S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 03:45

దీపక్ సరోజ్, మాళవిక మీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ కె రన్’. కందిమళ్ల వెంకట చంద్రశేఖర్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

07/21/2016 - 03:44

జైహింద్ పిక్చర్స్ పతాకంపై జైహింద్ గౌడ్ హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి తమ 90వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్’. ఈ చిత్రాన్ని పి.జైహింద్‌గౌడ్ నిర్మిస్తున్నారు.

07/21/2016 - 03:43

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

07/21/2016 - 03:42

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో పి.డి.రాజు, అభినయ, సాయికిరణ్, భానుచందర్ ప్రధాన పాత్రల్లో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు జాన్‌బాబు వివరాలు తెలియజేస్తూ, సినిమా మొత్తం పూర్తయిందని, అలాగే బిజినెస్ కూడా జరిగిందని అన్నారు.

07/20/2016 - 22:44

‘పంది బురద మెచ్చుగానీ పన్నీరు మెచ్చునా?’ అన్నాడు మహాకవి వేమనగారు. కానీ అక్కడ ఆ సంద్ర తీర నగరంలో అంతా అధునాతన జనాలే. బురద కోసం వెంపర్లాడుతూ వచ్చి నడుం లోతు బురద మడుగులో దొర్లుతారు, పొర్లుతారు, కేరింతలతో, ఆటా, పాట కలిపి, బురద సంబరాలు- ఒకటి కాదు, రెండు కాదు పది రోజులు సాగిస్తారు. దక్షిణ కొరియాలోని బొరియాగ్ నగరంలో రుూ ‘‘బురద హోలీ’’ జూలై 15 నుంచీ కడు రంజుగా సాగుతున్నాయి. ఇది 18వ బురద సంబరం.

07/20/2016 - 22:41

బంగారం, గంజాయి లాంటివి దొంగతనంగా తెచ్చే ప్యాసింజర్లని చూశాం గానీ, కుక్కల్ని సూట్‌కేసుల్లో క్రుక్కి, రహస్యంగా తమ కూడా విమానాల్లో తెచ్చుకుంటున్న యజమానులు- రుూమధ్య మూడుసార్లు దొరికారు.

07/20/2016 - 22:39

జార్ఖండ్ రాష్ట్రం కొండ జాతులలో యిప్పటికి అమాయక ఆదివాసుల తండాలున్నాయి. ‘బిహోర్’ కొండ జాతికి చెందిన అమోదేవి అనే ముగ్గురు పిల్లల తల్లికి నాలుగో కాన్పులో పండంటి బిడ్డను కన్నదిగానీ, మూడో రోజునే ఆ పసికందుని రెండు వేల రూపాయలకు అమ్మేసుకుంది. ఛాత్రా జిల్లాకి చెందిన ఒక వ్యపారి బిడ్డని కొనుక్కొని పోయాడు.

07/20/2016 - 22:37

సెల్ఫీల పిచ్చి నిత్యమూ- ఎక్కడో అక్కడ యువతీ యువకులకి ప్రాణహాని కలిగిస్తూనే వుంది. అలాగే రుూ కాలం సంకర జాతి కుక్కల కాలం అవడంతో కొన్ని కుక్కలు ‘విశ్వాసం’ అన్న గుణానే్న మరచిపోయాయి. యజమానులనే మట్టువెట్టేస్తున్నాయి. ఇంచుమించు ప్రతిరోజూ రుూమధ్య కుక్కలు పిల్లల్ని కొరుక్కుతినడం వార్తలు వెలువడుతూనే వున్నాయి.

07/20/2016 - 22:35

విందు భోజనం తర్వాత తమలపాకు కిళ్ళీ వేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. పండుగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో తమలపాకు తప్పనిసరిగా వుండాల్సిందే. రాజు, పేద తేడాలేకుండా అందరినీ రంజింపజేసే తమలపాకు పుట్టిల్లు మలేషియా. రెండువేల సంవత్సరాల క్రితమే ఇది ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది.

07/20/2016 - 22:33

వాళ్లను చూస్తేనే ముఖం ముడుచుకుంటాం.. అసహ్యించుకుంటాం.. చిరాకుపడతాం.. చీదరించుకుంటాం.. వాళ్లను తప్పించుకుని వెళ్లిపోవాలని చూస్తాం. వేషధారణ నుంచి అలంకరణ వరకు అంతా ఎబ్బెట్టుగానే వుంటుంది. వాళ్లే హిజ్రాలు!

Pages