S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 17:51

హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అధికారులకు సహకరించాలని, నగరంలో చాలాకాలం తర్వాత 16సెం.మీ వర్షపాతం నమోదైందని, అందువల్లే అన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో వర్షాలతో ముంపునకు గురైన పలు ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. నిజాంపేటలోని భండారీ లేఅవుట్‌ను పరిశీలించి బాధితులను పరామర్శించారు.

09/22/2016 - 17:10

హైదరాబాద్‌: ‘ ఇక పాటలు చాలనుకుంటున్నా.. విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా..’ - అని మధుర గాయని ఎస్‌. జానకి ప్రకటించారు. వేడుకల్లో సైతం ఇక పాడబోనని ఆమె ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన జానకి- 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్‌కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.

09/22/2016 - 16:58

హైదరాబాద్‌: కింగ్‌ఫిషర్‌ మాజీ సీఎఫ్‌వో రఘునాథన్‌కు రెండు చెక్కు బౌన్స్‌ కేసుల్లో మూడో ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షను గురువారం విధించింది. జైలు శిక్షతోపాటు రూ.20,000 జరిమానా కూడా విధించారు. జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కింగ్‌ఫిషర్‌ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్‌ కాగా, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా, రఘునాథన్‌లపై కేసులు నమోదయ్యాయి.

09/22/2016 - 16:52

దిల్లీ: గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 31,550గా ఉంది. మరోవైపు ఒక్కరోజే రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,800కు చేరింది. వెండి ఒక్కరోజే రూ. 600 పెరిగి రూ.46వేల పైకి చేరింది.

09/22/2016 - 16:49

జైసల్మేర్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ బడా బాగ్‌ వద్ద భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం (యూఏవీ) గురువారం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ మనీశ్‌ ఓజా వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. రిమోట్‌ కంట్రోల్‌ లేదా ఆటోమేటిక్‌ టెక్నాలజీ సాయంతో యూఏవీలు పనిచేస్తాయి.

09/22/2016 - 16:33

ముంబయి: కొందరు అనుమానిత వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో నౌకాదళ అధికారులు ముంబయిలో గురువారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉరాన్‌ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం వద్ద అనుమానితులు ఆయుధాలతో తిరుగుతూ సంచరించినట్లు పాఠశాల విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి తనిఖీలు చేపట్టారు.

09/22/2016 - 16:30

ముంబయి: వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్లు అమెరికా ఫెడ్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో దేశీయ మార్కెట్లలో గురువారం పెట్టుబడులు పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.74 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 8,800 మార్కును దాటింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 266 పాయింట్ల లాభంతో 28,773 వద్ద ముగిసింది.

09/22/2016 - 16:24

గుంటూరు : వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్రోసూరు మండలంలో గురువారం వూటుకూరు వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. అధికారులు తొలుత హెలికాప్టర్‌ సాయంతో బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే స్థానికుల సాయంతో తాడు ద్వారా వారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

09/22/2016 - 16:20

హైదరాబాద్‌: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

09/22/2016 - 16:17

విజయవాడ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. అక్టోబర్‌ 3 నుంచి అమరావతి నుంచే పాలన, రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక వ్యవహారం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై కేసు తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
చర్చించనున్నట్లు సమాచారం.

Pages