S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 21:12

ఈ సృష్టి భగవంతుని ఆజ్ఞానుసారం ఓకారంనుండి మొదలైందని మహాత్ములు చెప్పిన మాట. మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా భగవంతుని దయ లేనిదే ఏమి చేయలేడన్నది అక్షర సత్యం. ఆదిమానవుడైనా.. నేటి మానవుడైనా ఆ భగవంతుడు ఇచ్చిన వాటితోనే జీవించాలి. అందుకు భగవంతుడు మనకు సర్వం ఇచ్చాడు. మనం జీవించటానికి మన మహాత్ములు ఏనాడో ఎన్నో సనాతన ధర్మాలు మనకు అందించారు.

09/22/2016 - 21:08

‘నీ ఆశ.. అడియాస, చేజారే మణిపూస’ అంటూ భారమైన స్వరంతో గంభీరంగా పాడినా, సిరిమల్లె పువ్వల్లే నవ్వు.. అంటూ నవ్వులే సాహిత్యంగా, ఓ ఝరిలా ఆలపించినా, గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన అంటూ చిన్నపిల్లలా ముద్దుముద్దుగా స్వరాలు పలికినా గుర్తొచ్చే జానకి లాలి పాటతో గీతాలాపనకు టాటా చెప్పారు. తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు సినీ ప్రియులకు పంచిన ఎస్.జానకి సినిమాల్లోను, ఇతర వేదికలపై గీతాలన ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

09/22/2016 - 21:05

టాలీవుడ్‌లో వున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన ఏది చేసినా కొత్తగా రిచ్‌గా వుంటుంది. ముఖ్యంగా కథలు రాసేటప్పుడు ఆయన తీరే వేరు. చక్కగా బ్యాంకాక్‌కు వెళ్లిపోయి పది పదిహేను రోజుల్లో కథను రాసుకొచ్చేస్తాడు. అలా బ్యాంకాక్‌లో రూపుదిద్దుకున్న అనేక కథలు సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌రామ్‌తో రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రాన్ని పూర్తిచేశాడు.

09/22/2016 - 21:04

జాతీయ అవార్డు పొందిన తమిళ సినిమా ‘విశారణై’ను 2017 ఆస్కార్ అవార్డులకు (విదేశీ సినిమాల కేటగిరీలో) మన దేశం తరఫున పంపుతున్నారు. మొత్తం 29 సినిమాలను పరిశీలించి, చివరకు ‘విశారణై’ను ఆస్కార్ ఎంట్రీకి పంపాలని ఎంపిక చేసినట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సుప్రన్ సేన్ గురువారం తెలిపారు. నటుడు ధనుష్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు వెట్రిమారన్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించారు.

09/22/2016 - 21:02

గోకుల్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్స్ పతాకాలపై పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి, కెవిన్ అనె్న, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను, ఆడియోను వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు.

09/22/2016 - 21:00

‘సాధారణంగా లవ్ ఫెయిల్యూర్స్ చాలామందికి ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే ఆ లవ్ ఫెయిల్యూర్స్‌ను దాటి వారి ప్రేమను సక్సెస్ చేసుకుంటారు’ అని అంటున్నాడు దర్శకుడు విరించి వర్మ. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న విరించి చేస్తున్న రెండో చిత్రమిది. నాని హీరోగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మజ్ను’.

09/22/2016 - 20:57

తెలుగులో విజయవంతమైనట్లుగానే తమిళంలో కూడా ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఎదురుచూస్తున్న రాశీకి మంచి అవకాశమే దొరికింది. అదనుచూసి హిట్ చిత్రంతో కోలీవుడ్‌ను ఏలాలనుకున్న ఆమెకు కాస్త ఆలస్యమైనా మంచి అవకాశం దొరికిందని ఆనందపడుతోంది. సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘సైతాన్ కా బచ్చా’ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

09/22/2016 - 20:56

అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశి, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘ఇదో ప్రేమలోకం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ఇదో అందమైన ప్రేమకథ అని, ప్రియుడికిచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని ఓ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ మహిళ కథనం ప్రధానంగా సాగుతుందని తెలిపారు.

09/22/2016 - 20:54

చిరంజీవి 151వ సినిమా దాదాపుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వుండబోతోందని టాలీవుడ్ భోగట్టా. రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. బోయపాటి శ్రీను చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చడంతో ఈ సినిమాను అల్లు అరవింద్ రూపొందించనున్నారని సమాచారం. అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్ సినిమాకు బోయపాటి శ్రీను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.

09/22/2016 - 20:53

నూతన నటీనటులు శరత్‌కళ్యాణ్, హనీగుప్తా, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన తారాగణంగా జె.వి.ఆర్ సినిమాస్, వైష్ణవి ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో జె.వి.ఆర్, దేశ్‌ముఖీరాజూ యాదవ్, శ్రీనివాస్ నేదునూరి సంయుక్తంగా రూపొందిస్తున్న ‘ఏమి సోదరా.. మనసుకేమయిందిరా’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Pages