S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 06:33

అహ్మదాబాద్, జూన్ 18: దివంగత కాంగ్రెస్ ఎంపి ఎహ్‌సాన్ జాఫ్రీ జరిపిన కాల్పులు జనం రెచ్చిపోవడానికి కారణమైందంటూ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై తీర్పు చెప్పిన ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలను మారణకాండలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు శనివారం ఖండించారు.

06/19/2016 - 06:32

చెన్నై, జూన్ 18: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అన్నాడిఎంకె రానున్న స్థానిక పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఓ రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సమావేశానికి హాజరయ్యారు.

06/19/2016 - 06:30

కోట, జూన్ 18: బిహార్‌కు చెందిన ఆ సోదరులిద్దరు అంగవైకల్యాన్ని, పేదరికాన్ని జయించి తమ లక్ష్యాన్ని సాధించారు. ఆరు నెలల వయసులోనే పోలియో బారిన పడి వికలాంగుడిగా మారిన కృషన్ (19)ను పాఠశాల విద్య నుంచే అతని తమ్ముడు బసంత్ కుమార్ పండిట్ (18) తన భుజాలపై మోసుకుంటూ వస్తున్నాడు. గత మూడేళ్లుగా కోచింగ్ సెంటర్‌కు కూడా తన భుజాలపైనే మోసుకుంటూ తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నాడు.

06/19/2016 - 06:29

కొలంబో, జూన్ 18: భారత్ ఆర్థిక వృద్ధి పొరుగుదేశాలకు దోహదకారి కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో భారత్ సాయంతో పునర్నిర్మించిన స్టేడియంను శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో కలిసి మోదీ ప్రారంభించారు. 1996నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ స్టేడియంను దాదాపు 7 కోట్ల రూపాయల భారత్ సాయంతో పునర్నిర్మించారు.

06/19/2016 - 06:18

థానె, జూన్ 18: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువ గల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కుంభకోణంలో శనివారం మాజీ నటి మమతా కులకర్ణి పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్ బారన్ వికీ గోస్వామికి చెందిన ఈ మాదకద్రవ్యాల కుంభకోణంలో మమతా కులకర్ణి ప్రధాన నిందితురాలని థానె పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

06/19/2016 - 04:33

డి.ఎస్.సదాశివప్రసాద శర్మ, వీరవల్లి (కృష్ణా)
ప్ర:ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఒక గొప్ప జల వనరుల ప్రణాళికను- సౌరశక్తి ఉపయోగం ప్రణాళికను తయారుచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించమంటారా? కేంద్ర ప్రభుత్వానికా?
సమా:కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి దృష్టికి వచ్చే విధంగా పి.ఎమ్.ఓ ఆపీసుకు పంపించండి. రాష్ట్ర ప్రభుత్వానికైతే మీరు స్థానికులే కనుక తగు గుర్తింపు రాకపోవచ్చును.

06/19/2016 - 04:30

ఫంటినొప్పి ఎంత ఘోరమో అనుభవించినవాడికి తెలుస్తుంది. ఒకప్పుడు పన్ను నొప్పెడితే తీసేసేవారు. అది అప్పటి వైద్యం. కాలంతోపాటు ఇప్పుడు చికిత్సా విధానం కూడా మారింది. తియ్యడం చాలా అరుదు. నొప్పెడితే ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి దాన్ని కాపాడుతున్నారు. పంటి బాధితునికి వరంలా ఈ రూట్ కెనాల్ చికిత్స.
అసలు రూట్ కెనాల్ అంటే?

06/19/2016 - 04:27

......................
అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే
నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.
బిడ్డ పుట్టుకకు హేతువై విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్న. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా యిచ్చి ఎత్తుకి ఎదగాలని కోరుకునే
గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.

06/19/2016 - 04:10

విజయవాడ (క్రైం), జూన్ 18: సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులకు టోకరా వేసి లక్షలు వసూలు చేసిన ఓ ప్రైవేటు సంస్ధ నిర్వహకులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పటమట తోటవారి వీధిలో గత కొంతకాలంగా భారతీయ గ్రామీణ బహుళ రాష్ట్ర సహకార పరపతి సంఘం పేరుతో ఓ సంస్థ వెలిసింది.

06/19/2016 - 04:09

విజయవాడ, జూన్ 18: ఆగస్టు 12 నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు ఆగస్టు 8నాటికే పుష్కరనగర్‌లు సిద్ధంగా ఉంచాలని సంబంధిత పుష్కర నగర్ ఇన్‌ఛార్జిలకు సబ్ కలెక్టర్ డా.జి.సృజన సూచించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ పుష్కరనగర్‌ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Pages