S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 02:02

సికింద్రాబాద్, మే 2: గ్రేటర్‌లోనే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖామంత్రి టి.పద్మారావు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని అంబర్‌నగర్‌లో దాదాపు రు.49లక్షలతో సివరేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

05/03/2016 - 02:02

హైదరాబాద్, మే 2: రాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల పెరిగిపోయిన మావోయిస్టుల కదలికలను పొరుగు రాష్ట్రాలతో సమాచార మార్పిడి చేసుకోవటం ద్వారా నియంత్రించేందుకు పోలీసు బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

05/03/2016 - 02:02

హైదరాబాద్, మే 2: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. భగవంతుడి తర్వాత మనకు ప్రాణం పోసే అరుదైన శక్తి ఒక్క వైద్యుడికే ఉంది. అందుకే దేవుడి తర్వాత దేవుడిగా మనం వైద్యులను గౌరవిస్తాం!

05/03/2016 - 02:00

విజయవాడ, మే 2: జీవనది కృష్ణా రానురాను అడుగంటిపోతోంది. కృష్ణా, గుంటూరు, పాక్షికంగా ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచినీటి వనరుగా ఉన్న కృష్ణానదిలో ఇసుక తినె్నలు బయటపడి ఎడారిని తలపిస్తోంది.

05/03/2016 - 02:00

హైదరాబాద్, మే 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో పాలక మండలి ఎన్నిక ఆర్భాటంగా, పనితీరు తూతూమంత్రంగా తయారైంది. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత రెండున్నర నెలల క్రితం ఎన్నికైన కొత్త పాలక మండలిలో ఒకింత స్తబద్దత నెలకొంది. మొత్తం 150 కార్పొరేటర్ సీట్లకు గాను అధికార తెరాస పార్టీ 99 గెల్చుకుని ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఖంగుతినిపించిన ఉత్సాహాం గెలిచిన తర్వాత ఏ మాత్రం కన్పించటం లేదు.

05/03/2016 - 01:59

హైదరాబాద్, మే 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. జిహెచ్‌ఎంసి జంటనగరవాసులకు అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో పారిశుద్ద్యం పనులను ప్రైవేటు పరం చేస్తూ గతంలో రాంకీ ఎన్విరో సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకించటంతో అమలు చేయకుండా మూలనపడేసిన అధికారులు ఇపుడు ఎంతో వ్యూహాత్మకంగా మళ్లీ రాంకీ సంస్థను రంగప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

05/03/2016 - 01:43

కరీంనగర్, మే 2: పిడుగులు పడినా, భూకంపాలు వచ్చినా తెలంగాణ వాటా జలాలు వాడుకుని తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే సమైక్య పాలకులు విడుదల చేసిన జీవోల ప్రకారం, అధికారులు అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణకు కేటాయించిన 1300 టిఎంసి పైచిలుకు జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి వాడుకుంటామని తెగేసి చెప్పారు.

05/03/2016 - 01:41

హైదరాబాద్, మే 2: రాష్ట్రంలో వాయిదా వేసిన ఎమ్సెట్, టెట్ పరీక్షల తేదీలను సోమవారం ఖరారు చేశారు. మే 15న ఎమ్సెట్, 22న టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇకమీదట అన్ని ప్రవేశపరీక్షలను ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎమ్సెట్ హాల్‌టిక్కెట్లు మే 12 నుండి జారీ చేస్తామని, పరీక్ష మే 15న జరుగుతుందని, ఫలితాలను మే 27న ప్రకటిస్తామన్నారు.

05/03/2016 - 01:41

19వ ప్రెసింక్ట్ (పోలీసుస్టేషన్)లో కూర్చుని ఉన్న ఆల్బర్ట్‌ని చూడగానే అతనిలో పూర్వంగల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం లోపించాయని నాకు అనిపించింది.
‘్థంక్ గాడ్. మీరు వచ్చినందుకు థాంక్స్ మిస్టర్ జోర్దాన్’ అతను నా చేతిని అందుకుని కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘విన్నాను. నువ్వు ఆమెని చంపావా?’ అడిగాను.
అతను తల అడ్డంగా ఊపాడు.

05/03/2016 - 01:39

ఆదిలాబాద్, మే 2: దప్పిక తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు లేకపోవడంతో తడారిన గొంతులతో ఇద్దరు పసిపిల్లలు కన్నుమూశారు. గొంతెండిపోయి ఊపిరాడని స్థితిలో సొమ్మసిల్లి కన్నుమూసిన దయనీయ సంఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలో చోటుచేసుకుంది. గుక్కెడు నీళ్లు దొరికితే బిడ్డల దాహం తీర్చాలని తల్లి తాపత్రయపడింది. పిల్లల ప్రాణాలు కాపాడుకోడానికి అడవంతా గాలించింది.

Pages