S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 03:38

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటుపై హీరోయిన్‌గా తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. తాజాగా తెలుగు తెరకు పరిచయమై నటించిన చిత్రం ‘జంటిల్‌మన్’. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, సురభి హీరోయిన్లుగా నటించారు.

06/19/2016 - 03:35

తెలుగులోకంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి ఈమధ్య టాలీవుడ్‌లో కూడా మంచి ఇమేజ్ దక్కింది. వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న అంజలి, ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చిత్రాంగద’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం కోలీవుడ్‌లో అంజలిపై ఓ న్యూస్ జోరుగా ప్రచారం సాగుతోంది.

06/19/2016 - 03:34

సినిమాలో నటించినంత మాత్రాన ఎవరు ఏది రాస్తే అది ఒప్పుకోవాల్సిందేనా? అనవసరంగా లేనిపోనివి అన్నీ రాసి ఇబ్బందిపెడుతున్నారంటూ మీడియాపై చిందులేస్తోంది అందాల నటి శిల్పాశెట్టి. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఆమె అవకాశాలకోసం వెంపర్లాడుతోంది. తెలిసిన వాళ్లను కలిసి అవకాశాలు ఇమ్మని అడుగుతోందట.

06/19/2016 - 03:33

చేతిలో డబ్బుంటే ఏదైనా చేయచ్చు. మంచి పనీ చేయచ్చు. ఎవరికీ పనికిరాని పనీ చేయచ్చు. అలా ఈసారి చేతి నిండా డబ్బుండడంతో రకుల్‌ప్రీత్‌సింగ్ గ్యాంబ్లింగ్ ఆటకు సై అన్నదట. మన దేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ అభిమానులు చుట్టేస్తారు కనుక రకుల్ ఈసారి లాస్‌వెగాస్ వెళ్లింది. ఆ పట్నం అంటేనే గ్యాంబ్లింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నోసార్లు ఆ ఆట ఆడే ముచ్చటను వాయిదా వేసుకున్న రకుల్ ఈసారి నిజంగానే ఆటలో దిగేసింది.

06/19/2016 - 03:31

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వాఠకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రవీందర్‌రెడ్డి రూపొందించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని నాగార్జున, గోపీచంద్ విడుదల చేయగా, ఆడియో సీడీని ఎ.ఆర్.రహమాన్ ఆవిష్కరించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.

06/19/2016 - 03:29

తమిళంలో జాక్సన్‌దొరైగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘దొర’ పేరుతో అందిస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, అతని కుమారుడు శిబిరాజ్ నటించారు. బిందుమాధవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జక్కం జవహర్‌బాబు తెలుగులో అందిస్తున్నారు.

06/19/2016 - 03:28

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజనాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

06/19/2016 - 03:04

హైదరాబాద్, జూన్ 18: టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం విలేఖరుల సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు.

06/19/2016 - 03:06

తొగుట, జూన్ 18: మల్లన్న సాగర్ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థులంతా ఆందోళన చేస్తుంటే గ్రామానికి చెందిన కొందరు భూములను రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహించిన మహిళలు వారి పంటలను ధ్వంసం చేసి, డ్రిప్ పైప్‌ను దగ్ధం చేసిన సంఘటన తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో శనివారం నాడు జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పంట భూముల్లోకి వెళ్లి మొక్కజొన్నను పీకివేశారు. డ్రిప్‌పైప్‌లు దగ్ధంచేశారు.

06/19/2016 - 03:05

హైదరాబాద్, జూన్ 18: నిజాంసాగర్ ఆధునీకరణకు ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండు లక్షల 32 వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నిజాంసాగర్ ఆధ్వాన్న పరిస్థితిలో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు 549 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడది 742 కోట్ల రూపాయలకు పెరిగింది. నిజాం హయాంలో మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకు రావడానికి ఆధునీకరణ పనులు చేపట్టారు.

Pages