S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 23:34

కల్వకుర్తి, జనవరి 15: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో గత మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన నూతన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన 41 రోజు పూర్తి కావడంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శివ పార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

01/15/2017 - 23:32

బోధన్, జనవరి 15:బోధన్ పట్టణంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు పూర్తిగా బందయ్యాయి. వివిధ కాలనీలకు చెందిన సంఘాల ప్రతినిధులు రుణాల కోసం ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త నోట్ల వ్యవహారాన్ని సాకుగా చూపిస్తు ఆయా బ్యాంకుల అధికారులు రెండు నెలలుగా రుణాలను నిలిపేశారు.

01/15/2017 - 23:31

వినాయక్‌నగర్, జనవరి 15: బహుజనులంతా రాజ్యాధికార సాధనకై పోరాడుతూ, బహుజన పార్టీని బలోపేతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్షశిల గైక్వాడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల ఆదర్శనగర్ చౌరస్తా వద్ద జనకల్యాణ దినోత్సవ మహాసభ నిర్వహించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

01/15/2017 - 23:31

నిజామాబాద్, జనవరి 15: నిజామాబాద్ నగర శివార్లలో యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతున్నా, అధికారులు తమకేమీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు. నిరుపేదలు ఎక్కడైనా జానెడు జాగాను ఆక్రమించుకుంటే ఎనలేని హడావుడి చేస్తూ పోలీసుల పహారా మధ్య కబ్జాలను తొలగించే అధికారులు, బడాబాబుల భూకబ్జాల భాగోతం వైపు మాత్రం కనె్నత్తి చూసేందుకు కూడా సాహసించడం లేదు.

01/15/2017 - 23:30

వినాయక్‌నగర్, జనవరి 15: దైనందిన పనులను నిర్వర్తించే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడి, అలసట నుండి తాత్కాలికంగానైనా ఉపశమనం పొందేందుకు వీలుగా వినోద సాధనమైన సినిమా థియేటర్లను ఆశ్రయిస్తున్న సగటు ప్రేక్షకులు మరింత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. వినోదం ఆశించి థియేటర్లకు వెళ్తే అడుగడుగునా దోపిడీకి గురి కావాల్సి వస్తోందంటూ భారమైన హృదయాలతో ఇళ్లకు వెనుదిరుగుతున్నారు.

01/15/2017 - 23:29

నల్లగొండ, జనవరి 15: డిసిసిబిలో చైర్మన్ కుర్చీ చుట్టు రాజకీయ పోరు మలుపుల మీద మలుపులు తిరుగుతు ఉత్కంఠత రేపుతుంది. కాపుగల్లు సహకార సంఘం పాలకవర్గం రద్ధుతో ఈ సంఘం చైర్మన్‌గా ఉన్న ముత్తవరపు పాండురంగారావు డిసిసిబి చైర్మన్ పదవికి ఎసరు రావడంతో పదవిని కాపాడుకునేందుకు పాండురంగారావు, ఎలాగైనా సరే ఆయనను దించేందుకు ప్రత్యర్ధి వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

01/15/2017 - 23:27

నల్లగొండ, జనవరి 15: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పిడిఎస్ బియ్యంతో మిల్లర్లు, డీలర్లు సాగిస్తున్న అక్రమ దందాకు అడ్టుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం విమర్శల పాలవుతుంది.

01/15/2017 - 23:26

సూర్యాపేట, జనవరి 15: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతో పాటు అన్నిమండలాలు, గ్రామాలలో పండుగ వేడుకలు అబరాన్నంటాయి. పండుగ సందర్భంగా వివిధసంస్ధల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల, వంటలపోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని శనివారం దేవాలయాల్లో ప్రత్యేకపూజ కార్యక్రమాలను నిర్వహించారు.

01/15/2017 - 23:26

చిట్యాల, జనవరి 15: శ్రీగోదాదేవి, రంగనాథస్వామిల కల్యాణం మండలంలోని నేరడలో శ్రీ ఆండాల్ ఆల్వార్లసహిత శ్రీసీతారామాంజనేయస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నయనానందకరంగా జరిగింది. మార్గళి ధనుర్మాసము ముగింపును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆనవాయితీగా శ్రీసీతామాంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించే శ్రీగోదాదేవిరంగనాథస్వామిల తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

01/15/2017 - 23:25

కోదాడ, జనవరి 15: గోదాగోష్టి, వికాసతరంగిణి సంయుక్తంగా కోదాడ కాశీనాధం గార్డెన్స్‌లో పుష్పయాగం, గోధాదేవిశ్రీకృష్ణ కళ్యాణాన్ని కన్నులపండువుగా భక్రిశ్రద్దలతో ఘనంగా నిర్వహించాయి. ధనుర్మాసం ముగింపుసందర్భంగా కాశీనాధం గార్డెన్స్‌లో నిర్వహించిన పుష్పయాగం, గోదాదేవిశ్రీకృష్ణ కళ్యాణోత్సవంలో భక్తులు ముఖ్యంగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్దలతో తిలకరించారు.

Pages