S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 01:12

గజపతినగరం, సెప్టెంబర్ 27: ప్రస్తుత ఏడాదిలో ఖరీఫ్, రబీలకు సంబంధించి 1747కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందించడం లక్ష్యమని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు లీలావతి అన్నారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో రూ.1223 కోట్లు రుణాలు లక్ష్యం కాగా, ఇంతవరకు 701కోట్ల రూపాయలు 1,17,647 మంది రైతులకు అందజేశామని చెప్పారు. రబీలో రూ.524 కోట్లు రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

09/28/2016 - 01:12

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 27: పర్యాటక కేంద్రంగా విజయనగరాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. మంగళవారం పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడుతూ 10కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరంలో శిల్పారామం తరహాలో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

09/28/2016 - 01:11

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 27: ఖండకావ్య ప్రక్రియకు గుర్రం జాషువా జీవం పోశారని సాహితీవేత్త, ముఖ్యమంత్రి అవార్డు పురస్కార గ్రహీత దామోదరరావుఅన్నారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం గుర్రం జాషువా జయంతి జరిగింది. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

09/28/2016 - 01:11

గంట్యాడ, సెప్టెంబర్ 27: తాటిపూడి జలాశయం ఆవల ఉన్న గిరిజన గ్రామాలకు రాకపోకలు సాగించే రోడ్డు మార్గమధ్యలో ఉన్న గోస్తనీ గెడ్డపై వంతెన స్థాపించాలని 36గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. గంట్యాడ మండలానికి చెందిన గిరిజన గ్రామాలతోపాటు విశాఖ జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గిరిజన గ్రామాలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు బౌడార జంక్షన్ నుంచి ఉన్న మట్టిరోడ్డు ఒక్కటే ఏకైక మార్గం.

09/28/2016 - 01:02

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: రైతు బజార్లకు అర్బన్ ప్రాంతంలో స్థలాల కొరత సమస్యగా తయారయ్యింది. రాష్ట్రంలోని ముఖ్యమైన అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 50 రైతు బజార్లను ఏర్పాటుచేయాలని అధికారులు గుర్తించారు. ఇందుకు అవసరమైన స్ధలాలు మాత్రం అందుబాటులో లేకపోవడం వల్ల రైతు బజార్ల విస్తరణకు మార్గం లేకుండా పోయింది.

09/28/2016 - 01:02

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: పారదర్శకత, పనిభారాన్ని తగ్గించేందుకు మార్కెటింగ్‌శాఖలో కాగితరహిత పాలనను వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నట్లు ఎడి కెఆర్ కిషోర్‌బాబు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం మార్కెట్‌యార్డులో జిల్లాలోని 20 మంది మార్కెట్‌యార్డు కార్యదర్శులకు ఇ ఆఫీసుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/28/2016 - 01:01

కాకినాడ, సెప్టెంబర్ 27: ఏలేరు కాలువ ఆధునికీకరణ, భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో జెసి మాట్లాడారు. ఏలేరు ఎడమ కాలువ మోడరైజేషన్‌కు భూసేకరణ నిమిత్తం 13 గ్రామాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.

09/28/2016 - 01:01

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మంగళవారం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నగరపాలక సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్థానిక త్యాగరాజ గానసభ నుంచి సరస్వతీఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సరస్వతీఘాట్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, మిమిక్రీ ప్రదర్శన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

09/28/2016 - 01:00

కాకినాడ, సెప్టెంబర్ 27: కాకినాడలో గత 36 సంవత్సరాలుగా ఖాతాదారుల ఆదరణ చూరగొన్న ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్టు బ్యాంకు ఛైర్మన్, మాజీ ఎంపి చిట్టూరి రవీంద్ర చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బ్యాంకు ప్రగతిని వివరించారు. ఈ బ్యాంకు ప్రారంభం నుండి నేటి వరకు లాభాల బాటలో పయనిస్తూ 42,824 మంది సభ్యులను, 1,38,768 ఖాతాదారులను కలిగివుందన్నారు.

09/28/2016 - 01:00

చింతూరు, సెప్టెంబర్ 27: వాహనంలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని చింతూరు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసకుమార్ తెలిపిన వివరాలిలావున్నాయి.

Pages