S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 07:18

ఆర్మ్‌స్ట్రాంగ్‌పై వేటు పడిన తర్వాత మరెవరూ డోపింగ్‌కు పాల్పడరని నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి కూడా డోపింగ్ రహిత రేస్‌ను నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.

06/19/2016 - 07:14

* బ్రిటన్‌కు చెందిన బ్రాడ్లే విగిన్స్ 2012లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి బ్రిటిషర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా అతను కెరీర్‌లో నాలుగో ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా అతను అదే ఏడాది సొంతం చేసుకున్నాడు. లండన్‌లో టైమ్ ట్రయల్ విభాగంలో విగిన్స్ ఈ ఘనత సాధించాడు.

06/19/2016 - 07:14

‘రాజన్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. త్వరలోనే ఆయన వారసుడిని ప్రకటిస్తాం.’
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
‘రాజన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం బాధాకరం. ఆ నిర్ణయం నన్ను ఎంతో అసంతృప్తికి గురిచేసింది.’
- మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
‘్భరత విశ్వసనీయతను, సామర్థ్యాన్ని పెంచిన ఘనత రాజన్‌ది. ఆయన స్థానంలో రాబోయేవారు కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాం.’

06/19/2016 - 07:13

ముంబయి, జూన్ 18: ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మళ్లీ నేను కొనసాగలేను. రెండో దఫా ఈ పదవిని ఆశించడం లేదు.’ అని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా ఓ ఆర్‌బిఐ గవర్నర్ పదవి తీవ్ర చర్చనియాంశం కావడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాజన్‌కు వ్యతిరేకంగా, వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినది తెలిసిందే.

06/19/2016 - 07:11

* బిఎంఎక్స్ వంటి కొత్తకొత్త సైక్లింగ్ పోటీలు నేడు జోరుగా జరుగు తున్నాయ. వివిధ దేశాలు కూడా వివిధ పేర్లతో మారథాన్ సైక్లింగ్ పోటీ లను నిర్వహిస్తున్నాయ. అయతే టూర్ డి ఫ్రాన్స్‌ను పోలిన లేదా దానితో పోటీపడే సైక్లింగ్ రేస్ ఇప్పటి వరకూ రాలేదు.

06/19/2016 - 07:10

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 18: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నాడో సినీ కవి. అవును మరి.. ఇప్పుడిలాగే ఉంది మార్కెట్‌లో మార్కెట్ పరిస్థితి. సంచుల్లో డబ్బు, జేబుల్లో వంట సామాగ్రి తెచ్చుకునే దుస్థితి నేడు తలెత్తిందంటే అతిశయోక్తి కాదు. కూరగాయలు, పప్పులు, మాంసం, గుడ్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని ఆహారోత్పత్తుల ధరలు రెట్టింపయ్యాయి. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తారుమారైంది.

06/19/2016 - 07:09

ఆత్మకూర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రానున్న మూడేళ్లలో విద్యుదుత్పత్తిని చేయనున్నట్లు జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని దిగువ జూరాల సిబ్బందికి కొత్తగా నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఆత్మకూర్ పట్టణానికి సమీపంలో 14.30 కోట్ల రూపాయల నిధులతో జెన్‌కో సిబ్బందికి భవన సముదాయాన్ని నిర్మించారు.

06/19/2016 - 07:06

న్యూఢిల్లీ, జూన్ 18: దక్షిణ కొరియాతో భారత వాణిజ్యలోటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, మెరైన్, ఐటి, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో మరింతగా మార్కెటింగ్ అవకాశాలను కల్పించాల్సిందిగా దక్షిణ కొరియాను శనివారం భారత్ కోరింది. ఇరు దేశాలు తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇక్కడ సమీక్షించాయి. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించాయి.

06/19/2016 - 06:58

హిందూపురం, జూన్ 18:అనంతపురం జిల్లా పాడి రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. రోజువారీ పాల సేకరణను నిలిపివేయాలంటూ ప్రభుత్వ డెయిరీలకు అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో పాలను ఏం చేసుకోవాలో తెలియక రైతన్నలు బిక్క మొహం వేస్తున్నారు. దీనికి కారణం...ఏపి నుంచి పాలను కొనుగోలు చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని అధికారులు అంటున్నారు.

06/19/2016 - 06:55

భిక్కనూరు, జూన్ 18: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో ఒక మార్కు తక్కువ రావడంతో అర్హత సాధించలేకపోయానన్న బెంగతో తీవ్ర మనస్తాపానికి గు రైన ఒక విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జి ల్లా భిక్కనూరు మండలం తలమడ్ల గ్రామంలో శనివారం జరిగింది. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన డిఇడి విద్యార్థిని ముదాం సుస్మిత ఇటీవల జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసింది.

Pages