S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 00:59

రావులపాలెం, సెప్టెంబర్ 27: మానసిక స్థితి సరిగా లేని ఒక యువకుడు అనూహ్య పరిస్థితుల్లో రాష్ట్రాలు దాటి రావులపాలెం చేరాడు. అతని పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో స్థానికంగా గల చిరు వ్యాపారులు చేరదీశారు. ఆరు నెలలపాటు అతని వివరాలను సేకరించి, చివరికి తల్లి చెంతకు చేర్చి అందరి మన్ననలు పొందారు. వివరాలు ఇలావున్నాయి.

09/28/2016 - 00:59

రామచంద్రపురం, సెప్టెంబర్ 27: రామచంద్రపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై నెలకొనియున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అపచారం చేశారని, దానిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎంపిపి వినకోటి శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

09/28/2016 - 00:58

అమలాపురం, సెప్టెంబర్ 27: మానసిక వికలాంగురాలైన మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొప్పనాతి సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల సూదాపాలెం ఘటనలో గాయపడిన కుటుంబాలను మంగళవారం కృష్ణమాదిగ పరామర్శించడానికి స్థానిక జానకీపేటకు వచ్చారు.

09/28/2016 - 00:57

గొల్లప్రోలు, సెప్టెంబర్ 27: గొల్లప్రోలు మండలం దుర్గాడ, వనె్నపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగుమందుల షాపులపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు షాపులకు లైసెన్సులు లేకపోవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సుమారు 12 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులు సీజ్ చేశారు.

09/28/2016 - 00:57

విఆర్‌పురం, సెప్టెంబర్ 27: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం గోదావరి 12 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం వరద మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా వచ్చి తగ్గుముఖం పడుతుందని అంచనా. వరద సహయక చర్యలు కోసం అధికారులు లాంచీలను సిద్ధం చేశారు.
కూనవరం వద్ద...

09/28/2016 - 00:57

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 27: కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం మోసం చేసిందని జిల్లా వైసిపి అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో 49వార్డులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నాయకులు నోట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

09/28/2016 - 00:50

ఏలూరు, సెప్టెంబర్ 27 : ఖాళీగా వున్న సర్పంచ్, వార్డుమెంబర్ల పదవులకు త్వరలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిపివో కె సుధాకర్‌ను ఆదేశించారు. ఏలూరు జడ్పీ అతిధిగృహంలో మంగళవారం సాయంత్రం డిపివోతో ఎన్నికల ఏర్పాట్లుపై మంత్రి చర్చించారు.

09/28/2016 - 00:50

ఏలూరు, సెప్టెంబర్ 27: జిల్లాలో భారీవర్షాల వల్ల 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, రాబోయే రెండురోజుల్లో గోదావరికి వరద కూడా వచ్చే అవకాశమున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం జిల్లా కలెక్టరుతో భారీవర్షాల పరిస్ధితులపై ఆయన సమీక్షించారు.

09/28/2016 - 00:49

భీమవరం, సెప్టెంబర్ 27: అఖండ గోదావరికి ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ధవళేశ్వరం నుంచి ఎక్కువ జలాలను కిందకు విడుదల చేశారు. జిల్లాలోని విజ్జేశ్వరం వద్ద బ్యరేజీ గేట్లను ఎత్తివేశారు. దీంతో గోదావరి జలాలు ఎక్కువ స్థాయిలో కిందకు పొంగి పొర్లుతున్నాయి.

09/28/2016 - 00:49

ఏలూరు, సెప్టెంబర్ 27: జిల్లాలో ప్రజల సౌకర్యార్ధం భారీ మంచినీటి ప్రాజెక్టులు చేపట్టడానికి 750 కోట్ల రూపాయల వ్యయంతో తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం పంచాయతిరాజ్ అధికారులతో ఆయన సమీక్షించారు.

Pages