S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 05:05

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన రెండు చైన్‌స్నాచింగ్ సంఘటనలు మరువక ముందే గురువారం తుకారం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, మరో రెండు ప్రాంతాల్లోనూ చైన్ స్నాచింగ్‌లు జరిగాయి.

06/17/2016 - 05:04

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జూన్ 16: మహనగరంలో మళ్లీ పోలియో వైరస్ నిర్దారణ కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నాలాల్లోని వ్యాక్సిన్ల నుంచి ఈ వైరస్ వృద్ది చెందినట్లు ఇప్పటికే ఓ అభిప్రాయానికిన వచ్చిన అధికార యంత్రాంగం సర్కారు ఆదేశాల మేరకు పోలియోపై సమరం ప్రకటించింది.

06/17/2016 - 04:53

హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి 20 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది.

06/17/2016 - 05:02

హైదరాబాద్, జూన్ 16: పూజల పేరిట లైఫ్‌స్టైల్ భవనం యజమానిని బురిడీ కొట్టించి, 1.30 కోట్ల నగదుతో ఉడాయించిన దొంగ బాబా ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుబడ్డాడు. బెంగళూరు శివార్లలోని ఓ ఇంట్లో తలదాచుకున్న బాబా శివను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

06/17/2016 - 04:47

హైదరాబాద్, జూన్ 16: ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసిని నడపడం కంటే మూసివేయడం మేలు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతో కార్మికులు సమ్మెలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

06/17/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 16: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలి దశలో 5 వేలమంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి రెండు మూడు రోజుల్లో నియామక పత్రాలను జారీ చేయాల్సిందిగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

06/17/2016 - 04:41

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో సాగు-తాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలని భావిస్తున్న కాంగ్రెస్, వాటిని నిరూపించేందుకు పడుతున్న మీనమేషాలకు ఎట్టకేలకు తెరపడింది. అందులో భాగంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి, అక్కడే ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఎట్టకేలకు కదలిక మొదలయింది.

06/17/2016 - 04:40

కర్నూలు, జూన్ 16: కర్నూలు నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికార వర్గాల సమాచారం. రానున్న రెండేళ్లకాలంలో నిర్మాణం పనులు పూర్తిచేసి 2018 మే నెలలో విజయవాడకు తొలి విమానం నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

06/17/2016 - 04:39

హైదరాబాద్, జూన్ 16: సాగునీటి ప్రాజెక్టుల కోసం 123 జీవో కింద భూములు ఇవ్వాలని రైతులపై ఎందుకు వత్తిడి తెస్తారంటూ హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

06/17/2016 - 04:36

హైదరాబాద్, జూన్ 16:వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించి జగన్‌కు ఝలక్ ఇచ్చిన తెలుగుదేశం నాయకత్వానికి ఇప్పుడు బదిలీల వ్యవహారం తలనొప్పిలా పరిణమించింది. 20 నియోజకవర్గాల నుంచి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు, అంతకుముందు నుంచే పార్టీలో పనిచేస్తున్న ఇన్చార్జిలకు బహిరంగయుద్ధం జరుగుతుండటంతో..బదిలీల విషయంలో ఎవరి మాటకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక టిడిపి నాయకత్వం తలపట్టుకుంది.

Pages