S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/07/2016 - 06:49

హైదరాబాద్, జూలై 6: హైదరాబాద్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఎన్‌ఐఏ అప్రమత్తతో నగరానికి ముప్పు తప్పింది. ఓవైపు రంజాన్, మరో వైపు బోనాల సీజన్ నేపథ్యంలో ఉగ్ర కదలికలు వణుకు పుట్టిస్తున్నాయ. దీంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బుధవారం అడుగడుగునా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

07/07/2016 - 06:38

విజయవాడ, జూలై 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఆశించినంత సాయం చేయదని తేలిపోయింది. కేవలం 2500 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేశారు. దీంతో కేంద్రంపై ఆశలు వదులుకుని రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు తన వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళికలను ఒక్కటొక్కటిగా చంద్రబాబు అమలు చేస్తున్నారు.

07/07/2016 - 06:37

విజయవాడ, జూలై 6: రాష్ట్రంలోని బ్యాంకులు ఈ ఏడాది గృహ రుణాలను భారీ స్థాయిలో ఇవ్వనున్నాయి. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు, రాష్టస్థ్రాయి బ్యాంకింగ్ కమిటీలు రూపొందించిన రాష్ట్ర రుణ ప్రణాళిక తాత్కాలిక అంచనాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది (2015-16) రుణ ప్రణాళికలో గృహ రుణాలకు రూ.5163 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 132 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

07/07/2016 - 06:36

నేడు రంజాన్
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు.
-ఎడిటర్

07/07/2016 - 06:35

ఏలూరు, జూలై 6 : రాష్ట్రంలో నదుల అనుసంధానం ఇక మహా మంత్రంగా మారనుంది. ఆయకట్టు స్థిరీకరణలు, ఇబ్బంది ఉన్న చోటికి అదనపు జలాలను తరలించే బృహత్తర ప్రక్రియకు పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తొలి అడుగు పడింది. రానున్న రోజుల్లో వంశధార, నాగావళి నదులను కూడా అనుసంధానించి రైతులకు మరింత అండగా నిలబడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

07/07/2016 - 06:34

అనంతపురం, జూలై 6: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) విచారణను వేగిరం చేసింది. అందులో భాగంగా దర్యాప్తు బృందం బుధవారం అనంతపురం నగరంలోని ఓ లాడ్జిలో సోదాలు నిర్వహించింది. దాడికి ముందు తాము అనంతపురంలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు ఉగ్రవాదులు వెల్లడించడంతో ఆ దిశగా ఎన్‌ఐఎ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.

07/07/2016 - 07:19

..............

07/07/2016 - 05:18

విజయవాడ, జూలై 6: పవిత్ర కృష్ణానదిలో త్వరలో జరగనున్న పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు చరిత్రలోనే తొలిసారిగా గోదావరి జలాలతో స్నానమాచరించే దుస్థితి రాబోతోంది. అసలు ఏడాది కాలంగా కృష్ణా జలాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువకు చెప్పుకోదగిన రీతిలో వచ్చిన దాఖలాలు లేవు.

07/07/2016 - 04:51

ఆంధ్ర మహాభారతంలో ఆదిపర్వంలో దుష్యంతోపాఖ్యానం సత్యం యొక్క మహిమను చక్కగా వివరించారు ఆది కవి నన్నయ్య. సత్యప్రభావం అన్ని యుగాల్లోనూ- అన్ని కాలాల్లోనూ ఆచరించదగినది. ఇతిహాసాల్లో పురాణాల్లో వేదాల్లో సత్యప్రాభవం సందేశాత్మకంగా వర్ణించబడినది. సత్యం అంటే నిజము. అది వాక్కుకు సంబంధించినది. ఎందరో కవులు రచయితలు పద్య గద్యములలో సత్యమహిమను సూక్తుల ద్వారా చక్కని తేట తెనుగులో లోకానికి అందించారు. అభినందించబడినారు.

07/07/2016 - 04:49

ప్రహ్లాదుడి కులానికి ఏదో చేటు రాబోతున్నదని నాకు సూచనప్రాయంగా తోస్తున్నది. ధ్వజం విరగిపడటం అంటే ఏమిటి? నీకేదో కీడు రాబోతున్నదనే కదా! అది తెలుసుకోలేక నా బాహువుల తీట తీర్చుకోబోతున్నావని నీవు పొంగిపోతున్నావు? ఇది ఆపదకే సంకేతం కాని నీ బాహుబల సంపదకు ఎంత మాత్రం ఊతకాదు. నాకైతే అగమ్యగోచరంగా ఉంది అని బాణుడి దగ్గర తనకున్న చనువు కొద్దీ కుంభాండుడు మనవి చేశాడు. అయినా బాణుడు భయపడలేదు.

Pages