S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/22/2016 - 22:00

పాటల కూర్పు, సంగీతకర్త ఒక్కరే అయివుంటే వారిని వాగ్గేయకారులంటారు. అన్నమయ్య గొప్ప వాగ్గేయకారుడు. పండితులు పద కవితలను నిరసించే కాలంలో పద కవితారచనకు పూనుకుని పదకవితకు ఒక నిర్ణీత స్థితిని, గౌరవాన్ని కల్పించాడు అన్నమయ్య. అందుకే పదకవితాపితామహుడిగా పిలువబడుతున్నాడు. అన్నమయ్య 1408 సం.లో వైశాఖ పూర్ణిమ నాడు తాళ్లపాకలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి.

05/08/2016 - 21:45

వైదిక కర్మ సదాచారములకు పుట్టినిల్లు. అయినా ఈ భరత ఖండమునందు ఎంతోమంది మహర్షులు, యోగులు తమ వాక్కులతో చేష్టలతో ప్రజలను ప్రభావితం చేసారు. వౌనస్వామిగా విశ్వవిఖ్యాతి నొందిన రమణ మహర్షులు ఈ కోవకే చెందుతారు. ఆర్తి లేనిదే ఆత్మ సాక్షాత్కారం కాదు అని ప్రబోధించిన ఈ తత్వ జీవి తిరుచ్చిలో పుట్టి మధురలో పెరిగి పదహారవ ఏట అరుణాచలమునందు ఆత్మవిచారము పొందారు. ఈయన స్వేచ్ఛను ఎక్కువగా ప్రేమించేవారు.

05/02/2016 - 03:21

శ్రీశ్రీ అద్వయానంద భారతీస్వామివారి పూర్వాశ్రమ నామం తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. వీరు వ్యాఖ్యానాలు, నవలలు, విమర్శలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. తిక్కన సోమయాజి ఐతిహాసిక నవల అందులో ఒకటి. నవలాస్రష్ట ఈ నవలలో కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ధార్మిక ప్రవృత్తిని ప్రతిబింబింపజేశారు.

04/24/2016 - 22:43

త్రిమూర్తులకు మించిన శక్తిఅంటే కేవలం గురుశక్తి మాత్రమే. గురువుగారి అనుగ్రహం సంపాదించినవారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోను ఎదురువుండదు. విశ్వామిత్రుని అనుగ్రహం సంపాదించిన త్రిశంకువు ప్రత్యేక స్వర్గానే్న నిర్మించుకొన్నాడు. అటువంటి గురుస్వరూపమే అసూయలేని అనసూయమ్మకు అత్రి మహర్షికు కుమారుడుగా జన్మించాడు.

04/17/2016 - 21:50

తీర్థ యాత్రలు ఛేస్తే పుణ్యం అంటూ పెద్దలు ఎందుకు చెప్పారంటే అక్కడ ఇదివరలో పవిత్రమైన నదీ నదాలు పచ్చని ప్రకృతి శోభ విరాజిల్లుతూ వుండేవి.
అవన్నీ తిరిగి చూసి ఆ ఓషథులతో కూడిన నదీ జలాల్లో స్నానమాచరిస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ వుంటే అలౌకికానందం కలుగుతుంది. సహజ సిద్ధమైనది స్వచ్ఛమైనది చల్లని గాలి పీల్చుకుంటే అంతకన్నా శరీరానికి ఆరోగ్యకరమైనది ఏముంటుంది?

04/10/2016 - 23:55

సీతారాములు సాక్షాత్తు లక్ష్మీ నారాయణులే! సీత అయోనిజ. లక్ష్మి క్షీరసాగరోద్భవ. వాల్మీకి రామాయణములో సీతను అయోనిజ అని జనకుడు చెప్పాడు. ‘అథమేకృషతః క్షేత్రం’ లాంగలాదుత్థితా-- మయాక్షేత్రం శోధయతా లబ్దా నామ్నా సీతేతి విశ్రుతా’అని సీతను అయోనిజగా భూమినుంచి పొందానని చెప్పాడు. నేను ఉపచారములు జరుపుటవలన నాకూతురైనది. వీర్యశుల్కగా ప్రకటిస్తున్నాను అని చెప్పాడు.

04/04/2016 - 01:10

చైత్ర శుక్ల సమారంభే జగతాం జగదీశ్వరః
సర్వం చక్రే తదారాజన్‌ తతస్తస్మిన్ సదాదినే॥
సృష్టికర్త బ్రహ్మ తన సృష్టినంతా ఈరోజునే ముగించాడనీ, యుగారంభమయిందనీ బ్రహ్మపురాణం, ధర్మసింధువు ఉటంకిస్తున్నాయి. ప్రజ్ఞాచక్షువైన మన పూర్వఋషులు ఖగోళ శాస్త్రాన్ని తమ మేధాసంపత్తితో కాలగమనాన్ని, కాలమానాన్ని పరిశోధించి ఎన్నో అద్భుత విషయాలకు రూపకల్పన చేశారు. అలా రూపొందించినదే ఉగాది.

03/27/2016 - 23:36

భ గవంతున్ని ప్రేమించుటలో, పూజించుటలో, సేవించుటలో, కీర్తించుటలో కలుగు అనురాగమే భక్తి అని కదా వ్యాసులు వారు అన్నారు. సచ్చిదానంద స్వరూపుడుగు పరమాత్మ యందు మనకు గల గొప్ప ప్రేమ భావమే భక్తి. అనగా పరమాత్మ సర్వభూతములలో అంతర్భూతమై వుండును. కావున సూక్ష్మంగా సర్వప్రాణులయందు ప్రేమ కలిగి యుండుటయే నిజమైన భక్తి అని నాద మహాముని తెలిపియున్నారు. దయగల హృదయం భగవన్నిలయంగా పెద్దలు వివరించి యున్నా రు.

03/20/2016 - 23:05

భ గవంతుడు నిరాకారుడు. కాని భక్తులకోసం సగుణరూపంలో వ్యక్తం అవుతుంటాడు. భగవంతుడు నిస్సంగుడు. కాని భక్తులకు తత్వం బోధపడడానికి సంగత్వాన్ని కల్పించుకుంటాడు. సర్వం తానే అయనా తనకేమీ పట్టనట్టు ఉంటూ అన్నీ తనవే నన్న భ్రమ కల్పించి భక్తులను పరీక్షిస్తుంటాడు. మళ్లీ ఆ భగవంతుడే తన భక్తుల కన్నీళ్లకు కష్టాలకు కరిగిపోయ తనను తాను భక్తుడు కోరుకున్న విధంగా వ్యక్తం అయ వారిని అక్కున చేర్చుకుంటాడు.

03/14/2016 - 05:21

కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి.

Pages