S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/12/2016 - 04:09

మచిలీపట్నం: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కోవడం అనవాయితీగా మార్చుకుంటున్నారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు.

12/12/2016 - 04:09

మచిలీపట్నం: మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 18వ వార్డు గిలకలదిండిలో రూ.3.18కోట్లతో నిర్మించనున్న రక్షిత మంచినీటి రిజర్వాయర్ నిర్మాణంతో పాటు పంపింగ్ మెయిన్ ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.

12/12/2016 - 04:10

నందిగామ: సరైన ప్రణాళిక, ప్రజల ఇబ్బందులను అంచనా వేయకుండా 86 శాతం చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రద్దు చేయడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థే కూదేలైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

12/12/2016 - 04:08

మచిలీపట్నం (కల్చరల్): భగవద్గీత సర్వమానవాళికి మార్గదర్శకమని పెదముత్తేవి ముముక్షుజన మహా పీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు అన్నారు. శనివారం స్థానిక జవహర్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన త్రయోదశ గీతా జయంతి వార్షిక మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుదేవులు అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి సమస్యకు భగవద్గీత పరిష్కారం చూపుతుందన్నారు.

12/11/2016 - 05:06

కూచిపూడి, డిసెంబర్ 10: పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని నిడుమోలు శివారు యలకుర్రు-కోరిమెర్ల రహదారిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు.

12/11/2016 - 05:05

విజయవాడ, డిసెంబర్ 10: వార్ధా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో జిల్లా యంత్రాంగం ద్వారా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి శనివారం ముఖ్యమంత్రి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/11/2016 - 05:04

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: విజయవాడ కేంద్రంగా గంజాయి పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ జిల్లా నుంచి తరలుతున్న సరుకు పెద్ద ఎత్తున విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు చేరుతోంది. నగరాన్ని అడ్డాగా మార్చుకున్న ‘గంజాయి మాఫియా’ కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు టన్నుల కొద్ది గంజాయి నగరంలో పట్టుబడగా..

12/11/2016 - 05:03

పాతబస్తీ, డిసెంబర్ 10: మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ బిజెపికి రాజీనామా చేసి ఈ నెల 13, లేదా వచ్చే జనవరి 26న అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2009లో సినీహీరో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరఫున ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో వెలంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు.

12/11/2016 - 05:02

పటమట, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని సాంఘిక, గిరిజన సంక్షేమం, సాధికారత శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శనివారం 4వ డివిజన్ మాచవరం యారం వారి వీధిలో 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కల్యాణ మండపానికి ఆయన శంకుస్థానన చేశారు.

12/11/2016 - 05:02

పాయకాపురం, డిసెంబరు 10: పెద్దనోట్ల రద్దు, అవసరానికి తగ్గట్లు కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, పాత వంద నోట్లు తగినన్ని లేకపోవడం.. కలగలిసి సామాన్యుడికి నరకం చూపిస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి పాల ప్యాకెట్‌తో మొదలుకుని రాత్రి నిద్రించడానికి ముందు మస్కిటోకాయిల్ వరకు ప్రతిదీ రూపాయితో ముడిపడి ఉండటంతో అవసరానికి అనుగుణంగా నగదు సమకూరకపోవడంతో సామాన్యులు సతమతవౌతున్నారు.

Pages