S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 22:11

డెస్క్ వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగ్గా లేకపోతే మహా చెడ్డ చిరాకు. పక్క ఫోటోలో కనపడుతున్న సీట్ చూశారు కదా? ఇది ఎర్గోనోమిక్ డెస్క్ చైర్. చక్కటి సీటు... కాళ్లను హాయిగా ముడుచుకునేందుకు సీట్ కింద మరో సీట్. కూర్చునే సీట్‌కు బ్యాక్ సపోర్ట్ లేకపోవడం గమనించే ఉంటారు. ఇలా ఎందుకంటే...వెనక్కి వాలి కూర్చుంటే పోస్చర్ (్భంగిమ) సరిగ్గా ఉండక, వెన్నునొప్పి వస్తుంది.

09/22/2016 - 22:09

నారుపోసి, నీరుపోస్తే ఏ మొక్కయినా పెరిగి పెద్దదవుతుంది!
చేరదీసి, చేయూతనిస్తే మోడువారిన ఏ జీవితమైనా గాడిన పడుతుంది!
కావలసిందల్లా స్పందించే గుణం.
వెన్నుతట్టి, వెనకుండి నడిపించే మానవతా హృదయం!
జయవేల్ జీవితాన్ని తరచి చూస్తే.. అదే విషయం బోధపడుతుంది.
ఇంతకీ ఎవరీ జయవేల్!

09/22/2016 - 22:05

టెక్నాలజీ...రెండువైపులా పదునున్న ఓ ఆయుధం. మంచైనా, చెడైనా దీనితో సాధ్యమే. రోబోలు వస్తున్నాయి...మానవ జీవితంలో భాగమవుతున్నాయని సంబర పడినన్ని రోజులు పట్టలేదు...వాటి వల్ల వినాశం తప్పదని తెలుసుకోవడానికి.

09/22/2016 - 22:00

మనసు పొరల్లో నైరాశ్యం చీకట్లు ఆవరించినపుడు ఆత్మహత్య ఎలాంటి పరిష్కారం కాదని, కాసేపు స్థిమితంగా ఆలోచిస్తే కుంగుబాటుపై తిరుగుబాటు బావుటా ఎగరేయ వచ్చని గౌహతి ఐఐటి పూర్వ విద్యార్థిని రిచా సింగ్ భరోసా ఇస్తున్నారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారిలో భావోద్వేగాలను నియంత్రించి, వారికి ఆసరాగా నిలిస్తే ఆత్మహత్యలను నివారించడం అసాధ్యమేమీ కాదని ఆమె అంటున్నారు.

09/22/2016 - 21:57

‘మెగా యువహీరో’ రామ్‌చరణ్, అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా, ‘సుప్రీం హీరో’ సాయిధర్‌మ్ తేజ.. ఇలా ఎందరెందరో సినీతారలు ఇపుడు ఆ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు తహతహలాడుతున్నారు. కండలు తిరిగిన శరీరాకృతితో అలరించాలని కుర్రహీరోలు, బరువు తగ్గించుకుని మెరుపుతీగలా ఉండాలని హీరోయిన్‌లు తపన పడడం కొత్తేమీ కాదు. జిమ్‌కు వెళ్లి ఏదో కాసేపు కసరత్తులు చేస్తే చాలదు. వ్యాయామంపై అవగాహన పెంచే సరైన శిక్షకుడు ఎవరికైనా అవసరం.

09/22/2016 - 21:53

హై ఎండ్ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగితే, మరుక్షణంలో ఈ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుని, కారులో ఉన్నవారు గాయాలబారిన పడకుండా అడ్డుకుంటాయి. ఇప్పటివరకూ అయితే ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు కార్లకే పరిమితం. కానీ ఏదైనా పెద్ద వాహనం వచ్చి, సైక్లిస్టునో, స్కూటరిస్టునో ఢీకొంటే వారికి దిక్కేమిటి? సరిగ్గా ఇదే ఆలోచన హోవ్డింగ్ అనే కంపెనీకి వచ్చింది.

09/22/2016 - 22:06

ఇదో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. పేరు స్కూట్ మాటిక్ (డష్య్యఆ్ఘౄఆజష). ఒకసారి చార్జ్ చేస్తే 28 మైళ్లు పరుగెట్టే ఈ బుల్లి స్కూటర్‌ను ట్రాఫిక్ సమస్యలనుంచి గట్టెక్కించేందుకు ‘సోంట్’ కంపెనీ తయారు చేసింది. దీనిపై ఫుట్‌పాత్‌పై కూడా రయ్యిమంటూ దూసుకుపోవచ్చు. ఫోల్డ్ చేసుకునే వీలుండటం దీనిలో మరో ప్రత్యేకత. ధర 799 డాలర్లు.

09/22/2016 - 21:19

‘‘కొంతకాలం తర్వాత మళ్లీ హేమంత్‌తో స్నేహం కొనసాగింది. రాకపోకలు ప్రారంభమైనాయి. అహోబలరావుతో చెప్పి కొన్నిసార్లు, చెప్పకుండా కొన్నిసార్లు శే్వత హేమంత్‌ను కల్సుకుంటుండేది. చిన్న చిన్న బహుమతులు ఇచ్చినా, అవి అపురూపంగానే కనిపించేవి. ప్రేమకున్న ఆకర్షణ శక్తి భూమ్యాకర్షణ శక్తికన్నా గొప్పది.

09/22/2016 - 21:17

ఉ. ‘ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు; చక్కనై
పోవక నిల్వు నా కెదరిపోర మదీయ ధనుర్విముక్త నా
నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్ భ్రమఁబొంద కెమ్మెయిం
శోవఁగఁ బోలు నీకనుచుఁ బూరుకు లోత్తముఁ దాఁకె వీఁకతోన్

09/24/2016 - 02:16

ఆ సాధ్వి చితిలో ఉరికి తదగ్ని శిఖలనుంచి వెల్వడి కలుషాత్ముడైన పతి వెను వెంటనే ఏతెంచుచుండగా భీతచిత్తులై యమభటులు దవ్వుగా తొలగిపోతారు. ఈషణ్మాత్రమూ భీతిల్లిక చితాగ్ని నురికిన పతివ్రత శరీరంలో రోమకూపాలు ఎన్ని వున్నవో అన్ని దివ్య సంవత్సరాలు భర్తతో కలిసి స్వర్గలోకంలో సంతోషాన్ని అనుభవిస్తుంది.

Pages