S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 04:36

ఈనాడు విద్యారంగానికి సవాలు ఏమిటంటే పిల్లల ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేయటం. అంటే అవగాహన అనే దాన్ని పరిశీలించటానికి ఒక కిటికీని తయారుచేయాలి. పిల్లల అవగాహనాశక్తిని పరిశీలించడానికి ఒక ద్వారాన్ని చూపించాలి. విద్యార్థి పాఠాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నాడు? తాను చూసిన విషయాలను ఎలా పరిశీలించ గలుగుతున్నాడు?

08/04/2016 - 04:34

జరిగిపోతున్న అక్రమ కలాపాల గురించి ఆక్రోశించడం వల్ల, పోటీ పడి ప్రచారం చేయడం వల్ల ఆయా దుష్ట పరిణామాలు ఆగవు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత బాలికలపై లైంగిక అత్యాచారాలు ఆగిపోలేదు. దృశ్యమాధ్యమ స్రవంతుల- ఛానల్స్-వారు ‘‘ఈ దుర్వార్తను మేమే ముం దుగా ప్రసారం చేస్తున్నాము..’’ అని పోటీ పడినందువల్ల ఆయా సమాజ వ్యతిరేక ఘోరాలు ఆగిపోవడంలేదు. మూడు కుక్కపిల్లలను భాగ్యనగరం శివారులలో ఎవరో దుండగులు కాల్చి చంపారట.

08/04/2016 - 04:32

ఒక జాతికి ఒకే ఆర్థిక నీతి ఉండాలి. ఒకే దేశం-ఒకేపన్ను- అన్న వాణిజ్య ఆదర్శం వాస్తవంగా మారుతుండడం హర్షదాయకం! వస్తు, సేవల పన్నుల-జిఎస్‌టి-బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అభిప్రాయ సమానత్వం ఏర్పడడం చారిత్రక పరిణామం. సంబంధిత రాజ్యాంగపు సవరణ బిల్లునకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలపడం పదకొండేళ్ల సమీకృత వాణిజ్య విధాన రూపకల్పన ప్రక్రియకు పరాకాష్ఠ.

08/04/2016 - 03:59

స్నేహానికి హద్దులు ఉండవు. పరిమితులు ఉండవు. స్నేహం ఒక గొప్ప ప్రవాహం లాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమను కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తిని కలిగిస్తుంది. అసంతృప్తిని దూరం చేస్తుంది. ఆశలను చిగురింపజ్తేంది. ఆశయాలను గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. కపటాన్ని, మోసాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు. వృద్ధిని కోరుకుంటుంది.

08/04/2016 - 03:56

ద్వారకానగరమంతా చిన్నబోయి ఉంది. ఇప్పుడు వధూవరుల సహితంగా మనం ద్వారవతికి వెళితే ఆ నగరం ఎంతగానో శోభిస్తుంది. ఉప్పొంగిపోతుంది అని ఆయనతో సంతోష వార్తలు ముచ్చటించుకుంటూ అంతఃపురంలో ఉన్న అనిరుద్ధుణ్ణి చూడటానికి పోతుండగా ఇంతలో చిత్రరేఖ వారికి ఎదురువచ్చి సంతోష స్వాగతం చెప్పింది.

08/04/2016 - 03:55

అందువల్లే అతడు కాలేజీలో అప్పటికే అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలని టార్గెట్‌గా పెట్టుకునేవాడు. తన డబ్బునో, పరపతినో మరి దేన్నో ఉపయోగించి కొద్దికాలం తర్వాత ఎలాగైనా వాళ్ళ రిలేషన్ బ్రేకయ్యేలా చేసి, మానసికంగా అమ్మాయిలు బలహీనమై ఉన్న సమయంలో వల వేసినట్లుగా వాళ్ళని తన దగ్గరికి రప్పించుకునేవాడు.

08/04/2016 - 03:49

చ. అతిశయ రూప వన గణాధిక సుందర మైన యాసత్
ద్వితయమునందు సంతత రతిన్ విపశుం డయి రాజకృత్యముల్
మతి నొకనాఁడుఁ జేయ కహిమద్యుతి తేజుఁడై రాజయక్ష్మ బా
ధితుఁడయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్ర వీర్యుఁడన్

08/04/2016 - 01:14

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మరోమారు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉందని, సమస్యలను అర్థం చేసుకుంటామని, పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ప్రత్యేక హోదాకు మరో ప్రత్యామ్నాయం లేదని తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు వాదిస్తున్నారు.

08/04/2016 - 01:12

పార్లమెంట్ వేదికగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీనుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దేశ సమగ్రత, ఐక్యతకు ప్రమాదం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధాని స్వయంగా ఇచ్చిన హామీ చట్టంతో సమానమే. ఏపి మొత్తానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయనుకుంటే, అదేస్థాయి సాయానికి మరో పరిష్కారం ఆలోచించాలి.

08/04/2016 - 01:11

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఉదారంగానే అనేక ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకపోవడానికి బలమైన కారణాలున్నాయి. రాజ్యాంగపరంగా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, దాని పరిణామాలు అనేకం ఉంటాయి.

Pages