S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 06:49

అమెరికా సైక్లిస్టు లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏడు పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. కానీ, నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా అతను పరువుతో పాటు టైటిళ్లను, రికార్డులను కోల్పోయాడు. డోపింగ్ విషయం బయటపడక ముందు అతను రియల్ హీరోగా వెలిగిపోయాడు.

,
06/19/2016 - 06:49

మాస్కో, జూన్ 18: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో 186 రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించిన ముగ్గురు వ్యోమగాములు శనివారంనాడు భూమికి తిరిగివచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3.15 గంటలకు వీరు సూయుజ్ టిఎమ్‌ఏ-19ఎం అనే వ్యోమనౌకలో కజకిస్థాన్‌లో సురక్షితంగా దిగారు. వీరు స్పేస్ స్టేషన్‌లో బయాలజీ, బయో టెక్నాలజీ, భౌతికశాస్త్రం తదితర అంశాలపై ఎన్నో ప్రయోగాలు నిర్వహించినట్లు నాసా తెలిపింది.

06/19/2016 - 06:45

బీజింగ్, జూన్ 18: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు చైనాలో పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బీజింగ్‌లోని ఛాయాంగ్ పార్క్‌లో భారత రాయబార కార్యాలయం సహకారంతో ‘యోగి యోగ’ సంస్థ నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.

06/19/2016 - 06:44

జయాపజయాల విషయం ఎలావున్నా ఇది సాదాసీదా సైక్లింగ్ రేస్ కాదు. పచ్చని పంటపొలాలు, పిల్లకాలువలు, ఎత్తయిన కొండల మీదుగా సాగే ఈ రేస్‌ను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ రేస్‌లో కల్నల్ డు టర్మలెట్ అతి క్లిస్టమైన దశ. 1910లో తొలిసారి ఈ మార్గం మీదుగా రేస్‌ను కొనసాగించగా, అక్టోవ్ లాపెజ్ మొదటి విజేతగా నిలిచాడు. 1947 నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఈ మార్గం మీదుగా రేస్ కొనసాగిస్తున్నది.

06/19/2016 - 06:42

న్యూఢిల్లీ, జూన్ 18: పోలియో రహిత దేశాలుగా భారత్‌సహా సార్క్ దేశాల హోదాకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ఈ వ్యాధికి సంబంధించిన అవశేషాలు అరుదుగా కనిపించడం కొత్తేమీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) శనివారం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో పోలియో అనుమానంతో ఆరేళ్ల బాలికను ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటన చేసింది.

06/19/2016 - 06:41

ప్రత్యేక విమానం నుంచి, జూన్ 18: పౌర అణు ఇంధన రంగంలో ఘనాకు పూర్తిస్థాయిలో సహకరించడానికి భారత్ అంగీకరించింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా దేశాల్లో ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుని తిరిగివస్తూ ప్రత్యేక విమానంలో మీడియాతో ముచ్చటించారు. పౌర అణు ఇంధన రంగంలో సహాయ, సహకారాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

06/19/2016 - 06:39

న్యూఢిల్లీ, జూన్ 18: రెగ్యులేటరీ వ్యవస్థల ఉదాసీనత, అవినీతి కారణంగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రోత్సాహంతో అరకొర వసతులు కలిగిన ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు రావడానికి దారితీస్తోందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి బోధనా ‘దుకాణాల’ను అదుపు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది.

06/19/2016 - 06:37

లండన్, జూన్ 18: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గురువారం సాయంత్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో ప్రముఖ సామాజికవేత్త సుహెల్ సేథ్ నూతన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దర్శనమిచ్చాడు.

06/19/2016 - 06:35

వాషింగ్టన్, జూన్ 18: పిల్లలను కలిగి ఉండటం కంటే వారికి తండ్రిగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా నడుచుకోవడం ఎంతో ఉన్నతమైన విషయమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఉద్యోగాలు చేస్తున్న తండ్రులు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అనువైన రీతిలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి వివరిస్తూ ఒబామా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

06/19/2016 - 06:35

బిలాస్‌పూర్, జూన్ 18: దేశంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, అదో మునిగిపోతున్న నౌక అని బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నగరంలో శనివారం వికాస్ పర్వ్ ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్ కాంగ్రెస్ పార్టీని ఇంకెవరూ కాపాడలేరని ఎద్దేవా చేశారు. చత్తీస్‌గఢ్ మాజీ సిఎం అజిత్ జోగీ కాంగ్రెస్ నౌకకు రంధ్రం చేశారని ఆయన అన్నారు.

Pages