S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/11/2016 - 08:11

హైదరాబాద్, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలుతీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఉద్యోగులకు రెండు ప్రభుత్వాలు వేతనాలు చెల్లించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

07/27/2016 - 05:16

హైదరాబాద్, జూలై 26: ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతోన్న సమయంలో వయో పరిమితి సడలింపును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈమేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

07/23/2016 - 07:08

హైదరాబాద్, జులై 22: ఎంసెట్-2 పేపర్ లీకేజి దోషులను కఠినంగా శిక్షించాలని ఎబివిపి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం. రాఘవేందర్, నగర కార్యదర్శి జె. దిలీప్, జోనల్ ఇన్‌ఛార్జీలు సురేష్, చైతన్య, శ్రీహరి, శ్రీశైలం, జీవన్, శ్రీరామ్ ప్రభృతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

06/29/2016 - 07:46

హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్‌లోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ ఆన్‌లైన్ సభ్యత్వాన్ని స్వాగతిస్తోంది. 5 లక్షల పేపర్ బ్యాక్ కాపీలు, పుస్తకాలు, సినిమాలు, మ్యాగజైన్లు, ఈవెంట్లు, వర్కుషాప్‌లు, ఇ పుస్తకాలు, ఇ జర్నల్స్, ఇ సినిమాలు సహా ఒక గ్రంథాలయంలా కాకుండా ప్రపంచాన్ని ఆవిష్కరించేలా బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీని తీర్చిదిద్దారు.

06/06/2016 - 07:39

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో కన్నుల పండువగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు, స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.

05/31/2016 - 07:35

హైదరాబాద్, మే 30: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై దివంగత వైఎస్ ఆత్మబంధువయిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తన ఆత్మబంధువు కొడుకయిన జగన్‌ను, ఆయన తన మేనల్లుడిగా సంబోధించారు.

05/30/2016 - 07:01

హైదరాబాద్, మే 29: డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు నేటినుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. పెట్రో ఉత్పత్తులపై 14.5 శాతం వ్యాట్ ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగినట్టు ట్యాంకర్ల యజమానుల సంఘం ప్రకటించింది. వ్యాట్‌ను ఎత్తివేయాలన్న తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున సమ్మెకు పూనుకున్నట్టు తెలిపారు.

05/26/2016 - 00:29

హైదరాబాద్, మే 25: వచ్చే నెల 6వ తేదీలోగా విజయ్‌మాల్యా తాజా చిరునామాను పేర్కొంటూ వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని జిఎంఆర్ సంస్ధను నాంపల్లి మూడవ స్పెషల్ మెజిస్ట్రేట్ కోరారు. ఈ నివేదిక ప్రాతిపదికగా తీసుకుని మరోసారి విజయ్‌మాల్యాకు నాన్‌బెయిలబుల్ వారెంటును జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.

05/25/2016 - 08:55

హైదరాబాద్, మే 24: దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం నడుస్తున్న కొత్త మార్గాల నిర్మాణం, డబ్లింగ్, విద్యుద్దీకరణ వంటి అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సమీక్షించారు. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు, నిర్మాణ సంస్థల అధిపతులు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు.

04/14/2016 - 07:49

హైదరాబాద్, ఏప్రిల్ 13: అంబేద్కర్ విగ్రహం కోసం ఎన్టీఆర్ గార్డెన్స్‌ను తొలగిస్తారని తాము అనుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం తీరుపై టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అన్నట్టు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

Pages