S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 20:56

పాత చిత్రాలలో ఓ అద్భుతమైన సినిమా మూగప్రేమ. సంగీత సాహిత్యాలు, హాస్య, కరుణ రసాలు మిళితమైన ఒక విశిష్టమైన దృశ్యకావ్యం ఇది. ఆనాటి సామాజిక సమస్య అయిన ధనికుల పేదలమధ్య పెరుగుతున్న అగాధం, రగులుతున్న ద్వేషం కళ్లకు కట్టేలా చిత్రించాడు దర్శకుడు. సంగీత సాహిత్యాలతోపాటుగా కథ కథనం చక్కగా సాగి చివరికి సుఖాంతం కావడం గమనించదగ్గ విశేషం. ప్రాచీన నాటక లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిత్రం ఈనాటికీ జనరంజకంగా ఉంటుంది.

07/18/2016 - 20:54

దొంగరాముడు చిత్రంలో పెండ్యాల సంగీత దర్శకత్వంలో సుశీల ఆలపించిన ‘తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు’ అనే పాట నాకు చాలా ఇష్టం. బడికి వెళ్లక అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెడుదారిలో పయనిస్తున్న చిన్నపిల్లవాణ్ణి మాష్టారు కఠినంగా శిక్షిస్తాడు. ఆ బాబుకి చెల్లెలు మంచి బుద్ధులు చెబుతూ పాడిన పాటే ఇది.

07/18/2016 - 18:43

బెంగళూరు: కర్ణాటక రాజధాని అభివృద్ధి మంత్రి కేజే జార్జ్‌ తన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

07/18/2016 - 18:38

చెన్నై: పేద విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జయలలిత సోమవారం చెన్నై సెక్రటేరియట్‌లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్‌ కార్డు బస్‌పాస్‌లు అందజేశారు. ఈ పథకంలో 2015-16 సంవత్సరంలో సుమారు 28.05 లక్షల విద్యార్థులు లబ్ధి పొందిగా, ఈ సంవత్సరం దాదాపు 31.11లక్షల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌కార్డు బస్‌ పాస్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది.

07/18/2016 - 18:31

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మోడల్ ఖందిల్ బులోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని ఆమె సోదరుడు మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు.

07/18/2016 - 18:28

ఏలూరు : రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రైవేటు కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు తప్పుపట్టినా అదే విధానాలను అనుసరించడం దారుణమన్నారు.

07/18/2016 - 18:26

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే చేయించడానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. సర్వే వివరాల ఆధారంగా ఉద్యోగి పిల్లల స్థానికతపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున ఉద్యోగి పిల్లలు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను అందజేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

07/18/2016 - 18:09

బెంగళూరు: డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. మంగళూరులో పనిచేస్తున్న డిఎస్పీ గణపతి ఇటీవల ఓ స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

07/18/2016 - 18:09

విజయవాడ: ఈ నెలాఖరున ఎపి డిజిపి జెవి రాముడు పదవీ విరమణ చేస్తున్నందున ఆయనను మరో రెండు నెలలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాలు ముగిశాక ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తారని సమాచారం. ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు డిజిపి రేసులో ఉన్నారని అంటున్నారు. సిఎం చంద్రబాబు కూడా నండూరి పట్ల మొగ్గు చూపుతున్నారని తెలిసింది.

07/18/2016 - 18:09

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌పై కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని, ఆ రాష్ట్ర ప్రజలను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గులాబ్‌నబీ ఆజాద్ విమర్శించారు. ఆయన సోమవారం పార్లమెంటు సమావేశంలో కాశ్మీర్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే కేంద్రానికి తాము సహకరిస్తామని అయితే కాశ్మీర్ ప్రజలను వేధించాలని చూస్తే సహించబోమన్నారు.

Pages