధాన దేశం.

08/28/2018 - 20:12

కొంతమంది పిల్లలకు చిన్నప్పటి నుంచీ మంకుపట్టు, పేచీతత్త్వం, మొండితనం వంటివి ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల గారాభం వల్లో.. లేదా అమ్మమ్మ తాతయ్యల ముద్దు వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కావచ్చని చెబుతారు డాక్టర్లు.. ఈతరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది అంటున్నారు వారు.

08/28/2018 - 20:10

పక్షి... లక లక్ష్యాన్ని
చెట్టు ..పుట్టుక లోని దాగిన మర్మాన్నీ
చేప .. తెరచాపలా ఎదురీదమని
ఇలా
ప్రతి ప్రాణీ .. ప్రతీ పరిచయం
చివరికి చీమా.. పురుగు కూడా
‘‘గురువు’’గా మారి
మనకి పాఠాలు చెప్తాయని తెలుస్తుంది
అదీ ఎప్పుడూ...
చూసే మనసుకి కళ్లుంటేనే...
అదీ ఎప్పుడూ
రెప్పలు మూసుకోకుండా ఉంటేనే...

08/24/2018 - 19:03

జూలీజెంటర్ న్యూజిలాండ్‌కు చెందిన రవాణాశాఖామంత్రి. మంత్రి కాబట్టి ఎక్కడికైనా కారులోనే వెళ్లగలదని వేరే చెప్పక్కరలేదు. కానీ ఈ మంత్రి నిండుగర్భిణి. పురిటి నొప్పులు మొదలుకాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిలోమీటరు దూరం ఉన్న సిటీ ఆసుపత్రికి సైకిల్‌పై బయలుదేరింది. ఆమె భర్త మరో సైకిల్‌పై ప్రయాణిస్తూ జూలీజెంటర్ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది వైరలైంది.

08/24/2018 - 19:01

అమ్మ తర్వాత అమ్మవై, నాన్న తర్వాత నాన్నవై
నా చేయిని పట్టుకొని, నన్ను నీ హస్తాలతో ఎత్తుకొని
చీకటిదారులలో ముళ్ళబాటలలో నీవు నడిచి
నన్ను జలతారు పూలబాటలలో నడిపించుచున్న ఓ సోదరా!
నేను నీకు మనసా వాచా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
నా ప్రతి పుట్టిన రోజుకు నీ అమృత హృదయంలో చోటుతోపాటు
ఏదో ఒకటి కానుకగా ఇచ్చి నా శిరస్సును ప్రేమగా నిమిరి

08/24/2018 - 19:00

కళ్ళల్లో క్రాంతిరేఖ.. విశ్వానికి స్ఫూర్తిదాత
విశ్వం ఆమె ఉనికి-
మన సేవలకి.. మానవతా విలువల పెంపుకి..
మదర్ థెరిస్సా మన మధ్యన లేరనేసరికి
కంటి ధర ఆగునా మింటిదాకా సాగక మానునా
అశ్రుతర్పణం.. ఆత్మ దర్పణం.. ఆమె కర్పణం-
ఆశ్రీతులకు అనాధలకు
రోగులకు వ్యాధులకు
రోగగ్రస్త పీడితులకు
దీర్ఘవ్యాధి బాధితులకు
ప్రేమభావం సేవాగుణం ఆమె సాధనం

08/23/2018 - 19:11

ఆయురారోగ్య సంపద సంప్రాప్తికై
చేయాలి శ్రావణ శుక్రవార వరలక్ష్మీదేవి వ్రతం
తానే సరస్వతి, లక్ష్మి, సర్వ మంగళ
అనుగ్రహాలనిచ్చే వరాల మహాలక్ష్మి
త్రికాల, త్రిసంధ్య, త్రిలోక
వీక్షణానుగ్రహకారిణి
తాను నిత్య, అనునిత్య
తాను కరుణ పద్మమాలాతరులత
శ్రీపురవాసిని
మన ఇంట
కలశవాసినిగా వసించడం
మన పూర్వజన్మ
పుణ్యానికి తార్కాణం

08/22/2018 - 20:01

భారత షెట్లర్, తెలుగుతేజం పీవీ సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో
సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో పీవీ సింధు ఏడోస్థానంలో నిలిచింది.
టాప్ 10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి, భారతీయురాలు పీవీ సింధు కావడం విశేషం!

08/22/2018 - 20:00

అమ్మంటే...
కనిపించే దైవమే కాదు
ముగింపు లేని..
ఓ మహా కావ్యం!
ఊహలకందని మూర్తిమత్వం
వర్ణనకసలే దొరకని వ్యక్తిత్వం
అక్షరాల్లో బంధించలేని అనురాగం
వెనె్నలలాంటి ప్రసన్న వదనం
నవనీతం వంటి హృదయం
ఆమెకు శోభను కూర్చే ఆభరణాలు..
అమ్మ...
ఓ చల్లని జాబిల్లి
ప్రేమను పంచే కల్పవల్లి!
విసుగూ విరామం ఎరుగని
అవిశ్రాంత...

Pages