S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 17:56

హైదరాబాద్‌ : 123 జీవో ద్వారా మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రక్రియ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తోంది. 2013 భూ సేకరణ చట్టం అమలుకు ప్రయత్నించవచ్చు. తీర్పుపై ఆపీళ్లకు వెళ్లి భూసేకరణ కొనసాగించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించవచ్చు.

08/03/2016 - 17:53

హైదరాబాద్‌ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి చెంపపెట్టు అని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. రైతులు, కూలీలకు ఈ తీర్పు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు. న్యాయస్థానం రైతులను కాపాడే విధంగా తీర్పు ఇచ్చిందని అన్నారు.

08/03/2016 - 17:50

హైదరాబాద్‌ : ఈనెల 7న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ తొలిసారిగా రాష్ర్టానికి వస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభను జయప్రదం చేయానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ నేత కిషనరెడ్డి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు సభకు రావాలని ఆయన కోరారు.

08/03/2016 - 17:47

గాంధీనగర్: గుజరాత్ సిఎం ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా పత్రాన్ని బుధవారం గవర్నర్ ఓపీ కోహ్లీకి సమర్పించారు. ముఖ్యమంత్రి రేసులో ఆరోగ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ బిజెపి చీఫ్ విజయ్ రూపాణి, కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రుపాలా, అసెంబ్లీ స్పీకర్ గణ్‌పత్ వాసవ ఉన్నారు. ఆనందిబెన్ రాజీనామాను బిజెపి పార్లమెంటరీ బోర్డు కూడా ఆమోదించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.

08/03/2016 - 17:45

హైదరాబాద్: రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.123, 124ను బుధవారం హైకోర్టు కొట్టేసింది. జహీరాబాద్ వ్యవసాయ కూలీలు ఈ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతులతోపాటు కూలీలకు పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు పేర్కొంది.

08/03/2016 - 17:42

కాకినాడ: సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రేణుకా గాయత్రి అనే విద్యార్థిని బుధవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను సహచర విద్యార్థినులు గుర్తించి పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఏ విషయాన్ని చెప్పేందుకు విద్యార్థినులు సుముఖత చూపడం లేదు.

08/03/2016 - 17:41

అనంతపురం: ఈ ఏడాది రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగిన సన్నాహాలు చేయడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

08/03/2016 - 17:41

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాకను నిరసిస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. హురియత్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సలాహుద్దీన్ పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సమావేశానికి భారత ప్రతినిధిగా రాజ్‌నాథ్ హాజరవుతున్నారు.

08/03/2016 - 17:22

దిల్లీ: సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతారాయ్‌ పెరోల్‌ను సెప్టెంబర్‌ 16వరకు సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. సహారా గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో 2014 మార్చిలో సుబ్రతరాయ్‌కు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3తో పెరోల్‌ గడువు ముగిసింది. రాయ్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రూ.300 కోట్ల డిపాజిట్‌ను కట్టాల్సిందిగా ఆదేశించింది.

08/03/2016 - 16:53

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీలకు ఈ నెల 28న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. పార్టీ నేతలు జైరాం రమేష్‌, కొప్పులరాజు పాటు మేధావులతో శిక్షణ తరగుతులు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

Pages