S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 04:06

కాకినాడ, ఏప్రిల్ 15: కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్ పదవిని ఆశిస్తున్న పలువురు ఆశావహులు రాజధాని స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ పదవి కోసం వర్సిటీకి చెందిన కొందరు విభాగాధిపతులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఖాళీ అవుతున్న రిజిస్ట్రార్ కుర్చీ కర్చ్ఫీ వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.

04/16/2016 - 04:03

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 15: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ కాళహస్తి ప్రాంతంలో నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల నుంచి రెండు వారాల వరకు ఉత్సవాలు జరగనున్నాయి. నవమి సందర్భంగా శుక్రవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిగింది. నెహ్రూ వీధిలోని శ్రీరామ మందిరం కల్యాణోత్సవం ప్రసన్న వరదరాజస్వామి ఆలయ ఆవరణలో జరిగింది.

04/16/2016 - 04:03

చంద్రగిరి, ఏప్రిల్ 15: చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి మూల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు పీతాంబరాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో వైభవంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

04/16/2016 - 04:02

రేణిగుంట, ఏప్రిల్ 15: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు రేణిగుంట అంతర్జాతీయ విమనాశ్రయంలో శనివారం ఉదయం వివిధ శాఖల అధికారులు, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

04/16/2016 - 04:02

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15: పాలనలో అవినీతి లేకుండా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన 68వ జన్మదినోత్సవాన్ని శ్రీ కాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.

04/16/2016 - 04:01

బంగారుపాళ్యం, ఏప్రిల్ 15: మండల పరిధిలోని గుండ్లకట్టమంచి సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంగారుపాళ్యం పోలీసుల కథనం మేరకు చిత్తూరువైపు నుంచి పలమనేరుకు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

04/16/2016 - 04:01

చంద్రగిరి, ఏప్రిల్ 15: చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో ధ్వజస్థంభం ప్రతిష్ఠాపనలో చిన్న అపశ్రుతి చోటుచేసుకోవడంతో సభ్యులందరూ ఒక్కసారిగా శ్రీరామ నామస్మరణతో మారుమోగిన సంఘటన శుక్రవారం చంద్రగిరిలో జరిగింది. చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం టిటిడి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని భాగంగా తొలుత పాత ధ్వజస్థంభాన్ని తొలగించి నూతన ధ్వజస్థంభాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

04/16/2016 - 04:00

చిత్తూరు, ఏప్రిల్ 15: నగరంలో ఉదయ భానుడు ఉగ్రరూపం చూపుతుండడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గత మూడు రోజులుగా ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9గంటలకే ఉదయ భానుడు భగ భగలతో నగర వాసులు హడలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. నగరంలో గత మూడు రోజులుగా సుమారు 40నుండి 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి.

04/16/2016 - 03:59

బైరెడ్డిపల్లె, ఏప్రిల్ 15: మండలంలోని కడదట్లపల్లె అటవీ సమీప వ్యవసాయ పొలాల్లో పంట పొలాలపై గురువారం రాత్రి ఏనుగుల గుంపు దాడులు చేపట్టింది. కడదట్లపల్లెకు చెందిన అబ్దుల్‌ఖాదర్‌కు చెందిన 50సెంట్ల వరి, అసన్‌బాషాకు చెందిన 30సెంట్ల వరి పంట కోత దశలో ఉండగా ఏనుగులు దాడులు చేపట్టడంతో 25వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు.

04/16/2016 - 03:59

తిరుమల, ఏప్రిల్ 15: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ఆస్థానం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామస్వామివారికి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ నేపథ్యంలో శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో పునర్వసు నక్షత్రయుత కర్కాటక లగ్నంలో శ్రీరాముడిగా అవతరించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి అతిపవిత్రమైనది.

Pages