S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 21:50

గవర్నర్ల అధికారాలు, పరిధి, విస్తృతి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత కాగా, గవర్నర్ రాష్ట్ధ్రానేతగా వ్యవహరిస్తారు. వాస్తవానికి గవర్నర్ పదవి నామకార్థమైనదే, భారత రాష్టప్రతికి ప్రతినిధిగా రాష్ట్రాలకు గవర్నర్లు వ్యవహరిస్తారు. ఐదేళ్ల పదవీకాలానికి గవర్నర్లను రాష్టప్రతి నియమిస్తారు.

07/20/2016 - 21:49

సంక్లిష్ట సమయంలో గవర్నర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర కీలకం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో, ఏ పార్టీకి మెజారిటీ రాని సమయంలో గవర్నర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. దీనికే గవర్నర్లు పరిమితం కారాదు. మిగిలిన సమయంలో విద్యా రంగంలో, కళా సాంస్కృతిక రంగాల్లో గవర్నర్లు కృషి చేయవచ్చు. అలా చేసి ఆదర్శంగా నిలిచిన గవర్నర్లు ఎంతో మంది ఉన్నారు.

07/20/2016 - 21:48

భారతదేశంలో ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన గవర్నర్‌ల వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టటం, జరిగిన అనైతికతను సరిదిద్దటం ఇందుకు ప్రబల నిదర్శనంగా పేర్కొనవచ్చు.

07/20/2016 - 21:47

గవర్నర్ల వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానం ఉండాలి. మనది సమాఖ్య తరహా వ్యవస్థ. ఏ సంఘటన జరిగినా ఒకవేళ ప్రభుత్వ నియంత్రణ తప్పినప్పుడు తప్పనిసరిగా గవర్నర్ రంగంలోకి వస్తారు. ఆంధ్ర, తెలంగాణ గవర్నర్‌ను చూడండి. ఇరువురు సిఎంలు కలుస్తున్నారు. సమస్యలను విన్నవిస్తున్నారు. పరిష్కారం సంగతి సరే.

07/20/2016 - 21:43

రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాజ్యాంగం గవర్నర్‌కు అధికారాలు కల్పించినప్పటికీ, అవి నామమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులు (జిఓలు) గవర్నర్ పేరుతో విడుదల అవుతున్నప్పటికీ, వాటితో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం ఉండటం లేదు. ఏ జీఓలో ఏముందో, ఏ జీఓ ఎందుకు వెలువరిస్తున్నారో గవర్నర్ ముందస్తు అనుమతి ఏమీ తీసుకోరు.

07/20/2016 - 21:40

వివిధ సందర్భాల్లో గవర్నర్ల పాత్ర చాలా వివాదస్పదమవుతోంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఎలా ఉండాలి.. వారికి ఉండే విధులు, అధికారాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కొన్ని సందర్భాల్లో గవర్నర్లు తమ పరిధిని దాటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వాలు పడిపోవడానికీ కారణమవుతున్నారు. ఇది దురదృష్టకరం. గవర్నర్ల ప్రమేయంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నది.

07/20/2016 - 21:39

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు మధ్య సంబంధాలు సజావుగా నడిపేందుకు, రాజ్యాంగపరమైన విధులను రాష్ట్రంలో నిర్వహించేందుకు గవర్నర్ కీలకమైన పాత్ర వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రను విస్మరించేందుకు వీలులేదు. గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ కాలంనుంచి మనకు సంక్రమించి ఉండవచ్చు. అంతమాత్రాన గవర్నర్ల వ్యవస్థవల్ల ఉపయోగం లేదనుకోవడానికి వీలులేదు.

07/20/2016 - 21:37

గవర్నర్ల వ్యవస్థకు కాలం చెల్లింది. బ్రిటిష్ కాలంనాటి పదవులు ఇవి. వీరివల్ల ఖజానాకు భారం. ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాజ్యాంగ పరిరక్షకులు తమ విధులను నిజాయితీతో నిర్వర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు మండిపడిన విషయం విదితమే. గవర్నర్లు రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా అపహాస్యం చేస్తున్నారు.

07/20/2016 - 21:36

ప్రజలచేత ఎన్నుకోబడకపోయినప్పటికీ గవర్నర్లు రాజకీయాలకు దూరంగా, ప్రజాభద్రతకు చేరువగా ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గవర్నర్లు పోషిస్తున్న పాత్ర అదే. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే వారి వారి జీవన విధానం వేర్వేరు కావచ్చు. ప్రజల అవసరాల మేరకో.. ఆధిపత్యం కోసమో గానీ ప్రజాభిప్రాయాలు రాజకీయంగా కలుషితమవుతున్నాయి. ప్రలోభాల మాయో.. అవసరాల నిమిత్తమో.. సమాజం మారిపోతోంది.

07/20/2016 - 18:26

దిల్లీ: బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతిపై బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ తరఫున కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విచారం వ్యక్తం చేశారు. మాయావతిని క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళపై నీచమైన పదాన్ని ఉపయోగించడం సరికాదని, దయాశంకర్ వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

Pages