S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
06/17/2016 - 05:35

న్యూఢిల్లీ, జూన్ 16: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి రవి శాస్ర్తి, సందీప్ పాటిల్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈనెల 21 నుంచి 24 వరకు ధర్మశాలలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కీలక సమావేశం జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వాహణతోపాటు పాలనా వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించడం వంటి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

06/17/2016 - 05:29

గోవా, జూన్ 16: నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా క్రికెట్ సంఘం (జిసిఎ) అధికారులు ముగ్గురని పోలీసులు అరెస్టు చేశారు. సంఘం అధ్యక్షుడు చేతన్ దేశాయ్, కార్యదర్శి వినోద్ ఫడ్కే, కోశాధికారి అక్బర్ ముల్లా భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చాయని, కోర్టు వారెంటు జారీ చేయడంతో వారిని నిర్బంధంలోకి తీసుకున్నామని గోవా పోలీసులు తెలిపారు.

06/17/2016 - 05:19

సికింద్రాబాద్, జూన్ 16: వైద్యాన్ని పేదలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి ఆధ్వర్యంలో సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాత్రి సమయంలో రోగుల బంధువులకు భోజనాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

06/17/2016 - 05:19

హైదరాబాద్, జూన్ 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెరుగైన పారిశుద్ధ్యం కోసం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని మరో 20 కార్పొరేషన్లకు ఆదర్శమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు గుర్తించిన 1116 ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లను రూపుమాపేందుకు అధికారులు అమలు చేసిన వినూత్న పద్దతులు సత్ఫలితాలిచ్చిన సంగతి తెలిసిందే!

06/17/2016 - 05:18

హైదరాబాద్, జూన్ 16: జిల్లాల వారిగా స్థానిక సమస్యల పరిష్కారంకోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని టిడిడి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో కార్యకర్తల వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రజల అజెండా అనే నినాదంతో ప్రజాందోళనలు నిర్వహించడానికి వారం రోజుల్లో తగిని కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.

06/17/2016 - 05:18

రాజేంద్రనగర్, జూన్ 16: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేంత వరకు విశ్రమించేది లేదని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన కోరణి బాల్‌రాజ్‌కు ఎన్నిక నియామక పత్రాన్ని సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

06/17/2016 - 05:17

బేగంపేట, జూన్ 16: నగరంలో చైన్‌స్నాచర్లు విజృంభిస్తున్నారు. స్నాచింగ్‌లు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. గంట వ్యవధిలో మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నార్త్‌జోన్ పరిధిలోని గోపాలపురం, మహంకాళి, తుకారంగేట్ పోలీస్‌స్టేషన్లలో సంఘటనలు జరిగాయి.

06/17/2016 - 05:16

కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 16: పిల్లలు బాల్యం నుండే చదువుపై శ్రద్ధ పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని బాలాజీనగర్ కార్పొరేటర్ పన్నాల కావ్యా హరీష్‌రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వివేక్‌నగర్‌లోగల ఎంపిపి స్కూల్‌లో పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కావ్యాహరీష్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు.

06/17/2016 - 05:15

వికారాబాద్, జూన్ 16: కడిగిన ముత్యం లాంటి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను విమర్శించడం సరికాదని చేవెళ్ల ఎమ్మెల్యే కె.యాదయ్యకు వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు.

06/17/2016 - 05:15

గచ్చిబౌలి, జూన్ 16: ఇంట్లో పనిచేసే పనిమనిషిపై యజమాని అత్యాచారం చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా కాలనీలోని ఎంఎసఆర్ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ(27) పని మనిషిగా చేస్తోంది. గతంలో పనిచేసి మానివేసి మళ్లీ ఈఏడాది జనవరిలో పనిలో చేరింది. ఇంటి యజమాని సోమిరెడ్డి(72) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని భర్తకు, ఆడపడుచుకు చెప్పింది.

Pages