S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/04/2016 - 16:08

దిల్లీ: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అయిదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

03/04/2016 - 16:06

హైదరాబాద్: ఈ నెల 5 నుంచి హైదరాబాద్‌లో ఎపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎపి అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు. అసెంబ్లీ బయట తెలంగాణ పోలీసులు, లోపల ఎపి పోలీసులు విధులను నిర్వహిస్తారు. గుర్తింపుకార్డులున్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తారు.

03/04/2016 - 16:06

గుంటూరు: గుంటూరులో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కోటప్పకొండలో పర్యాటక ప్రాజెక్టును ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక్కడ కాపు సత్రాన్ని కూడా సిఎం ప్రారంభించారు.

03/04/2016 - 16:05

హైదరాబాద్: అనుమానాస్పదంగా మరణించిన ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీయ మృతదేహానికి రీ-పోస్టుమార్టం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని శుక్రవారం బయటికి తీశారు. అయితే, మరోసారి పోస్టుమార్టం జరపాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు శ్రీయ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

03/04/2016 - 16:05

విజయవాడ: ఎపి రాజధాని ఎక్కడన్న విషయం తేలడానికి మూడు నెలల ముందే ఆ ప్రాంతంలో టిడిపి నాయకులు భూములు ఎలా కొన్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం భూములు భారీగా కొనుగోలు చేసి, ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మిస్తామని ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఈ భూబాగోతంపై సిబిఐ చేత విచారణ జరిపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైనా?

03/04/2016 - 16:05

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే తాను టిడిపిలో చేరడానికి సుముఖంగా ఉన్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం బాపట్లలో విలేఖరులతో మాట్లాడుతూ, టిడిపిలో బేషరతుగా చేరేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. కాగా, రాజధాని ప్రాంతంలో ఎవరు భూములు కొనుక్కున్నా తప్పులేదన్నారు.

03/04/2016 - 16:04

వరంగల్: ఎన్నికల్లో తెరాసను ప్రజలు గెలిపించింది మంచి పాలన అందించడానికే తప్ప విపక్షాల గొంతు నొక్కేయడానికి కాదని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడ ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తెరాస గెలిచాక తెలంగాణ ప్రజల ఆశలను సిఎం కెసిఆర్ వమ్ము చేస్తున్నారని ఆరోపించారు.

03/04/2016 - 16:04

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్నది కేవలం అపోహేనని ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ తెలిపారు. వీటి ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన శుక్రవారం తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో ఓటర్లలో భరోసా కల్పించేందుకు ఇవిఎంల ద్వారా రశీదులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు.

03/04/2016 - 16:03

అనంతపురం: జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆశాకిరణమైన ‘ప్రాజెక్టు అనంత’ను చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభించారు. మడకశిరలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ప్రాజెక్టు అనంతను పూర్తి చేసేలా జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా దీక్ష వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

03/04/2016 - 13:03

హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థులు శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్సీస్ కమిషన్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

Pages