S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 01:10

ప్రపంచంలోనే అతి బలమైన ప్రజాస్వామ్య దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్‌లో ఇచ్చిన మాటకు విలువలేక పోవడం దారుణం. మేము కోరుకోని విభజనను బలవంతంగా చేసిన సమయంలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రకటన చేశారు. ఆయన ఐదేళ్లు ఇస్తామంటే, కాదు.. పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గట్టిగా తమ వాదనలు వినిపించారు.

08/04/2016 - 01:09

ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా తెలుగుదేశం పార్టీ ఇంకా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో హోదా విషయంలో అమీతుమీ తేల్చుకోవాలి. కానీ అలా చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నారు.

08/04/2016 - 01:08

విభజన సమయంలో అన్ని పార్టీలూ రాజకీయం చేశాయి. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలు ఏమి చేపట్టాలన్న అంశాన్ని పెడచెవిన పెట్టాయి. అయినప్పటికీ అప్పటి యుపిఎ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహారించింది. విభజన బిల్లులో అన్ని అంశాలనూ పేర్కొన్నది.

08/04/2016 - 01:07

విభజన చట్టం ఆమోదం పొందే సమయంలో పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండేళ్లపాటు కాలయాపన చేయడంవల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. తొలుతే అమల్లోకి వచ్చి ఉన్నట్లయితే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ప్రయాణం చేసి వుండేవాళ్లం.

08/04/2016 - 01:06

తెలుగు ప్రజల అభీష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారు. ఆనాటి ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కేంద్ర సంస్థలు, పోలవరం నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీకి నిధులు, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

08/04/2016 - 01:05

ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రత్యేక హక్కు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో చెలగాటమాడుతున్నాయి. వైకాపా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రత్యేక హోదా సాధించేంతవరకు విశ్రమించదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఆంధ్రకు తరలివస్తాయి. పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికే రెండేళ్లు గడచింది. ప్రత్యేక హోదా సాధనలో టిడిపి ఘోరంగా విఫలమైంది.

08/04/2016 - 01:04

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు హోదా కల్పించే అవకాశం ఎంత మాత్రం లేదు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల కోసం రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదాలో ఆంధ్ర ఇరుక్కుపోయింది. హోదా వచ్చే అవకాశం లేదు. కానీ హోదా తప్ప మరోటి అడిగే పరిస్థితి ఆ నాయకుల్లో కనిపించడం లేదు.

08/04/2016 - 01:03

హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తీవ్ర నష్టం జరిగిపోతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బిజెపియేతర పార్టీలన్నీ కృతకృత్యులయ్యాయి. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఆడుతున్న నాటకం ఇది. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి లాభం ఇంకా ఎక్కువ చేకూరుతుందనే విషయం ప్రజలు గ్రహించాలి.

08/03/2016 - 23:35

ఎత్తయిన కొబ్బరి చెట్లతో, గల గల పారే నీటి ప్రవాహాలతో పచ్చటి దుప్పటి పరిచినట్లు ఉండే కేరళలో పారిశుద్ధ్య కోసం నిబద్ధతతో పనిచేసే సుచిత్వా కమిషన్ గురించి రెండేళ్ల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు.

08/03/2016 - 23:11

మొటిమలతో ఇబ్బందిపడేవారు వేప, పుదీనా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే చాలు మొటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది.
-జిడ్డు చర్మం వారు ముఖానికి క్రీములు ఎక్కువగా వాడకూడదు.
-పుల్లటి పెరుగులో కొంచెం పసుపు, చెంచా కొబ్బరినూనె కలిపి ముఖానికి రాసుకుని మసాజ్ చేసి కాసేపయ్యాక కడగాలి. తరుచూ ఇలాచేస్తే మొటిమలు పోతాయి.

Pages