S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 03:46

రాజంపేట, ఏప్రిల్ 15: రాష్ట్రంలో కెజి నుండి పిజివరకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

04/16/2016 - 03:45

ఒంటిమిట్ట, ఏప్రిల్ 15: శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఏక శిలానగరం ఒంటిమిట్ట జన సంద్రమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రెండో రోజు ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువలా నిర్వహించారు. వేలాది మంది భక్తుల రామనామ స్మరణ మిన్నంటింది. ఉదయం 9.30 నిమిషాల శుభ ఘడియలో ధ్వజస్థంభంపై ధ్వజారోహణ చేశారు. అప్పటికే ఆలయం భక్తులతో నిండిపోయింది.

04/16/2016 - 03:39

కళ్యాణదుర్గం, ఏప్రిల్ 15 : పట్టణంలోని అనంతపురం రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సును వేఘనంగా వచ్చి బైకు ఢీకొనడంతో శెట్టూరు గ్రామానికి చెందిన మంగళి గోపీ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. శెట్టూరు నుంచి అనంతపురం ఆసుపత్రిలో ప్రసవానికి చేర్పించిన కూతురి వద్దకు డబ్బు తీసుకుని బైకుపై వెళ్తున్న గోపీ వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

04/16/2016 - 03:38

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 15: శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించి ఉట్లమాను పండుగలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్లమాను పండుగను చూసేందుకు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు తరలివచ్చారు. ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఉట్లమాను పండుగ నిర్వహించారు. 5వరోడ్డు, 4వరోడ్డు, ఆజాద్‌నగర్, అంబేద్కర్ నగర్, పాతవూరు తదితర ప్రాంతాల్లో ఉట్లమాను కార్యక్రమం నిర్వహించారు.

04/16/2016 - 03:38

కొత్తచెరువు, ఏప్రిల్ 15: సనాతన సాంప్రదాయాలను గౌరవించినపుడే భవిష్యత్ తరాలకు సాంప్రదాయాల విలువ తెలుస్తాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైలేపల్లి క్రాస్ వద్ద జెడ్‌పిటిసి దాల్‌మిల్ సూరి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల పరుగుపందెం పోటీలు శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో భారీ ఎత్తున ఎద్దుల బండ్లు పాల్గొన్నాయి.

04/16/2016 - 03:37

హిందూపురం టౌన్, ఏప్రిల్ 15 : శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవాలు భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగాయి.

04/16/2016 - 03:36

గుంతకల్లు, ఏప్రిల్ 15 : శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం కమనీ యంగా సాగింది. నెట్టికంటి సన్నిధిలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వధూవరుల తిరు కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.

04/16/2016 - 03:35

మడకశిర, ఏప్రిల్ 15 : శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని మెట్టబండ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్త జన సందోహం నడుమ కల్యాణోత్సవం జరిపించారు. ఉదయ ం 8 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు.

04/16/2016 - 03:34

అనంతపురం, ఏప్రిల్ 15 : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం జిల్లా సగటు ఉష్ణోగ్రత 42.2 డిగ్రీలు నమోదు కాగా తరిమెలలో 45.2 డిగ్రీలు నమోదైంది.

04/16/2016 - 03:34

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 15: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నగరంలోని వివిధ ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో రామనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మొదటి రోడ్డు కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

Pages