S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా డిసెంబర్ 7న అక్కడి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఏపీ సచివాలయం సహా రాజధాని పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.
తిరుపతి, ఆగస్టు 17: తిరుమల శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాతం సేవ టికెట్లు ఆన్ లైన్ లక్కీ డిప్ ద్వారా అధికంగా పొంది వాటిని అక్రమంగా అమ్ముకుంటూ నకిలీ టికెట్లు సృష్టిస్తున్న మోసగాడి గుట్టును టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఎట్టకేలకు ఛేదించారు. డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమంలో ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో కొద్దిమందికి మాత్రమే ఎక్కువ టికెట్లు లభిస్తున్న విషయంపై ఫిర్యాదులు అందాయి.
హైదరాబాద్, మార్చి 11: మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ‘నెంబర్-1’ హిందూ రత్న ఉగ్రవాది అని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్య చేయడమే కాదు, దీనిపై తనకు నోటీసు జారీచేసే దమ్ము ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఎన్నడూ భారత్‌ను అమ్మడానికి యత్నించలేదు. కాకపోతే గత 70 ఏళ్లుగా అణచివేతకు గురయ్యారన్నారు. ‘గత 70 ఏళ్లుగా మేం బెదిరింపులకు గురవుతూనే ఉన్నాం. మహా అయితే మీరు మమ్మల్ని చంపేస్తారు.
ఖమ్మం, మే 9: ఆందోళనలు, అరెస్టులు మద్దతు ధరను సాధించలేకపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఘటన ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతును ఆదుకుంటామని ప్రకటించాయి. కేంద్రం క్వింటా మిర్చికి 5వేల రూపాయలు ధరతో పాటు ఖర్చుల కింద మరో 1,250రూపాయలు ఇవ్వాలని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని సూచించింది.
హైదరాబాద్, నవంబర్ 24:తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కులు చెల్లించుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుపతికి వచ్చి శ్రీవారికి కానుకలు సమర్పించుకోనున్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాసుడికి వజ్రకిరీటం, తిరుచనూరు పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని సమర్పించేందుకు రూ.
భద్రాచలం, నవంబర్ 16: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. భద్రత బలగాలు ఇంకా అడవుల్లోనే ఉన్నాయని వారు బయటకు రాగానే పూర్తి వివరాలు వెల్లడౌతాయని బస్తర్ ఐజీ కల్లూరి అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...
హైదరాబాద్, నవంబర్ 9: కరెన్సీ నోట్ల రద్దు విషయం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలిసిందని, ప్రధాని తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు ఎలాతెలిసిందో కేంద్రం నిఘా పెట్టాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఐదు వందలు, వెయ్యి కరెన్సీ నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 1: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జాతీయ ఆరోగ్య రక్షణ పథకం’ (ఎన్‌హెచ్‌పిఎస్) పై అధ్యయనం చేసి నివేదిక రూపొందించేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారు. మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ విధానాన్ని సరళీకృతం చేయడం, విద్యుత్ టారిఫ్‌లో ఉన్న అనేక శ్లాబ్‌లను తొలగించాలనే విషయమై తిరుపతిలో ఈ నెల 26వ తేదీన విద్యుత్ నిపుణులు, సలహాసంఘం సభ్యులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 26: స్విస్ చాలెంజ్ విధానం కింద అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలో 6.84 చ.కి.మీ పరిధిలో అభివృద్ధి నిమిత్తం ప్రాజెక్టుకు సంబంధించి రెవెన్యూ వాటాను వెల్లడిస్తామని కాంట్రా క్టు సంస్థ నిర్ణయం తీసుకుందని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.