S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 04:55

హైదరాబాద్, జూలై 20: మహానగర పాలక సంస్థ అధికారుల ఆలసత్వం పుణ్యమాని ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయి, పూర్తిగా గుంతలమయంగా తయారైన రోడ్లు. కొన్ని విఐపి రోడ్లు మినహా మిగిలిన రోడ్ల పరిస్థితి చాలా దారుణం. అడుగడుగున గుంతలు, ఆపై ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు..ఒకవైపు పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు,మరోవైపు తవ్వకాలు జరుగుతుండటంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం.

07/21/2016 - 04:55

హైదరాబాద్, జూలై 20: మహానగరంలో గడిచిన 36 గంటల్లో సుమారు ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడురోజుల క్రితం సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకరు సుమారు 48.6 మిల్లీ లీటర్ల వర్షం కురిసింది. అలాగే మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మరో పదిన్నర మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

07/21/2016 - 04:54

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. తెలంగాణలోని మూడు కేంద్ర కారాగారాలతో మొదలుకొని మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లల్లోనూ కలిపి 6,848 మంది ఖైదీలను నింపే అవకాశం మాత్రమే ఉంది. కాగా ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో ఇవి పనిచేస్తున్నాయి. అయితే కేంద్ర కారాగారాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

07/21/2016 - 04:53

కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే గాక తగ్గడం లేదు. టమాటాలు, పచ్చిమిచ్చి, బెండకాయలు ఒకటేమిటి, చాలా రకాల కూరగాయల ధరలు శరవేగంగా పెరుగుతుండటమే తప్ప తగ్గే సూచనలు కనబడటం లేదు. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇక నిరుపేదలు పస్తులుండాల్సిందేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు తగ్గేలా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
మోదీ దూరదృష్టి

07/21/2016 - 04:34

స్వీడన్ దేశానికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చి పడింది. అది వారికి అత్యవసరమైన ఇందనం కొరత. ఇంతకీ ఆ ప్రధాన ఇంధనం ఏమిటో తెలుసా? ‘‘చెత్త’’!! స్వీడన్‌లో చెత్త నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. చెత్త నిల్వలు తరిగిపోవడమంటే ఎవరికైనా సంతోషం కలిగించే విషయమే. కానీ స్వీడన్‌కి మాత్రం ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. విచిత్రంగా లేదూ? ఇంతకీ ఏమిటా ‘‘చెత్త’’కథ? వివరాలలోకి వెళ్దాం.

07/21/2016 - 04:32

విజ్ఞాన శాస్త్రంలో 1960లో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎందుకు విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడి పోతున్నాయి? దీనికి కారణం ఏమిటనే ఆలోచనలు మొదలయ్యాయి.

07/21/2016 - 04:31

‘చైనాకు ఇక్కడ చేతులేర్పడినాయి
రష్యాకు ఇక్కడ
రంగమేర్పడినాది..’’

07/21/2016 - 04:26

యావజ్జీవ కారాగారవాస శిక్షను గురించి మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టీకరణ నేర విచారణ ప్రగతికి మరో దిశా నిర్దేశనం. ఈ ఆజీవన నిర్బంధ శిక్ష స్వభావం గురించి, స్వరూపం గురించి ఆవశ్యకత గురించి గతంలో సైతం సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించి ఉంది, విశే్లషించి ఉంది, పథ నిర్దేశనం చేసి ఉంది.

07/21/2016 - 04:12

ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఇది అందరూ ప్రవచిస్తున్న ఆర్యోక్తి, వేదోక్తి. వేదాలు ఏ జాతికి ఏ మతానికి ఏ సంప్రదాయానికి చెందినవి కావు. సర్వమత సామరస్యానికి సమన్వయానికి చెందిన జీవన ధర్మం, విజ్ఞాన సర్వస్వం. ఈ వేదోక్తి భావం సవివరంగా తెలుసుకుందాం. స్థూలంగా దీని అర్థం ఇది. సత్యం ఒక్కటే. విప్రులు అనగా పండితులు ఈ సత్యమును బహు విధాలుగా చెప్పుదురు అని అర్థం.

07/21/2016 - 04:11

హల, ముసల లాంఛనుడివి కూడా నీవే. ద్విధావిభక్తమైంది నీ తేజస్సు. నీ బల పరాక్రమ శౌర్యతా స్ఫూర్తి కృష్ణ బలరామ రూపం పొంది రాక్షస సంహార కీర్తి అయింది. గత యుగంలో రావణ సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తివి నీవే. బలిని నిర్జించిన త్రివిక్రముడివి కదా నీవు. భూమ్యాకాశాలు, దిశలు, కాలము, చంద్రసూర్య వాయువహ్నులు నీ స్వరూప రూపాలే కదా దేవాదిదేవా! సృష్టి స్థితిలయకారుడివి నీవే!

Pages