S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 18:08

గుంటూరు: రేపల్లెలో జాస్మిన్ అనే యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారన్న ఆరోపణలపై ఇద్దరు యువకులను చితకబాదిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామస్థుల దాడిలో గాయపడిన సాయి అనే యువకుడు మరణించాడు. జాస్మిన్ ఉరివేసుకుని మరణించడాన్ని చూసిన సాయి, పవన్ అనే యువకులు గట్టిగా కేకలు వేశారు. ఈ ఇద్దరే జాస్మాన్‌ను చంపారని అనుమానించిన గ్రామస్థులు వారిని నడివీధిలో చితకబాదారు.

07/18/2016 - 18:08

హైదరాబాద్: రోడ్డు ప్రమాదం ఫలితంగా నగరంలో చిన్నారి రమ్య కుటుంబంలో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని, ఈ ఘటనలో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోమవారం తెలిపారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, త్వరలోనే సిఎం కెసిఆర్ వద్దకు రమ్య కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి మాట్లాడిస్తానని తెలిపారు.

07/18/2016 - 18:07

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చేనెల 17న దేశవ్యాప్త ఆందోళనకు తమ పార్టీ సమాయత్తమవుతోందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. కేంద్రం విధానాలతో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణలో అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

07/18/2016 - 18:07

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి రూపొందించిన తాజా చట్టం ప్రకారం నిందితులకు పదేళ్ల జైలు శిక్ష ఖాయమని, బెయిలు సైతం రాదని ఎపి డిజిపి జెవి రాముడు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రముఖ స్మగ్లర్లను అరెస్టు చేసి ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు.

07/18/2016 - 17:51

ముంబయి: ఇక నుంచి ఏడాదిలో ఒకసారి ఉచితంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(సిబిల్‌) ద్వారా క్రెడిట్‌ నివేదికను పొందవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. ప్రస్తుతం క్రెడిట్‌ నివేదిక పొందాలంటే సిబిల్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఇక నుంచి ఏడాదికి ఒకసారి ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

07/18/2016 - 17:48

క్లీవ్‌లాండ్‌: అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల కొందరు మహిళలు అద్దాలు పట్టుకుని నగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. మైనార్టీల పట్ల ట్రంప్‌ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వందమంది చిత్రాన్ని నవంబరు 8 ఎన్నికల ముందు విడుదల చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా నిరసన తెలపడం క్లీవ్‌లాండ్‌ నిబంధనలకు వ్యతిరేకం.

07/18/2016 - 17:44

పట్నా: బిహార్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కోసి, గండక్‌, బాగ్‌మతి, గంగా నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ఉత్తర బిహార్‌లోని జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ తెలిపింది. తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, సుపాల్‌, సహర్సా, కగారియా జిల్లాల్లో నదులు తీవ్ర రూపం దాల్చాయి. గంగా నది సైతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాజధాని పట్నా, వివిధ ప్రాంతాలకూ వరద ముప్పు పొంచి ఉంది.

07/18/2016 - 17:30

హైదరాబాద్: టీఎస్‌ ఎంసెట్-2లో ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్‌ను సోమవారం అధికారులు విడుదల చేశారు. వెబ్ ఆప్షన్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌‌ విడుదలైంది. ఈనెల 25 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో జరగుతుందని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 31నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది.

07/18/2016 - 16:34

హైదరాబాద్: పంజగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మరణానికి కారకులైన ఆరుగురు యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చిన్నారి రమ్య కుటుంబ సభ్యులు సోమవారం యశోద ఆస్పత్రి వద్ద ఆందోళన ప్రారంభించారు. ఈనెల 1న పంజగుట్ట వద్ద మద్యం తాగి ఆరుగురు మైనర్ యువకులు కారు నడపడంతో మరో కారులో వెళుతున్న రమ్య కుటుంబీకులు గాయపడ్డారు.

07/18/2016 - 16:33

దిల్లీ: బిజెపి సీనియర్ నాయకుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి అన్సారీ ఆమోదించారు. 2004 నుంచి 2014 వరకూ సిద్ధూ అమృతసర్ నుంచి బిజెపి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

Pages