S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/05/2018 - 21:54

ఎపుడైనా నీ మనసుకు జవాబు చెప్పుకునేట్టు పనులు చేయకూడదు. శరీరం కూడా మన మాట వినాల్సిందే. కానీ ఆ శరీరం మాట మనం వినాల్సి వస్తే మనం పని చేయలేం. నాలుక కోరినట్టు రుచులను అందిస్తే అది తినేస్తూ పోతుంది. కడుపులో జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతిన్నా నాలుక పట్టించుకోదు. పొట్టకూడా కొవ్వురూపంలో నాలుక అందించిన ఆహారాన్ని రూపుమార్చుకుని నిల్వ చేస్తూ పోతుంది.

08/03/2018 - 19:44

నా జీవన ఉద్యానవనంలో విరిసి జారిపోయిన నా బాల్యం నాకింకా గుర్తే
అమ్మా! అని నే పిలిచిన నా తొలిపలుకును విని
నన్ను తన హృదయానికి గాఢంగా హత్తుకుని ముద్దులతో ముంచివేయడం నాకింకా గుర్తే
మా ఊరి సెలయేటి అలలతో పోటీపడి నే సేకరించిన గవ్వలు,
దాచిపెట్టుకున్న నెమలి కన్నులు అన్నీ అమ్మకు చూపించడం
ఆమె కన్నులల్లో మెరిసిన నా మెరుపులు నాకింకా గుర్తే

08/03/2018 - 19:42

కోకకు తగ్గ రవికె తెమ్మని తన పెనిమిటికి చెప్పింది ఓ పల్లెపడచు. ఇలా అనాదిగా రవికలను చీరలకు తగ్గట్టుగా స్టైల్‌గా కుట్టించుకుని వేసుకొనటం అలవాటు. మొన్నమొన్నవరకు పైపింగ్, డోరీ, ఎంబ్రాయిడరీ బ్లవుజులు వచ్చేవి. నగల మోజు మహిళలకు ఎప్పుడూ ఉన్నా ఈమధ్య బ్లవుజులపై నగల డిజైన్లు వస్తున్నాయి. ఇవి అటు పార్టీవేర్‌గాను, పెళ్లిళ్లల్లోను కొత్తగా ఉండి అందరినీ ఆకర్షిస్తున్నాయి.

08/01/2018 - 19:22

31గ్రా. పిండిపదార్థాలు, 2 గ్రా. ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రిబోప్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ ఇలా ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్న ఈ వెలగ అరోగ్యానికి కలిమి. ఈ వెలగ పండును ఆయుర్వేద వైద్యులు వెలకట్టలేని ఔషధం అంటారు. ఈవెలగ పండును ఔషధంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత ను దూరం చేస్తుంది.

07/31/2018 - 20:02

జలజలమని కురిసింది వాన
జ్వాలారింది అమృతంపు సోన
దోసిళ్లతో తాగి వచ్చాను
దుఃఖాన్ని చావునీ వెళ్లిపొమ్మన్నాను
.......................

07/31/2018 - 19:54

ఇంటిని గాని, ఒంటిని గాని పరిశుభ్రంగా చూసుకోకపోతే మనసు బాగుండదు. ఇల్లు బాగుండదు. అందుకే పూర్వం ఇల్లు ను చూసి ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగున్నట్టే..

07/30/2018 - 19:19

నిజంగా నవ్వి చూడు
ఎన్ని అద్భుతాలు జరుగుతాయి
ఎన్ని అపార్థాలు తొలగిపోతాయో!
ఎన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి
ఎన్ని చెడ్డరోజులు దూరమవుతాయో!
నవ్వి చూడు
ముత్యాలు దొరులుతాయి
నవరత్నాలు రాలుతాయి
నవనాడులు కదులుతాయి
చాలా రోగాలు పారిపోతాయో!
నవ్వి చూడు కలతలు తీరిపోతాయి
దూరాలు చెరిగిపోతాయి
స్నేహహస్తాలు దొరుకుతాయో!

07/29/2018 - 22:48

ఎంత చక్కనిది
‘దిండు’ తో మన బంధం
మనం కనే కలలకు అదే సాక్ష్యం!
సేదతీరేవేళ
నీడలా వెన్నంటే వుండి
కాస్తుంది పహారా!
పన్నీరు వంటి
పరిమళాలను వెదజల్లే
మల్లెల గుబాళింపులతో
పరవశించడమే కాదు
అప్పుడప్పుడు
కన్నీరుతో తడిసి
ముద్దవడమూ
దానికి తెలుసు!
ముక్కలు చెక్కలైన హృదయాన్ని
అతకడానికి ఎంచక్కా

07/27/2018 - 21:23

రోజంతా ఇంట్లో పనితోను, ఆఫీసు పనితోను అలసి పోతున్నారా... అసలు మీకంటూ సమయం చిక్కడంలేదా... మీ బాడీ ని ఫిట్‌గా ఉంచుకోవడానికి కాస్తంత ఎక్సైసైజులు చేద్దాం అంటే అసలు టైము దొరకడం లేదా.. దిగులు పడకండి.. ఇవిగో మీలాంటి వారికోసం చిన్న చిన్న చిట్కాలు రెడీ...

07/26/2018 - 19:25

నయనాల సమధర్మం
ఆనందబాష్పాలకీ
కన్నీటికి ఒకటే రుచి!

విషాదాలు కొన్నైనా
అనుభవించాలి
వినోదాల రుచి
తెలుసుకోవాలిగా!!

వర్షానిది జాలిగుండె!
అతని కంటనీరు ఎవరికంటా
పడకుంటా హఠాత్తుగా కురిసీ!!

ఇచ్చి పుచ్చుకోవడాలు
నీ తర్వాతే! చిరునవ్విచ్చావ్ ..
హృదయాన్ని తీసుకుపోయావ్!!

Pages